ప్రభాస్: ప్రభాస్ బాహుబలి.. ఆరడుగుల ఎత్తు.. అంతకుమించిన ఆజానుబాహుడు.. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినప్పటికీ.. ప్రభాస్ కడుపును మాడ్చుకోడు. శుభ్రంగా తింటాడు.. “భీమవరం రాజు” అనే పేరును సార్ధకం చేస్తూ ఉంటాడు. తను తినడం మాత్రమే కాదు.. పదిమందికి పెట్టడంలో కూడా అదే స్థాయి చూపిస్తుంటాడు ప్రభాస్. తోటి నటులు.. సాంకేతిక నిపుణులు.. ఇలా భేదం ఉండదు. తన సినిమాలో చేసిన వారు అడిగిందే ఆలస్యం.. వెంటనే తెచ్చి పెడుతుంటాడు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే […]
ప్రభాస్: ప్రభాస్ బాహుబలి.. ఆరడుగుల ఎత్తు.. అంతకుమించిన ఆజానుబాహుడు.. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినప్పటికీ.. ప్రభాస్ కడుపును మాడ్చుకోడు. శుభ్రంగా తింటాడు.. “భీమవరం రాజు” అనే పేరును సార్ధకం చేస్తూ ఉంటాడు. తను తినడం మాత్రమే కాదు.. పదిమందికి పెట్టడంలో కూడా అదే స్థాయి చూపిస్తుంటాడు ప్రభాస్. తోటి నటులు.. సాంకేతిక నిపుణులు.. ఇలా భేదం ఉండదు. తన సినిమాలో చేసిన వారు అడిగిందే ఆలస్యం.. వెంటనే తెచ్చి పెడుతుంటాడు.
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా భారీ ఖర్చుతో ప్రదర్శిస్తోంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఈ సినిమాలో నటిస్తున్న ఇమాన్వి పుట్టినరోజు నేపథ్యంలో.. హీరో ప్రభాస్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు..
సాధారణంగా తోటి నటులకు అద్భుతమైన ఫుడ్ పంపించి ఆశ్చర్యపరుస్తారు ప్రభాస్. ఇమాన్వి పుట్టినరోజు విషయంలో కూడా అదే స్థాయిలో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆకాశంలో ఎగిరేటివి.. నీళ్లలో పాకేవి.. నేలమీద నడిచేవి.. ఇలా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు.. వెజ్ వంటకాలు.. అదిరిపోయే స్థాయిలో తయారుచేసి ఇమాన్వికి పంపించాడు ప్రభాస్. ఇందులో జున్ను.. కొబ్బరి పాలు.. నేతి లడ్డూలు ప్రత్యేకంగా నిలిచాయి. డైనింగ్ టేబుల్ మీద దాదాపు 100కు తక్కువ కాకుండా వెరైటీలు ఉన్నాయి. ఆ వెరైటీలను చూస్తే ఏదో ఫుడ్ ఫెస్టివల్ లాగే ఉంది. అన్ని రకాల వంటకాలు తయారు చేయించారంటే ప్రభాస్ మనసు గురించి నెటిజన్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆరడుగుల అందగాడని..అంతకుమించిన గొప్ప మనసున్న కథానాయకుడని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చూస్తున్నారు.
ప్రభాస్ అన్ని రకాల వంటకాలు పంపించడంతో ఇమాన్వి తల పట్టుకుంది. ఇంత ఫుడ్ ఎలా తినాలి అంటూ ఆశ్చర్యపోయింది. ప్రభాస్ ఈ స్థాయిలో ఫుడ్ పంపించడంతో మరోసారి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రభాస్ రాజు.. ప్రేమ చూపించడంలో.. ఆప్యాయత కనబరచడంలో.. చివరికి పెట్టే తిండి విషయంలో కూడా అదే స్థాయి అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కృష్ణంరాజు దశదినకర్మ రోజు కూడా ప్రభాస్ ఇదే విధంగా తన అభిమానులకు ఆహారం పెట్టారు. దూపుడు పోతు బిర్యాని నుంచి మొదలుపెడితే చికెన్ పలావ్ వరకు పెట్టి.. అభిమానులను సంతృప్తి పరిచారు ప్రభాస్.
ఫౌజీ సెట్లో ఇమాన్వికి ప్రభాస్ బర్త్డే సర్ప్రైజ్ హృదయాలను గెలుచుకుంది
ఫౌజీ షూటింగ్లో తన సహనటి ఇమాన్వి పుట్టినరోజును ప్రభాస్ స్పెషల్ ఫుడ్ ట్రీట్తో సెలబ్రేట్ చేశారు.
డార్లింగ్ ఆతిథ్యం మరోసారి అందరి మనసులు గెలుచుకుంది.ప్రభాస్ సెట్లో ఉదారంగా ఆహార విందులకు ప్రసిద్ది చెందాడు మరియు అతని ఫౌజీ సహనటి ఇమాన్వి తన పుట్టినరోజున ప్రత్యేకంగా ఒకదాన్ని పొందింది! అందరూ మాట్లాడుకునే డార్లింగ్ ప్రభాస్ నుండి ఒక మధురమైన సంజ్ఞ.
ఇక్కడ మరింత చదవండి: https://t.co/Vpwmnzt1LN
#ప్రభాస్ #ఫౌజీ #ఇమాన్వి
— TeluguBulletin.com (@TeluguBulletin) అక్టోబర్ 14, 2026