Home ఆంధ్రప్రదేశ్వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఒకవైపు ఈడి.. మరోవైపు సిబిఐ.. – RMK NEWS

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఒకవైపు ఈడి.. మరోవైపు సిబిఐ.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఎప్పుడైతే మన జీవితం నీతిగా.. న్యాయంగా సాగుతూ ఉంటుందో.. బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అడ్డదారులు తొక్కితే నిత్యం భయంగానే ఉంటుంది. ఒక ఆఫ్రికన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ఈ సామెత మాదిరిగానే ఏపీలో జగన్ అండ్ కో వ్యవహారం ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఇప్పుడు వారిని ఫాలో అవుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సొంత మీడియాలో వితండ వాదాలు చేస్తున్నారు. అందులో నిజం లేదు. […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ఎప్పుడైతే మన జీవితం నీతిగా.. న్యాయంగా సాగుతూ ఉంటుందో.. బతుకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అడ్డదారులు తొక్కితే నిత్యం భయంగానే ఉంటుంది. ఒక ఆఫ్రికన్ సామెతకు తెలుగు అనువాదం ఇది. ఈ సామెత మాదిరిగానే ఏపీలో జగన్ అండ్ కో వ్యవహారం ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఇప్పుడు వారిని ఫాలో అవుతున్న నేపథ్యంలో.. ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. సొంత మీడియాలో వితండ వాదాలు చేస్తున్నారు. అందులో నిజం లేదు. నిజమని చెప్పే దమ్ము కూడా లేదు.

ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ స్కామ్ చేశారు.. అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు పులు కలిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. వాస్తవానికి ఆయన జైలుకు వెళ్తే ఏపీ రాష్ట్రం నుంచి మొదలు పెడితే అమెరికా వరకు ఆందోళనలు జరిగాయి. ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు బాసటగా నిలిచారు. ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంటికి చేరుకోవడానికి తెల్లవారుజామున 5 గంటలు అయిందంటే.. ఆయనకున్న అభిమాన గణాన్ని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ స్థాయిలో అభిమానులు ఎంత డబ్బు ఖర్చు చేసినా సరే రారు. అదంతా గుండెల్లో ఉండాలి. అంతమంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారంటే చంద్రబాబు ఎలాంటి నాయకుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

జగన్ అక్రమాస్తుల కేసులో దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. చివరికి ఆయనను కాపాడేందుకు సోదరి షర్మిల.. రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఓదార్పు పేరుతో యాత్ర చేయాల్సి వచ్చింది. చివరికి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత సోదరిని పక్కన పెట్టారు.. అంతేకాదు , షర్మిల పై వైసిపి సోషల్ మీడియా గ్యాంగ్ లతో వ్యక్తిత్వ హననం చేశారు. కానీ, ఇలాంటి తుచ్చ రాజకీయాలు చంద్రబాబుకు చేతకావు. ఎందుకంటే ఆయన రాజకీయాన్ని ఒకవైపు మాత్రమే చూస్తారు. ఇతర కోణంలో అభివృద్ధి.. సంక్షేమాన్ని చూస్తారు. అందువల్లే ఎన్నో రకాల సంక్షోభాలను టిడిపి తట్టుకుంది. తట్టుకొని నిలబడింది.

ఇక ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. కక్ష రాజకీయాలను పక్కనపెట్టి ఆయన పరిపాలన సాగించుకుంటూ వెళ్తున్నారు. కానీ, గత వ్యవహారాలకు సంబంధించిన కేసులు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు జగన్ అక్రమాస్తుల కేసులో పాత దస్త్రాలను దులపడం మొదలుపెట్టాయి. స్థానిక ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయ ఈడి.. సిబిఐలలో వేడి పుట్టిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం ఉన్న ఐదు కేసులలో ఒక్కరోజులోనే వచ్చింది.

అక్రమ ఆస్తుల కేసులో జగన్ పై ఉన్న సిబిఐ కేసులతో పాటు.. ఈడీ కేసులను కూడా రోజువారి విచారణ జరపాలని సిబిఐ కోర్టు నిర్ణయించడం విశేషం. జగన్ పాదయాత్ర చేయబోతున్నారని ఇటీవల కాలంలో మీడియాలో వచ్చిన వార్తలు.. సిబిఐ కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఓబులాపురం గనుల అక్రమాల కేసులో హైదరాబాద్ సిబిఐ కోర్టుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇప్పటికే సన్నద్ధమైంది. వైయస్ వివేకా హత్య కేసులో ఈడి విచారణకు వైఎస్ జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఇప్పటికే ఈడీ వర్తమానం పంపింది. ఇక తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుల ఆస్తులను ఈడి జప్తు చేసింది. మద్యం కుంభకోణంలో విచారణకు హాజరుకావాలని నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ కు ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఐదు కేసుల్లోనూ అంతిమ లబ్ధిదారు జగన్ అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఒకేసారి ఇన్ని కేసులు తెరమీదకి రావడం.. విచారణ వేగవంతం కావడంతో వైసిపి ఉలిక్కిపడుతోంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

2 days ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

2 days ago