Home తాజా వార్తలుపాకిస్థాన్ దౌత్యం : చైనా ఈడ్చి తంతే.. అమెరికా లాగి కొట్టింది.. పాపం పాకిస్థాన్ – RMK NEWS

పాకిస్థాన్ దౌత్యం : చైనా ఈడ్చి తంతే.. అమెరికా లాగి కొట్టింది.. పాపం పాకిస్థాన్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

పాకిస్తాన్ దౌత్యం : అధిక స్నేహం ప్రాణగండం అంటారు.. ఇప్పుడు ఈ సామెత పాకిస్తాన్ దేశానికి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది.. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా అండతో పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది. లేకుంటే ఇండియా చేతిలో చావు దెబ్బ తినేదే. ఆ తర్వాత అమెరికాతో గట్టిగా అంటకాగడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీనికి తోడు సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ దగ్గరగా ఉండటం మొదలుపెట్టారు. ఆ మధ్య పాకిస్తాన్ […]

పాకిస్తాన్ దౌత్యం : అధిక స్నేహం ప్రాణగండం అంటారు.. ఇప్పుడు ఈ సామెత పాకిస్తాన్ దేశానికి అచ్చు గుద్దినట్టు సరిపోతోంది.. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అమెరికా అండతో పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది. లేకుంటే ఇండియా చేతిలో చావు దెబ్బ తినేదే. ఆ తర్వాత అమెరికాతో గట్టిగా అంటకాగడం మొదలుపెట్టింది పాకిస్తాన్. దీనికి తోడు సర్వ సైన్యాధ్యక్షుడు మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ దగ్గరగా ఉండటం మొదలుపెట్టారు. ఆ మధ్య పాకిస్తాన్ లో దొరికే విలువైన వనరులను అమెరికా కంపెనీలకు దోచిపెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు.

అమెరికాకు దగ్గరగా ఉండటం. ఏదైనా చేసుకోవచ్చు.. ఏమైనా జరగొచ్చు అని పాకిస్థాన్ భావించింది . అమెరికా అండ చూసుకొని భారత్ మీద పెత్తనం సాగించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. పాకిస్తాన్ దేశాన్ని అమెరికా పూచిక పుల్లలతో పక్కనపెట్టింది. కూరలో కరివేపాకు మాదిరిగా తీసి పడేసింది. అమెరికా తీరే అలా ఉంది అనుకుంటే.. చివరికి చైనా కూడా జాడిచ్చి తన్నింది.

చైనాతో కూడా పాకిస్థాన్ అంట కాగడం మొదలుపెట్టింది. పైగా పాకిస్తాన్ దేశానికి చైనా అనేక విషయాలలో అండదండలు అందిస్తోంది. ఆర్థికంగా సపోర్ట్ చేస్తోంది. ఇంకా కొన్ని విషయాలలో కీలకంగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్‌తో కలిసి చైనా అనేక రకాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

ఇటీవల పాకిస్తాన్ బాలుచ్ లిబరేషన్ ఉద్యమకారులను ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని తీర్మానం చేసింది. దీనికి చైనా సపోర్ట్ చేసింది. అయితే తన వీటో అధికారంతో ఈ అమెరికా తీర్మానాన్ని పక్కన పెట్టింది. అసలు వాళ్ళ మీద ఉగ్రవాదులు అని ముద్ర వేయడానికి ఎటువంటి ఆధారం లేదని అమెరికా వాదించింది. దీంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇక్కడ పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా జై కొట్టిన చైనా.. మరో విషయంలో మాత్రం చావు దెబ్బతీసింది. కీలకమైన ఎయిర్ బేస్ లు.. దాచిన మిస్సైల్స్.. చేపడుతున్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన భద్రత బయటపెట్టింది.

ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియకుండా పాకిస్థాన్ అత్యంత రహస్యంగా చేస్తోంది. దీనితో పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అటు అమెరికా ఇబ్బంది పెట్టడం..ఇటు చైనా దూరం పెట్టడంతో పాకిస్థాన్ పరిస్థితి అడ కత్తెరలో ఇరుక్కున్నట్టుగా మారింది. మొన్నటిదాకా అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ విర్రవీగింది. చైనా సపోర్ట్ చూసుకొని మీసాలు తిప్పేసింది. కానీ ఆ రెండు దేశాలు పాకిస్థాన్ ను ఆటలో అరటిపండు లాగా వాడుకుంటున్నాయని ఇప్పుడు ఆ దేశ పరిపాలకు తెలిసింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు చింతించి లాభం లేదు. ఇప్పుడు చేయాల్సింది కేవలం పిసుక్కోవడమే..

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago