Home తాజా వార్తలుRamoji Rao Death Anniversary : చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ – RMK NEWS

Ramoji Rao Death Anniversary : చుట్టుకొండలు.. అక్కడ కేజీఎఫ్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Ramoji Rao Death Anniversary : ఈరోజు రామోజీరావు వర్ధంతి.. సహజంగానే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో రకాల మార్పులకు.. సంచలనాలకు ఆయన కారణం. ఎక్కడో ఖమ్మంలో చిన్నపాటి ఫెర్టిలైజర్ షాపు పెట్టిన అతను.. ఈరోజు వేలకోట్లు సంపాదించాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంపాదన అక్రమమా.. సక్రమమా అనే విషయాన్నీ పక్కన పెడితే.. పేపర్, పచ్చళ్ళు, సినిమాలు, హోటళ్లు, చానెళ్ళు .. ఆయన అడుగుపెట్టని రంగం అంటూ లేదు. చేయని వ్యాపారం అంటూ లేదు. […]

Ramoji Rao Death Anniversary : ఈరోజు రామోజీరావు వర్ధంతి.. సహజంగానే తెలుగు పత్రికా రంగంలో ఎన్నో రకాల మార్పులకు.. సంచలనాలకు ఆయన కారణం. ఎక్కడో ఖమ్మంలో చిన్నపాటి ఫెర్టిలైజర్ షాపు పెట్టిన అతను.. ఈరోజు వేలకోట్లు సంపాదించాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంపాదన అక్రమమా.. సక్రమమా అనే విషయాన్నీ పక్కన పెడితే.. పేపర్, పచ్చళ్ళు, సినిమాలు, హోటళ్లు, చానెళ్ళు .. ఆయన అడుగుపెట్టని రంగం అంటూ లేదు. చేయని వ్యాపారం అంటూ లేదు. లాభాలు వచ్చాయి.. నష్టాలు కూడా పలకరించాయి. అయినప్పటికీ రామోజీరావు వెనుకడుగు వేయలేదు. వెనకడుగు వేస్తే ఆయన రామోజీరావు ఎందుకు అవుతారు.

మార్గదర్శి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టిన ఇబ్బందులు.. రాజశేఖర్ రెడ్డి చూపించిన చుక్కలు.. ఆ స్థానంలో మరొకరు ఉంటే చేతులు జోడించి వెళ్లిపోయేవారు. నాటి రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వ్యక్తిత్వం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతోనే రాజశేఖర్ రెడ్డికి ధైర్యం చెప్పించాడు అంటే రామోజీరావు గుండె ఎంతటిదో వివరించాల్సిన అవసరం లేదు. అబ్దుల్లామెట్ ప్రాంతంలో కమ్యూనిస్టులు ధర్నాలు చేస్తుంటే.. తన రామోజీ ఫిలిం సిటీ అక్రమం అని ఆరోపణలు చేస్తుంటే.. వారి మూతలకు గట్టి బిరడా బిగించాడు. అంతటి సాహసి రామోజీరావు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో ఆక్రమించారని.. అసైన్డ్ భూముల్లో ఫిలిం సిటీ కట్టారని.. ఆ భూములు మొత్తం పేదలకు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. అధికారులను పంపించారు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రామోజీ ఫిలిం సిటీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సాక్షి ఎన్నో రాతలు రాసినప్పటికీ రామోజీ ఫిలిం సిటీ ఇటుక కూడా ఊడిపోలేదు.. అంతటి సౌధాలు నిర్మించుకున్నాడు.. వ్యాపార సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు రామోజీ.

“వార్త” పత్రికను తొక్కిపెట్టాడు. తనకు నచ్చని దాసరి నారాయణరావు ఉదయాన్ని చీకట్లో కలిపేశాడు. తనకంటూ పోటీ లేకుండా చేసుకున్నాడు. తను నిత్యం వ్యాపారం మాత్రమే చూస్తాడు. అందులో సెంటిమెంట్ కలిపి దర్జాగా వెనకేసుకుంటాడు. లేకపోతే విమానాలలో పత్రికను పంపించడమేంటి.. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తన ఈనాడు పత్రికను సమయానికి పంపడమేంటి.. పని చేయించుకునే విషయంలో.. డబ్బులు సమయానికి చెల్లించే విషయంలో.. రామోజీరావు ఓ రాక్షసుడు. ఈ మాట ఆయనతో పని చేసిన వారు ఇప్పటికీ అంటూనే ఉంటారు. గజ్జల మల్లారెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి నాగేశ్వరరావు, డిఎన్ రావు వరకు.. అతడు స్నేహం సాగించాడు. ఆ స్నేహంలోనే పనిని మరింత ముందుకు తీసుకెళ్లాడు.

నేడు రామోజీరావు వర్ధంతి. అతడు విలువల సవ్యసాచి కాకపోవచ్చు. సక్రమంగా వ్యాపారం సాగించిన బిజినెస్‌మెన్‌ కాలేకపోయాడు.. కానీ వేలాది మందికి ఉపాధి కల్పించాడు. లక్షల మందికి పరోక్షంగా భరోసా ఇచ్చాడు. అతడి కోటను చూస్తే.. అచ్చం కేజీఎఫ్ సినిమాలో సౌధం లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కోటలో రామోజీరావు కచ్చితంగా ఉంటాడు. కాకపోతే భౌతికంగా లేడు కాబట్టి.. మానవమాత్రులకు కనిపించడు. ఎందుకంటే రామోజీరావు ఇప్పుడు మనిషి కాదు.. తాను నిర్మించిన వేలకోట్లకు కనిపించని అధిపతి. అన్నిటికంటే ముఖ్యంగా బతికున్నప్పుడే తనకంటూ సమాధిని నిర్మించుకున్న స్థపతి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago