Home తాజా వార్తలుSBI ATM salon : దూరం నుంచి చూస్తే ఏటీఎం.. లోపలికి వెళ్లి చూస్తే క్షవరం అయినట్టే.. – RMK NEWS

SBI ATM salon : దూరం నుంచి చూస్తే ఏటీఎం.. లోపలికి వెళ్లి చూస్తే క్షవరం అయినట్టే.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

SBI ATM salon : ఈ రోజుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవారు చాలామంది. అయితే ఆ కాయలు అమ్మడంలో కూడా కొంతమంది టెక్నిక్ పాటిస్తారు. వినూత్నమైన మార్కెట్ సంపాదించుకొని భారీగా ఆర్జిస్తూ ఉంటారు. వారిలో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. చదివింది తక్కువనే. తెలివితేటలు మాత్రం పీహెచ్డీ లెవెల్. అందుకే ఈ రేంజ్ లో షాప్ పెట్టాడు. ఒక రేంజ్ లో సంపాదిస్తున్నాడు. అతడి పేరు రాహుల్ (కొన్ని పరిమితుల దృష్ట్యా […]

SBI ATM salon : ఈ రోజుల్లో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవారు చాలామంది. అయితే ఆ కాయలు అమ్మడంలో కూడా కొంతమంది టెక్నిక్ పాటిస్తారు. వినూత్నమైన మార్కెట్ సంపాదించుకొని భారీగా ఆర్జిస్తూ ఉంటారు. వారిలో ఇతడు పిహెచ్డి చేశాడు అనుకుంటా. చదివింది తక్కువనే. తెలివితేటలు మాత్రం పీహెచ్డీ లెవెల్. అందుకే ఈ రేంజ్ లో షాప్ పెట్టాడు. ఒక రేంజ్ లో సంపాదిస్తున్నాడు.

అతడి పేరు రాహుల్ (కొన్ని పరిమితుల దృష్ట్యా పేరు మార్చాల్సి వచ్చింది) అతడు వృత్తిరీత్యా బార్బర్. చదువుకున్నది కొంత వరకు అయినా.. క్షవరం మాత్రం బాగా చేస్తుంది. డిఫరెంట్ స్టైల్ లో మగవాళ్లకు కటింగ్ చేస్తూ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతడి సొంత రాష్ట్రం బీహార్. ఆ ప్రాంతంలోని దానాపూర్ ఏరియాలో నివాసం ఉంటాడు. ప్రపంచంలో ఏ సెలూన్ షాప్ అయినా సరే ఒక పేరు ఉంటుంది. కానీ ఇతడి షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. పేరు లేకుండానే ఇతడు ఇంతగా సంపాదిస్తున్నాడా.. అనే డౌట్ మీకు రావచ్చు. బ్రాండ్ గట్టిగా ఉంటే పేరుతో సంబంధం లేదు. ఆయన పేరు ఒక బ్రాండ్ అన్నట్టుగా రాహుల్ తనకంటూ ఒక మార్కెట్ సృష్టించుకున్నాడు.

దానాపూర్ ఏరియాలో రాహుల్ షాప్ కు ఎటువంటి పేరు ఉండదు. అతడి సెలూన్ షాప్ పేరు చెప్పాలంటే ఎవరైనా ఎస్బిఐ ఏటిఎం అంటే చాలు. అదేంటి ఏటిఎం సెంటర్‌లో కటింగ్ చేయడం ఏంటి అనే అనుమానం మీలో కలిగింది కదా.. అయితే రాహుల్ ఏర్పాటు చేసిన షాప్ మెయిన్ సెంటర్‌లో ఉంటుంది. గతంలో ఆ భవనంలో ఎస్బిఐ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మూసివేసింది. ఏటీఎం సెంటర్ మూసివేసినప్పుడు దాని నెమ్ బోర్డు తొలగించలేదు. అది అప్పటినుంచి అలానే ఉంది. ఆహులు కూడా ఆ నెమ్ బోర్డు అలానే కొనసాగిస్తున్నాడు. దానివల్ల తనకు విపరీతమైన గిరాకీ వస్తుందని అతను చెబుతున్నాడు. ఏటీఎం సెంటర్ అనుకుని చాలామంది డబ్బులు డ్రా చేయడానికి వస్తున్నారని.. వారంతా లోపలికి రాగానే షాక్ అవుతున్నారని రాహుల్ అంటున్నాడు.

డబుల్ డ్రా చేయడానికి వచ్చిన వారిలో చాలామంది కటింగ్ చేయించుకుని వెళ్తున్నారని అతడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.. పైగా రాహుల్ కు మంచి పేరు రావడంతో గిరాకీ కూడా బ్రహ్మాండంగా సాగుతోంది. ఈ నేమ్ బోర్డును ఎస్బిఐ అధికారులు తొలగించకుండా అలానే ఉంచాలని అతడు కోరుతున్నాడు. ఎంతైనా గొప్ప ఆలోచన కదా.. దూరం నుంచి చూస్తే ఇది ఎస్బిఐ ఎటిఎం సెంటర్.. లోపలికి వెళ్తే కచ్చితంగా క్షవరం చేస్తుంది. ఎంతైనా రాహుల్ ఐడియానే ఐడియా.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

20 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago