Home తాజా వార్తలుNara Devaansh Dino deets: పరిశోధకుడిగా నారా దేవాన్ష్ .. – RMK NEWS

Nara Devaansh Dino deets: పరిశోధకుడిగా నారా దేవాన్ష్ .. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Nara Devaansh : తాత ముఖ్యమంత్రి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం . మంత్రి తండ్రి.. ఆయనకు ఐటి మీద అపారమైన పట్టు.. నానమ్మ డైరీ వ్యవస్థాపకురాలు. తల్లి అందులో డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటారు.. అటు అమ్మమ్మ.. తాతయ్య కుటుంబం కూడా రాజకీయంగా.. సినిమాలపరంగా ఘన చరిత్ర కలిగిన వారే. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆ పిల్లాడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కాకపోతే రాజకీయాల్లో కాకుండా.. వ్యాపారంలో కాకుండా భిన్నమైన దారిని ఎంచుకోవచ్చు. […]

Nara Devaansh : తాత ముఖ్యమంత్రి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం . మంత్రి తండ్రి.. ఆయనకు ఐటి మీద అపారమైన పట్టు.. నానమ్మ డైరీ వ్యవస్థాపకురాలు. తల్లి అందులో డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటారు.. అటు అమ్మమ్మ.. తాతయ్య కుటుంబం కూడా రాజకీయంగా.. సినిమాలపరంగా ఘన చరిత్ర కలిగిన వారే. అలాంటి కుటుంబంలో పుట్టిన ఆ పిల్లాడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కాకపోతే రాజకీయాల్లో కాకుండా.. వ్యాపారంలో కాకుండా భిన్నమైన దారిని ఎంచుకోవచ్చు. తన ఈడు పిల్లలు ఆటపాటలతో సరదాగా గడుపుతూ ఉంటే.. అతడు మాత్రం పరిశోధన అంటూ.. బాల మేధావిగా తన ఆవిష్కరణ బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ కు సంబంధించి ఒక వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోను నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో నారా దేవాన్ష్ కనిపించారు. నారా లోకేష్ ఏవో ప్రశ్నలు అడిగారు. దానికి ఆయన స్పష్టమైన సమాధానం చెప్పారు. ఫలితంగా నారా దేవాన్ష్ అల్లరి పిల్లాడు కాదు.. అద్భుతమైన మేధస్సు ఉన్నవాడని అర్థమైంది. Dino deets పేరుతో దేవాన్ష్ ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. రాక్షస బల్లులు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాజాగా దేవాన్ష్ పరిశోధన చేస్తున్నారు. వివిధ పుస్తకాలలో ప్రచురించబడిన అంశాలను క్రోడీకరించి.. తాను తెలుసుకున్న విషయాలు.. ఆశ్చర్యానికి గురిచేసే అంశాలను.. ఆకట్టుకునే విధంగా రూపొందించాడు. ఈకాలపు పిల్లలకు అర్థమయ్యేలా వాటిని రూపొందించాడు. వీటిని ప్యాడ్ కాస్ట్ రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేయబోతున్నాడు.

సాధారణ యూట్యూబ్ ఛానల్ కాకుండా.. దానికోసం ఒక డైనోసార్ ప్రపంచాన్ని సృష్టించాడు దేవాన్ష్. ప్రాచీన ప్రపంచంలోకి ప్రేక్షకుడి లాగా తన తండ్రిని ఆహ్వానించాడు. అనేక ప్రశ్నలు నారా లోకేష్ అడిగితే.. దేవాన్ష్ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఇదే సూచన నారా లోకేష్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నారా దేవాన్ష్ తాజాగా శిలాజాలు.. పురాతన సంఘటనలు.. వందల సంవత్సరాల క్రితం జీవించిన జంతువులు.. వంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాడ్ కాస్ట్ రూపంలో చెప్పడానికి నారా దేవాన్ష్ ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో.. నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానల్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

20 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago