Home అంతర్ జాతీయఅంటార్కిటికా మంచు పొరల కింద అద్భుత ప్రపంచం..! -RMK NEWS

అంటార్కిటికా మంచు పొరల కింద అద్భుత ప్రపంచం..! -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

అంటార్కిటికా: ఈ సృష్టే ఒక అద్భుతం. ఈ అనంత విశ్వంలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇక భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడే ఉన్నాయి. జీవరాశి మనుగడ సాగించడానికి అనువైనది భూమి ఒక్కటే. భూమి తర్వాత ఏదైనా ఉందన్నా అన్న పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ఎదురులేని భూమి దక్షిణ కొనలో ఉన్న అంటార్కిటికా సాధారణంగా అంతులేని మంచు, తీవ్రమైన చలికి ప్రతీకగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ మంచు పొరల కింద ఒక పూర్తి ప్రపంచం దాగి ఉంది […]

అంటార్కిటికా: ఈ సృష్టే ఒక అద్భుతం. ఈ అనంత విశ్వంలో కోటానుకోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇక భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఇక్కడే ఉన్నాయి. జీవరాశి మనుగడ సాగించడానికి అనువైనది భూమి ఒక్కటే. భూమి తర్వాత ఏదైనా ఉందన్నా అన్న పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ఎదురులేని భూమి దక్షిణ కొనలో ఉన్న అంటార్కిటికా సాధారణంగా అంతులేని మంచు, తీవ్రమైన చలికి ప్రతీకగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ మంచు పొరల కింద ఒక పూర్తి ప్రపంచం దాగి ఉందని ఆధునిక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నాసా వంటి సంస్థలు చేస్తున్న డ్రిల్లింగ్‌లు కేవలం మంచు కింది నీటిని మాత్రమే కాకుండా, కొత్త జీవరాశులు, ఆశ్చర్యకరమైన భౌగోళిక నిర్మాణాలను కూడా బయటపెడుతున్నాయి. ఈ ఖండం మనకు భూమి యొక్క గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి అనేక పాఠాలు నేర్పుతోంది.

ఖండం ప్రత్యేకతలు…
అంటార్కిటికా భారత్‌ నుంచి హిందూ మహాసముద్రం దాటి దక్షిణంగా ఉంటుంది. దీని వైశాల్యం చైనా, అమెరికా, కెనడా దేశాలను కలిపినంత పెద్దది. భారత్‌తో దాదాపు ఐదు రెట్లు పెద్దది. ఇక్కడ సగటు -50 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉంటుంది. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఈ ఖండం అనేక వింతలను కలిగి ఉంటుంది. ఇక్కడ నీటిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల ముదురు ఎరుపు రంగు ప్రవాహం మంచు మధ్యలో కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం మౌంట్‌ ఎరబస్‌ అనే అగ్నిపర్వతం. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు రేణువులు బయటకు వస్తాయి. అయితే అంతర్జాతీయ ఒప్పందం కారణంగా ఇక్కడ మైనింగ్ పూర్తిగా నిషేధం. ఈ ఖండంలో ఒక్క చీమ కూడా కనిపించదు. మంచు ఎలుగుబంట్లు ఆర్కిటిక్‌లోనే ఉంటాయి. ఇక్కడి అతిపెద్ద భూమి జీవి అంటార్కిటిక్ మిడ్జ్. దాని పరిమాణం మన గోరు సైజు మాత్రమే. పారదర్శక రక్తం ఉన్న ఐస్ ఫిష్ ఇక్కడ మరో విశేషం. భూమిపై అత్యధిక సంఖ్యలో ఉల్కలు దొరికే ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ అన్ని ప్రత్యేకతలను కాపాడటానికి అంతర్జాతీయ ఒప్పందం ఈ ఖండాన్ని కేవలం శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే కేటాయించింది. ఎవరూ దీన్ని నాశనం చేయకుండా కాపాడుతున్నారు.

మంచు కింది దాగిన ప్రపంచం
ఉపగ్రహ చిత్రాలు, డ్రిల్లింగ్ పరిశోధనల ద్వారా మంచు పొరల కింద ఒక విస్తృత ప్రపంచం ఉందని తేలింది. 72 వేల పర్వతాలు, 4 వేల పొడవైన లోయలు, 138 అగ్నిపర్వతాలు మరియు 740 పొడవైన నదులు ఇక్కడ దాగి ఉన్నాయి. కొన్ని లోయలు అనేక దేశాల కన్నా పెద్దవి. భూమి లోపలి వేడి, ప్రెజర్ కారణంగా మంచు కింద లిక్విడ్ రూపంలో నీరు ఉంది. ఈ నీరు మిలియన్ల సంవత్సరాలుగా గాలి, సూర్యరశ్మికి తాకకుండా సీల్ అయి ఉంది. ఈ నీటిలో కంటికి కనిపించని వేలాది సూక్ష్మజీవులు సూర్యరశ్మి లేకుండానే జీవిస్తున్నాయి. ఇది మంచు కింద ఒక సంపూర్ణ ఎకోసిస్టమ్ ఉందని చూపిస్తుంది.

నేర్చుకునే పాఠాలు..
మంచులో దొరికిన పుప్పొడి, పురాతన మట్టి నమూనాలు మరో ఆశ్చర్యాన్ని వెల్లడిస్తున్నాయి. సుమారు 9 మిలియన్ సంవత్సరాల క్రితం, డైనోసార్లు జీవించిన కాలంలో, ఈ ప్రాంతం అమెజాన్‌ లాంటి దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఇప్పుడు పూర్తిగా మంచులో కప్పబడి ఉన్నా, ఆ కాలంలో క్రూర మృగాలు తిరిగేవి. ఈ పరిశోధనలు రిస్క్‌తో కూడుకున్నవి. రష్యా బృందం ఒక డ్రిల్ హోల్‌ను తెరవడానికి కష్టపడింది. అయినా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మనుషులు నివసించడానికి చాలా కష్టమైన ఈ ప్రాంతం, భూమి యొక్క వాతావరణ మార్పులు, జీవుల అనుకూలత మరియు భూగర్భ నిర్మాణాల గురించి విలువైన సమాచారం అందిస్తోంది.

అంటార్కిటికా కేవలం మంచు ఖండం కాదు. ఇది భూమి రహస్యాలను దాచి ఉంచిన ఒక ప్రయోగశాల. ఇక్కడి పరిశోధనలు మనకు భూమి గతాన్ని అర్థం చేసుకోవడం, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ ఖండాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago