Home అంతర్ జాతీయతానా ఉమెన్స్ క్రికెట్ ఘనంగా తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ -RMK NEWS

తానా ఉమెన్స్ క్రికెట్ ఘనంగా తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ -RMK NEWS

by RMK NEWS
0 comments
తానా ఉమెన్స్ క్రికెట్ ఘనంగా తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్

తానా మహిళల క్రికెట్ టోర్నమెంట్ : ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం నిర్వహించిన తొలి మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 19న ఫిలడెల్ఫియాలోని ఆల్బర్ట్ సి. మిల్లర్ పార్క్‌లో జరిగిన ఈ పోటీలకు క్రీడాకారులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

మహిళల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంపొందించడంతోపాటు, తెలుగు సమాజంలో క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. వివిధ జట్ల పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి.

టోర్నమెంట్‌ను నిష్పాక్షికంగా, సజావుగా నిర్వహించడంలో అంపైర్లు సురేష్ యలమంచి, వెంకటేష్ జాగర్లమూడి, శ్రీధర్ సాదినేని, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, వినీత్ తుమ్మల, స్వర్జీత్ కీలక పాత్ర పోషించారు. వారి సేవలను మిడ్-అట్లాంటిక్ తానా బృందం ప్రత్యేకంగా అభినందించింది.

మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక సేవలు

టోర్న’ మహిళా తొలి నుంచి సమన్వయం చేస్తూ, పూర్తి స్థాయిలో నిర్వహణకు సహకరించిన కోఆర్డినేటర్ దీప్తి కోక సేవలను తానా నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమం విజయవంతం కావడంలో ఆమె సమన్వయం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.

తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, సతీష్ తుమ్మల టోర్నమెంట్‌లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు. రోజంతా కార్యక్రమం కోసం అందించిన సురేష్ యలమంచి, సునీల్ కోగంటి, చలం పావులూరి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాల, శ్రీధర్ సాదినేని, కట్ట చైతన్య, క్రిషిత నందమూరి తదితర నిర్వాహకులను అభినందించారు.

టోర్నమెంట్‌కు ఉదారంగా స్పాన్సర్‌షిప్ అందించిన రామకృష్ణ తాడిశెట్టికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పవర్ బ్లేజెస్‌దే టైటిల్

తొలి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో పవర్ బ్లేజెస్ ఛాంపియన్స్‌గా నిలిచింది. టైటాన్స్ రన్నరప్గా నిలిచింది.

అవార్డుల విజేతలు
ఛాంపియన్స్: పవర్ బ్లేజెస్
రన్నరప్: టైటాన్స్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఐశ్వర్య లచగరి
బెస్ట్ బ్యాటర్: నిత్య కేశవ
ఉత్తమ బౌలర్: ప్రియాంక రామిశెట
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అజంతా తాడూరి
బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది డే: క్రిషిత నందమూరి
క్రీడలకు తానా ప్రోత్సాహం

మహిళల క్రికెట్‌కు వేదిక కల్పిస్తూ’ ఈ టోర్నమెంట్ ద్వారా మిడ్-అట్లాంటిక్ ప్రాంతంలో తెలుగు మహిళల క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం లభించింది. భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించేందుకు తానా మిడ్-అట్లాంటిక్ విభాగం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.

టోర్నమెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ అభినందనలు తెలిపారు.

You may also like

Leave a Comment