Home అంతర్ జాతీయTANA Charity : తానా – లీడ్ ద పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఉమా కటికి (ఆరమండ్ల) బహిరంగ మహిళా ఆశ్రయ కేంద్రాలకు అండ -RMK NEWS

TANA Charity : తానా – లీడ్ ద పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఉమా కటికి (ఆరమండ్ల) బహిరంగ మహిళా ఆశ్రయ కేంద్రాలకు అండ -RMK NEWS

by RMK NEWS
0 comments
TANA Charity : తానా - లీడ్ ద పాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఉమా కటికి (ఆరమండ్ల) బహిరంగ మహిళా ఆశ్రయ కేంద్రాలకు అండ

– వరుసగా మూడో ఏడాది TANA – Lead The Path Foundation సేవా యజ్ఞం..
– ఇల్లినాయిస్‌లో రెండు మహిళా ఆశ్రయ కేంద్రాలకు విరాళాలు

తానా ఛారిటీ : కష్టకాలంలో ఉన్న మహిళలు, నిరాశ్రయ కుటుంబాలకు అండగా నిలిచేందుకు డాక్టర్ ఉమా కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో సమగ్ర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ ఉమా గారి సారథ్యంలో TANA (ఉత్తర అమెరికా తెలుగు సంఘం), Lead The Path Foundation సంయుక్తంగా వరుసగా మూడో ఏడాది కూడా ఈ మానవీయ కార్యక్రమాన్ని చేపట్టారు. సెప్టెంబర్ 26, 2026న ఇల్లినాయిస్‌లోని రెండు ప్రముఖ మహిళా ఆశ్రయ కేంద్రాలకు అవసరమైన నిత్యావసర సామాగ్రి తో పాటు ఆర్థిక సాయం ప్రదేశం.

ఈ సందర్భంగా ఆశ్రయ కేంద్రాల నిర్వాహకులకు పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత (హైజీన్) ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. బాధితులకు ఆర్థిక భరోసాతో పాటు మానసిక ధైర్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆశ, ఆత్మవిశ్వాసాల సమ్మేళనం

క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురవుతున్న వేళ మనం అందించే చిన్నపాటి బాధితుల జీవితాల్లో ఆశను చిగురింపజేస్తుందని.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ సమయంలో ఏటా ఉంటుందని డా. ఉమా గారు, తానా ప్రతినిధులు.

డా. ఉమా కటికి (ఆరమండ్ల) గారిపై ప్రశంసల జల్లు

వరుసగా మూడో సంవత్సరం కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ సేవా కార్యక్రమాలను ముందుండి నడిపించిన డా. ఉమా గారికి ప్రముఖులు, సమాజ శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విరాళాల సమీకరణ నుండి వస్తువుల పంపిణీకి ప్రతి అంశంలోనూ ఆమె చూపిన సమన్వయ ప్రతిభను ప్రశంసించారు.

ఈ సందర్భంగా డా. ఉమా కటికి (ఆరమండ్ల) మాట్లాడుతూ.. ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విశేష కృషి చేసిన చిట్టిబాబు బెల్లంకొండ, లక్ష్మి బి., భాస్కర్ రెడ్డి, కీర్తి, సుహాసిని ఆర్., రామ్మోహన్ రావు రెబ్బ, సత్య శ్రీ, శ్రీనివాస్, శ్రుతి జి.లకు డా. ఉమా గారు కృతజ్ఞతలు తెలియజేసారు.

దాతలు, స్వచ్ఛంద కార్యకర్తలు, మిత్రుల మద్దతు వల్లే ఇది సాధ్యమైందని.. భవిష్యత్తులోనూ బాధితులకు నిలిచే సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని డా. ఉమా గారు చెప్పారు. సమాజంలో అవసరం ఉన్నవారికి చేయూతనందించడమే పరమావధిగా నిర్వహించిన ఈ కార్యక్రమం మానవతా విలువలకు ఆదర్శంగా నిలిచింది.

You may also like

Leave a Comment