Home తాజా వార్తలుChhattisgarh double marriage : ఎవడ్రా వాడు.. ఆ గుండె బతకాలి.. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ..ఇద్దరితో ఒకేసారి పెళ్లి – RMK NEWS

Chhattisgarh double marriage : ఎవడ్రా వాడు.. ఆ గుండె బతకాలి.. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమ..ఇద్దరితో ఒకేసారి పెళ్లి – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఛత్తీస్‌గఢ్ డబుల్ మ్యారేజ్ : నేటికాలంలో 35 ఏళ్లు వచ్చిన యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కులాల పట్టింపు లేదు. మతాల గొడవ లేదు. కట్నాలు అసవరం లేదు. పెళ్లి ఖర్చలు వద్దు. బంగారం మేమే పెట్టుకుంటాం. గ్రాండ్ గా పెళ్లి నిర్వహించామని చెప్పా.. పిల్లను ఇవ్వడానికి ముందుకురావడం లేదు. దీంతో చాలా మంది యువకులు ఒంటికాయ శొంఠికొమ్ము లాగా మిగిలిపోతున్నారు. ఏక్ నిరంజన్ లాగా బతుకీడుస్తున్నారు. అసలు పెళ్లి జరగడమే జాక్ పాట్ అనుకుంటున్నా నేటికాలంలో ఓ […]

ఛత్తీస్‌గఢ్ డబుల్ మ్యారేజ్ : నేటికాలంలో 35 ఏళ్లు వచ్చిన యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. కులాల పట్టింపు లేదు. మతాల గొడవ లేదు. కట్నాలు అసవరం లేదు. పెళ్లి ఖర్చలు వద్దు. బంగారం మేమే పెట్టుకుంటాం. గ్రాండ్ గా పెళ్లి నిర్వహించామని చెప్పా.. పిల్లను ఇవ్వడానికి ముందుకురావడం లేదు. దీంతో చాలా మంది యువకులు ఒంటికాయ శొంఠికొమ్ము లాగా మిగిలిపోతున్నారు. ఏక్ నిరంజన్ లాగా బతుకీడుస్తున్నారు.

అసలు పెళ్లి జరగడమే జాక్ పాట్ అనుకుంటున్నా నేటికాలంలో ఓ యువకుడు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా ఒకే మండపంలో ఇద్దరి మెడలో తాళి కట్టాడు. దీంతో చూసేవారు ఆశ్చర్యపోయారు. ఈ విషయం మీడియాలో పడిసంచలనం కావడంతో విన్నవాళ్లు, వీక్షించిన వాళ్లు నోరెళ్లపెట్టారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొండవ్ జిల్లా బైల్ గావ్ పొందిన హితేష్ యాదవ్ కొంతవరకు చదువుకున్నాడు. స్థానికంగా ఓ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడు యామిని దేహారీ అనే యువతిని ప్రేమించాడు. ఆమె కంటే ముందు పూల్ వతి అనే యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించింది. ఇలా గడిచిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఆమె ఒప్పుకోలేదు. దీనితో అనేక రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో హితేష్ మరో మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు.

యామిని అనే యువతిని ప్రేమించాడు. ఆమె దగ్గరయ్యాడు. తన గతం గురించి చెప్పాడు. దానికి యామిని ఇంప్రెస్ అయింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలను ఒప్పించారు. సరిగ్గా ఆ రోజు రానే వచ్చింది. యామిని, హితేష్ పెళ్లి జరుగుతుండగా పూల్ వతి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హితేశ్ ఒప్పుకోలేదు.

చాలాసేపు కల్యాణ మండపంలో రచ్చ చోటు చేసుకుంది. చివరికి వారుముగ్గరు ఓ అంగీకారానికి వచ్చారు. ఫలితంగా బంధువులు అందరూ చూస్తుండగా హితేశ్ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. బంధువులు షాక్ లో ఉండగానే.. ఆ ముగ్గురు కల్యాణమండపంలో ఏడడుగులు నడిచారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

22 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

22 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

22 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

22 hours ago