వైఎస్ జగన్: తెలంగాణలో టిడిపి అధికారంలో లేదు. నిజానికి టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణలో టిడిపి పొలిటికల్ స్ట్రెంత్ పొందలేకపోతోంది. కానీ.. ఈరోజు కూడా బ్యాక్ వర్డ్ క్లాసులు.. ఇతర తరగతుల వారు టిడిపికి జై కొడుతుంటారు. అక్కడిదాకా ఎందుకు 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిడిపి గట్టి స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో కూడా రెండు స్థానాలు దక్కించుకుంది. దీనిని బట్టి టిడిపి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు.. రాజకీయపరమైన అంశాలు.. పదవులు.. ఇలా అనేకం ఇచ్చిన ఘనత టిడిపికి దక్కుతుంది. అందుకే టిడిపిని వెనుకబడిన వారు గుండెల్లో పెట్టుకుంటారు. చివరికి ప్రభుత్వంలో కూడా బ్యాక్ వర్డ్ క్లాసులకు సముచిత స్థానం లభిస్తుంది. కీలక శాఖలకు మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే.. కార్పొరేషన్ ల చైర్మన్ ల వరకు.. ఇలా ప్రతి కీలకమైన పదవులు బీసీలకు కూడా అందించి.. వారి రాజకీయ ఉనికికి టిడిపి దోహదపడింది. ఇంతటి ఘనత బహుశా చరిత్రలో ఏ పార్టీకి కూడా ఉండదు.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్యాక్వర్డ్ క్లాసులకు అడుగడుగునా వైసిపి మోకాలడ్డుతోంది. అంతేకాదు, చివరికి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా అడ్డుకుంటున్నది. 34 శాతం రిజర్వేషన్ టిడిపి అనేక విధాలుగా ప్రయత్నిస్తే.. జగన్ మాత్రం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు అందకుండా చేస్తున్నారు. ఓటర్ల తీర్పుకు భయపడి.. పరిపాలనపరమైన అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలు నిలిపివేయడానికి నిరంతరం కుట్ర చేస్తూనే ఉన్నారు.
జగన్ ప్రకారం ఆ పార్టీ నాయకులు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను సవాల్ చేయడం విశేషం. వివిధ రూపాలలో కుట్రలు చేస్తోంది వైసీపీ. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఏకపక్ష విజయం వస్తుందని ఇప్పటికే అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లు కూడా అమలు వైసీపీ కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండటంతో… ఆందోళన మొదలైంది. అందువల్లే ఆ పార్టీ ఇలా అనేక రకాలుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ప్రక్రియను స్తంభింపజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లను ఆలస్యం చేయడం ద్వారా జగన్ విస్తృతమైన రాజకీయ లక్ష్యాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా 12 వేల కోట్ల వేతన సంఘం నిధులు.. స్థానిక సంస్థల గ్రాంట్లు.. ఇతర నిధులను నిలిపివేయడానికి కుట్ర పన్నినట్టు గుర్తించారు.
బీసీలకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడుగడుగునా మోసం చేశారు. కీలక పదవులు తనకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చారు. అందులోనూ తన సామాజిక వర్గం వారితో మంత్రివర్గాన్ని నింపేశారు. వారందరితో చంద్రబాబును.. పవన్ కళ్యాణ్ ను.. నారా లోకేష్ ను ఇష్టానుసారంగా తిట్టారు. పైగా దారుణాలు చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయినప్పటికీ జగన్ తన ధోరణి మార్చుకోవడం లేదు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే వ్యవహారానికి ఆయన అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. అయినప్పటికీ వెనుకడుగు వేసేది లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో చంద్రబాబు.. లోకేష్ ధైర్యంగా సాగుతున్నారు. కేంద్రం కీలకంగా ఉంది.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం వెనుకడుగు వేసేది లేదని లోకేష్ స్పష్టం చేస్తున్నారు. అందుకే వైసీపీ నేతలు ఈ తరహా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు.