Home ఆంధ్రప్రదేశ్పట్టిసీమ ప్రాజెక్ట్: పట్టిసీమ.. 12 ఏళ్ల జల ప్రస్థానం.. – RMK NEWS

పట్టిసీమ ప్రాజెక్ట్: పట్టిసీమ.. 12 ఏళ్ల జల ప్రస్థానం.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

పట్టిసీమ ప్రాజెక్టు:సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను ఒడిసిపట్టి కృష్ణా బేసిన్ కు మళ్లించడం.. కృష్ణా డెల్టా రైతులకు సాగినటి భరోసా కల్పించడం.. శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పెంచడం.. ఈ లక్ష్యాలతో రూపుదిద్దుకున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలో కీలక ప్రాజెక్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పై గోదావరి జిల్లాలను కృష్ణ బేసిన్ కు అందుబాటులో ఉంచింది. మొత్తం 103 రోజుల పంపిణీతో ఇంతటి పరిమాణంలో నీటిని తరలించడం ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతను చాటుతోంది..

సముద్రంలో కలిసే జలాల సద్వినియోగం

గోదావరి నదిలో వరదల సమయంలో సముద్రంలోకి చేరే అదనపు జలాలను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని ఆలోచనతో పట్టిసీమ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం సుమారు 1651 కోట్లతో ఈ నిధులను నిర్మించింది. . గోదావరి నదిని లిఫ్ట్ చేసి పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదిలోకి తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కృష్ణా డెల్టాలో సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.

వేలాది ఎకరాలకు

కృష్ణానది నీటి లభ్యత తగ్గిపోయిన సందర్భంగా గోదావరి జలాలను తరలించే అవకాశం కృష్ణ డెల్టా సాగుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. వరి.. ఇతర పంటలకు కీలక దశలో నీటి అవసరాలను తీర్చేందుకు ఈ జలాలు ఉపయోగపడతాయి. వర్షపాతం.. నదుల ప్రవాహం సక్రమంగా లేనప్పుడు ఈ నీటిని వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావం.. వర్షపాతం తగ్గడం వంటి వాటి వల్ల వ్యవసాయం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో ఈ నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా ఆయకట్టుకు లాభం చేకూరింది.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలో వ్యవసాయం.. ఆక్వా రంగం వల్ల దాదాపు లక్ష కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇందులో వ్యవసాయం ద్వారా 26,775 కోట్లు, ఆక్వా రంగం ద్వారా 78,000 కోట్ల సంపద సృష్టి జరిగింది.

పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ కూడా పరోక్షంగా ప్రయోజనం పొందుతుంది. ప్రతికించి శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు.. హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు తరలించడానికి ఉపయోగపడుతుంది. సాగు నీటితో పాటు అవసరాలు.. ప్రాంతీయ అభివృద్ధి.. పరిశ్రమల విస్తరణకు నీటి లభ్యత కీలకం.

పట్టిసీమ నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టుపై రాజకీయంగా తీవ్రమైన చర్చ జరిగింది. అప్పటి ప్రతిపక్ష వైసిపి నేతలు ఈ ప్రాజెక్టు ఖర్చు.. వినియోగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తో సహా పలువురు నేతలు ఈ ప్రాజెక్టులను ఎగతాళి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు తరలించడం విశేషం. దీనిని పట్టిసీమ విజంగా టిడిపి నేతలు చెబుతుంటారు. ఇక ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1033 రోజుల పాటు పంపింగ్ చేసి, 500 టిఎంసిల నీటిని ఎత్తిపోశారు.

  • 2015లో 75 రోజులపాటు పంపింగ్ చేశారు. 4.20 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.
  • 2016లో 134 రోజులు పంపింగ్ చేశారు. 55. 75 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2017లో 161 రోజులపాటు పంపింగ్ చేశారు. 105.80 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2018లో 165 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. దాదాపు 165 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2019లో 90 రోజులపాటు పంపింగ్ చేశారు. దాదాపు 42.99 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2020లో 64 రోజులపాటు పంపింగ్ చేశారు. దాదాపు 41.54 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2021లో 16 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. 1.64 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2022లో పంపింగ్ చేయలేదు. నీళ్లను ఎత్తిపోయలేదు.
  • 2023లో 119 రోజులపాటు పంపింగ్ చేశారు. 58.72 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2024లో 40 రోజుల పాటు పంపింగ్ చేశారు. 20.62 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.
  • 2025లో 73 రోజులపాటు నీటిని పంపింగ్ చేశారు. 14.21 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు.

పుష్కరకాలంగా ఏపీ ప్రయోజనాల కోసం పట్టిసీమ పనిచేస్తుంది. పేర్కొన్న ప్రతీ రూపికి 60 రెట్ల సంపాదన సృష్టించింది. 1651 కోట్ల రూపాయలతో నిర్మిస్తే.. వ్యవసాయం.. ఆక్వా రంగంలో లక్ష కోట్లకు పైగా సంపద సృష్టి జరిగింది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago