పట్టిసీమ ప్రాజెక్ట్: గోదావరి వరద జలాలను వృధాగా సముద్రంలో కలవకుండా.. కృష్ణా నదిలోకి మళ్లించాలని నాడు చంద్రబాబు నిర్ణయించారు. నాడు ఆయన ఆలోచనలకు అధికారుల కృషితోడైంది. ఫలితంగా రికార్డు స్థాయిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణమైంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరువు కాలంలో కృష్ణ డెల్టా రైతులకు సాగు.. ఇంకా భరోసా కల్పిస్తోంది. గోదావరి జలాలను సముద్రంలోకి వెళ్లకుండా కృష్ణ బేసిన్ కు మళ్లించి రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిసీమ కొత్త ఊపిరి పోసింది. కేవలం 5.5 […]
పట్టిసీమ ప్రాజెక్టు: గోదావరి వరద జలాలను వృధాగా సముద్రంలో కలవకుండా.. కృష్ణా నదిలోకి మళ్లించాలని నాడు చంద్రబాబు నిర్ణయించారు. నాడు ఆయన ఆలోచనలకు అధికారుల కృషితోడైంది. ఫలితంగా రికార్డు స్థాయిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణమైంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరువు కాలంలో కృష్ణ డెల్టా రైతులకు సాగు.. ఇంకా భరోసా కల్పిస్తోంది.
గోదావరి జలాలను సముద్రంలోకి వెళ్లకుండా కృష్ణ బేసిన్ కు మళ్లించి రాష్ట్ర వ్యవసాయ రంగానికి పట్టిసీమ కొత్త ఊపిరి పోసింది. కేవలం 5.5 నెలల రికార్డు సమయంలోనే 1651 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసింది. 2015 సెప్టెంబర్ 16న పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను.. కృష్ణానది జలాలతో అనుసంధానం చేసి.. చంద్రబాబు సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ లిఫ్ట్ స్కీమ్ లో 24 వర్టికల్ టర్బైన్ పంపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5300 హెచ్పి సామర్థ్యంతో పనిచేస్తాయి. మొత్తంగా 8500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి తరలిస్తాయి. సుమారు 177 పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి కృష్ణా బేసిన్ కు పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారు. కృష్ణ డెల్టాలో సాగునీటి కొరతను అధిగమించి.. రైతులకు నీరు అందించడమే ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం. పట్టిసీమతో ముందస్తు ఖరీఫ్ సాగు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు తుఫాన్ వల్ల పంట నష్టపోయే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. సకాలంలో నీరు అందడం వల్ల కృష్ణ డెల్టాలు రవి పంటలకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి.. కృష్ణా జలాలను ఆదా చేసి రాయలసీమ ప్రాంతాలకు నీటిని మళ్లీంచడానికి పట్టిసీమ కీలకంగా ఉపయోగపడుతుంది..
ఎల్ నినో నేపథ్యంలో సాగునీటి భద్రతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. రైతుల ఆదాయం పెట్టడానికి సహాయపడుతుంది. 2026లో ఎల్ నీనో నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణ డెల్టాకు 58 టీఎంసీల గోదావరి నీళ్లను అందించారు. కృష్ణ బేసిన్ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ డెల్టా రైతులకు ఈ లిట్ స్కీ నీటి భరోసా లభించింది. పట్టిసీమ లేకపోయి ఉంటే ఈ ఏడాది కృష్ణా రైతులు తీవ్రమైన సాగునీటి సంక్షేపాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎల్ నినో వంటి కరువు పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచిన సంజీవని పట్టిసీమ ఎత్తిపోతల పథకం. 2015 నుంచి ఇప్పటివరకు 500 టిఎంసిల నీళ్లను కృష్ణ బేసిన్కు గుర్తించింది. పట్టిసీమ ద్వారా వ్యవసాయం.. ఆక్వాకల్చర్ రంగాలకు నీటి భద్రత కల్పించారు.. వ్యవసాయం.. ఆక్వాకల్చర్ రంగాల ద్వారా 1,04,775 కోట్ల సంపద సృష్టించారు. పట్టిసీమ కేవలం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు.. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కాపాడే దూర దృష్టితో నిర్మించిన ప్రాజెక్టు.
రామానాయుడు ఏమన్నారు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏపీ సంజీవనీలాగా అభివర్ణించారు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు. “నీటిని సమర్థంగా ఉపయోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.. రైతుల సంక్షేమం.. సాగునీటి భద్రత.. రాష్ట్ర సస్యశ్యామలతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ దండగా.. పట్టిసీమ కాదు. టీసీల గోదావరి జలాలను ఎత్తిపోసి కృష్ణ డెల్టాకు 1651 కోట్లతో నీరు అందించారు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు.. తుంగభద్ర.. శ్రీశైలం.. నాగార్జునసాగర్ వరకు ఉన్న కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీటిని అందజేయడం ద్వారా నీటి వనరులను అందజేసేందుకు వీలుగా మంత్రిత్వ శాఖకు అవసరమైన నీటి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.