Telangana Politics: మనం అనుకుంటాం గానీ.. మనం ఓటు వేసి గెలిపించిన నాయకులు మన సంక్షేమం కోసం.. మన అభివృద్ధి కోసం తాపత్రయపడతారు… కష్టపడతారు.. మన సుఖం కోసం వాళ్ల విలువైన జీవితాన్ని త్యాగం చేస్తారు.. కుటుంబ సభ్యులతో కూడా కాస్త విలువైన సమయం గడపలేరు.. అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని వెనుకటి కాలానికి ఒక మహానుభావుడు చెప్పారు. […]
తెలంగాణ రాజకీయాలు: మనం అనుకుంటాం గానీ.. మనం ఓటు వేసి గెలిపించిన నాయకులు మన సంక్షేమం కోసం.. మన అభివృద్ధి కోసం తాపత్రయపడతారు… కష్టపడతారు.. మన సుఖం కోసం వాళ్ల విలువైన జీవితాన్ని త్యాగం చేస్తారు.. కుటుంబ సభ్యులతో కూడా కాస్త విలువైన సమయం గడపలేరు.. అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారని వెనుకటి కాలానికి ఒక మహానుభావుడు చెప్పారు. అది అప్పటికాలానికే కాదు.. ఇప్పటి కాలానికి కూడా వర్తిస్తుంది.
రాజకీయమంటేనే డబ్బులతో కూడుకున్న వ్యవహారం. అలాగని ఓటర్లు అమాయకులు కాదు. డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయడం లేదు. బిర్యానీ ప్యాకెట్లకు.. బీరు సీసాలకు ఓటర్లు బానిసలు చేసిన తర్వాత నాయకులు.. తల మీదికి ఎక్కి సవారీ చేస్తున్నారు. అధికారంలో కూర్చున్న తర్వాత అడ్డగోలు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో అవినీతి, అక్రమాలు చేయడానికి రాజకీయ నాయకులు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక పైసాను కూడా వదిలిపెట్టకుండా దోచుకుంటున్నారు. చివరికి తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం ఎక్కడి దాకైనా వెళ్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా మార్చేస్తున్నారు.
ఇటువంటి సంఘటన ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఒకటి జరిగింది. తెలంగాణలో సినిమా నేపథ్యానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో తెర వెనుక చక్రాలు తెప్పి గట్టిగానే వెనకేసుకున్నారు. తాజాగా ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇద్దరు నిర్మాతలకు 300 ఎకరాలు సెటిల్ చేయడంలో కీలకపాత్ర పోషించారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏకంగా 300 ఎకరాలు ఆ నిర్మాతలకు కేటాయించేందుకు ముందుకు వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్కో ఎకరాన్ని కోటి రూపాయలు చొప్పున 300 ఎకరాలు.. ఆ నిర్మాతలకు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. 300 కోట్లు.. విడతలుగా చెల్లించే విధంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఆ 300 ఎకరాలలో నిర్మాణ సంస్థ స్టూడియో ఏర్పాటు చేస్తుందని సమాచారం.
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీ.. రామానాయుడు స్టూడియో.. అన్నపూర్ణ స్టూడియో.. సారధి స్టూడియో.. పద్మాలయ స్టూడియో. అల్లు స్టూడియో ఉన్నాయి. నిర్మాణ సంస్థలు పెరుగుతున్నాయి.. ఇక్కడ ఇతర భాషలకు సంబంధించిన చిత్రాలు కూడా నిర్మాణం అవుతున్న నేపథ్యంలో.. ఆ నిర్మాతలు 300 ఎకరాల్లో స్టూడియో నిర్మాణం చేపడుతున్నట్లు. ఇప్పటికే తెలుగు పరిశ్రమ మాత్రమే కాకుండా.. ఆ నిర్మాణ సంస్థ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. పెద్దపెద్ద హీరోల కాల్ షీట్లు లాక్ చేసింది.. పైరవీలు చేయడంలో ఆ ఇద్దరు నిర్మాతలు సిద్ధహస్తులు. పైగా ఒక బడా నిర్మాత ప్రభుత్వంలో కీలకంగా ఉండటంతో.. ఆయన ఈ పని మొత్తం పూర్తి చేయించుకున్నారని. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 300 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. పైగా ఆ స్థాయిలో స్టూడియో నిర్మాణం అంటే.. మాటల్లో చెప్పేదికాదు.