Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి. ఈ నదుల ప్రవాహం ఆధారంగానే ఆయా ప్రాంతాలలో మనుషుల జీవనం. పంటల సాగు ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఈ రెండు నదుల ప్రవాహం ఆధారంగా లక్షల మంది ప్రజలు.. అదే స్థాయిలో పంటలు సాగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో చర్చలు ఈ రెండు నదులు జీవ నదులు.. వీటి అనుసంధానం మీద అనేక సార్లు […]
గోదావరి కావేరి నది అనుసంధానం: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి. ఈ నదుల ప్రవాహం ఆధారంగానే ఆయా ప్రాంతాలలో మనుషుల జీవనం. పంటల సాగు ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఈ రెండు నదుల ప్రవాహం ఆధారంగా లక్షల మంది ప్రజలు.. అదే స్థాయిలో పంటలు సాగుతూ ఉంటాయి.
అనేక సందర్భాల్లో చర్చలు
ఈ రెండు నదులు జీవ నదులు.. వీటి అనుసంధానం మీద గతంలో అనేక చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆచరణ దిశగా అడుగులు పడతాయని. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయ్ వస్తున్నారు. దసరా ఉత్సవాలకు ఆయనను ఇటీవల చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి విజయ్ ఏపీకి వస్తున్నారు. కేవలం ఇది ఉత్సవాలకు హాజరయ్యే కార్యక్రమం మాత్రమే కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. విజయ్ మధ్య గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి సంబంధించిన ఉన్నత స్థాయి భేటీ జరగబోతోంది. ఇప్పటికే నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ఎస్పీ వి ద్వారా గోదావరి.. కావేరి నదుల అనుసంధానాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి విజయ్ లెక్కలు.
దక్షిణాది ప్రాంతం మారుతుంది
కావేరి.. గోదావరి నదులు కలిసిపోతే దక్షిణాది ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. వర్షాకాలం సమయంలో గోదావరి నదిలో దాదాపు 3 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణలో తీవ్రమైన నీటి కొరత ఉంది. కావేరి డెల్టా మొత్తం.. కర్ణాటక రాష్ట్రాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిపిఆర్ రూపొందించింది. దీని ప్రకారం గోదావరిలో ఉండే 247 టీసీల మిగులు జలాలను కృష్ణ.. పెన్నా నదుల మీదుగా కావేరి వరకు తీసుకెళ్లొచ్చు. సముద్రంలోకి వెళ్లే నీటిని మళ్లించడం ద్వారా… రాష్ట్రాల అవసరాలు తీర్చవచ్చు.
మూడు రాష్ట్రాలకు కీలకం..
రెండు నదుల అనుసంధానం పూర్తయితే ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనాలు విపరీతంగా లభిస్తున్నాయి. కృష్ణ డెల్టా వ్యవసాయం స్థిరీకరణ కనిపిస్తుంది. గోదావరి నీరు వస్తే శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణా నీటిని రాయలసీమలోని ప్రాజెక్టులకు.. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటిని తరలించవచ్చు. నెల్లూరు.. ప్రకాశం లోని వ్యవసాయ భూములకు నీటిని అందించవచ్చు. చెన్నై నగరానికి ఏదైనా సమస్యను దూరం చేయవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కావేరి డెల్టకు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవలను తగ్గించవచ్చు. కావేరి, గోదావరి అనుసంధానం ద్వారా 9.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది.
గోదావరి, కావేరి ఒక ఇంజనీరింగ్ అద్భుతం
చంద్రబాబు.. విజయ్ మధ్య కనిపిస్తున్న ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తోంది. కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వంలో టిడిపి కీలకమైన భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్టులకు జాతీయ స్థాయి హోదా కల్పించడానికి.. 90 శాతం నిధులను కేంద్రం భరించే విధంగా చంద్రబాబు చొరవ తీసుకుంటే ఈ ప్రాజెక్టు విషయంలో కీలక అడుగులు పడతాయి. తమిళనాడు రాష్ట్రానికి విజయ్.. ఈపీ చంద్రబాబు ఓకే అభిప్రాయంతో కేంద్రం ముందు ఒక బలమైన ప్రతిపాదన కనుక ఉంచితే.. కావేరి.. గోదావరి అనుసంధానానికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుంది. చంద్రబాబుకు సాగునీటి పారుదల రంగంలో విపరీతమైన అనుభవం ఉంది. విజయ్ కి సంకల్పబలం ఉంది. వీరిద్దరూ కలిస్తే, కావేరి ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా మిగిలిపోతుంది. మూడు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యలు తీరిపోతాయి.