Home అంతర్ జాతీయIsrael Crocodiles: ఉగ్రవాదులను మొసళ్లతో చంపేస్తోంది.. మోడీ -RMK NEWS

Israel Crocodiles: ఉగ్రవాదులను మొసళ్లతో చంపేస్తోంది.. మోడీ -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఇజ్రాయెల్ మొసళ్ళు: ఆయుధాలు అవసరం లేదు. శక్తివంతమైన బాంబులు కూడా అవసరం లేదు. జస్ట్ ముల్లును ముల్లుతోనే తీసిన.. ఉగ్రవాదులను చంపేయడానికి గట్టి స్కెచ్ వేసింది ఆ దేశం. దీనికోసం భారీగా ఖర్చుపెట్టడం లేదు. కేవలం జంతువులను ఉపయోగిస్తుంది. అంతేకాదు, రెండవ కంటికి తెలియకుండా పని జరిగే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

మొసళ్ళ ను నమ్ముకుంది

ఇజ్రాయిల్ తెలుసు కదా. సాంకేతిక పరిజ్ఞానానికి.. ఆయుధపరిజ్ఞానానికి ప్రపంచానికే సరికొత్త పాఠాలు చెప్పే దేశం. ఎడారిలో వ్యవసాయం చేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండుతోంది. అంతేనా.. దేశాన్ని కాపాడుకునే విధానంలో ఏకంగా ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. అక్కడితోనే ఆగిపోలేదు ఇప్పుడు చుట్టూ ఉన్న శత్రువులకు గట్టి పాఠం చెప్పే విధంగా.. భవిష్యత్తు కాలంలో తమ జోలికి రాకుండా ఉండేందుకు మొసళ్ళ ను నమ్ముకుంది. తమ శత్రు దేశాల మీదికి వాటిని ప్రయోగించనుంది.

వారిని క్రోకోడైల్స్ చంపి తినేస్తాయి

ఇజ్రాయిల్ దేశానికి శత్రువులు చాలా ఎక్కువ. అందువల్లే తమ సెక్యూరిటీ ఏజెన్సీలు పట్టుకున్న ఉగ్రవాదులను అత్యంత కఠినమైన కారాగారాలలో బంధిస్తూ ఉంటారు. అయితే వీరు పోలీసుల కళ్ళు కప్పి బయటపడకుండా ఉండేందుకు.. జైళ్ళ చుట్టూ కందకాలు తవ్విస్తోంది. వాటిలో క్రోకోడైల్స్ ను వదిలిపెడుతోంది. ఒకవేళ ఉగ్రవాదులు గోడ దూకి బయటికి పారిపోతే.. నేరుగా కందకాలలో పడతారు. వారిని క్రోకోడైల్స్ చంపి తినేస్తాయి. శత్రు శేషం.. రుణ శేషం మొత్తం క్లియర్ అవుతుంది. ఇదే ఆలోచనను ఇజ్రాయిల్ చేస్తోంది.

గతంలో అమెరికా కూడా ఇదే ఆలోచన

ఇజ్రాయిల్ కాకుండా గతంలో అమెరికా కూడా ఇదే ఆలోచన చేసింది. ట్రంప్ ప్రాంతంలో డీ టెన్షన్ సెంటర్ ఆధారంగా అప్పట్లో తెరపైకి అల్లిగెడర్ ఆల్కాట్రాజ్ అనే విధానం తెరపైకి వచ్చింది. దాని నుంచి స్ఫూర్తి పొందిన ఇజ్రాయిల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఈ వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అత్యంత కఠినమైన భద్రత మధ్య సూపర్ మాక్సిమం జైళ్ళ చుట్టూ క్రోకోడైల్స్ ను ఏర్పాటు చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశం.

మరో కారణం కూడా

ఇజ్రాయిల్ ఈ స్థాయిలో క్రొకోడైల్స్ ఏర్పాటు చేయడం అనుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఒకప్పుడు నైలునది ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో విస్తరించి ఉండేది. అయితే ఆ నదిలో క్రొకోడైల్స్ ను విస్తారంగా వేటాడటం వల్ల అవి అంతరించిపోయాయి. సరిగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ దేశంలో చివరి వైల్డ్ నైల్ క్రోకోడైల్ కనిపించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 2012లో క్రొకోడైల్స్‌ను వాణిజ్యంగా వినియోగించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు శత్రు దేశాలు మరింత పెరిగిపోవడంతో.. ఉగ్రవాదుల దాడులకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు.. ఉన్న ఉగ్రవాద ఖైదీలు బయటికి వెళ్లకుండా జైళ్ల చుట్టూ క్రోకోడైల్ ఫార్మింగ్ ప్లాన్ ను ఇజ్రాయిల్ సిద్ధం చేసింది. ఈ ఇజ్రాయిల్ పర్యావరణ శాఖ మంత్రి జూలైలో క్రోకోడైల్స్ పై ఉన్న రక్షిత ప్రాణి హోదాను రద్దు చేశారు. వాటిని పెంచుకోదగిన వన్యప్రాణి అనే కేటగిరీలోకి చేర్చారు. ఈ సవరణ వల్ల క్రొకోడైల్స్ కంట్రోల్ అనేది కేవలం శాఖ అధికారులకే కాకుండా.. జైళ్ళ శాఖ అధికారుల చేతుల్లో కూడా చేరింది.

కందకాలు తవ్వుతున్నారు

ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పాలస్తీనా ఖైదీలు ఎక్కువగా ఉండే నెగెవు ఎడారి ప్రాంతంలో కేడ్జీ యోట్ జైలు చుట్టూ కందకాలు తవ్వుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం ఏకంగా ఏడు మిలియన్ డాలర్లు ఖర్చు చేయడం విశేషం. ఈ కావలసిన ఈ విధానం మీద జెరూసలేం డిస్ట్రిక్ట్ కోర్ట్.. జంతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు మీద తాత్కాలికంగా స్టే విధించింది. ఒప్పంద లెట్ ది యానిమల్స్ లీవ్ అనే సంస్థ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు స్టే విధించింది. మా దేశం మీద దాడి చేస్తే.. క్రొకోడైల్స్ చేతిలో చస్తారని హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

ఇజ్రాయిల్ సెక్యూరిటీకి మాత్రమే పరిమితం కాలేదు

మరోవైపు ఈ క్రోకోడైల్స్ వ్యవహారం కేవలం ఇజ్రాయిల్ సెక్యూరిటీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈ దేశంలో ఉన్న విస్తృతమైన భూ నిర్వహణ.. ఇతర విధానాల మీద పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్ ల్యాండ్ అథారిటీ కేకేఎల్, జే ఎన్ ఎఫ్ వంటి సంస్థలు విస్తృతంగా మొక్కలు నాటుతున్నాయి. ఎడారి ప్రాంతంలో మొక్కలు నాటుతూ దాదాపు 13 శాతం భూభాగాన్ని పచ్చగా మార్చేశాయి. ఇది ఇలా ఉంటే పాలస్తీనా పరిశోధకులు మాత్రం సరికొత్త చర్చను తెరమీద తీసుకొస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ లాంటి నగరంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో పశువులను మేత మేయకుండా ఉండటానికి.. ఆంక్షలు విధిస్తున్నారని. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య జాటర్ మూలికల సేకరణ పై నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు క్రొకోడైల్స్ వ్యవహారం సరికొత్తగా చేరింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇజ్రాయిల్ సంగతి ఎలా ఉంటుంది.. మన దేశంలో కూడా ఇటువంటి ఆలోచన చేసింది.. ఉగ్రవాదులకు కంటిమీద కునుకు లేకుండా చేయాలని నరేంద్ర మోడీకి నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago