Home తాజా వార్తలుSleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! – RMK NEWS

Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు.. దానికి తెలుగులోనే కాదు, ఏ భాషల్లో కూడా సరైన పదాలు లేవు. కానీ ఇప్పుడు ప్రమాదకర ధోరణి విపరీతంగా పెరుగుతుంది. అది కాస్త దంపతుల మధ్య అగాధాన్ని విపరీతంగా సృష్టిస్తోంది. ఈ విపత్తు మనదేశంలో దారుణంగా పెరిగిపోతుంది. ఫలితంగా చాలావరకు కుటుంబాలు తెలియని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.. వైవాహిక బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య సుఖం […]

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు.. దానికి తెలుగులోనే కాదు, ఏ భాషల్లో కూడా సరైన పదాలు లేవు. కానీ ఇప్పుడు ప్రమాదకర ధోరణి విపరీతంగా పెరుగుతుంది. అది కాస్త దంపతుల మధ్య అగాధాన్ని విపరీతంగా సృష్టిస్తోంది. ఈ విపత్తు మనదేశంలో దారుణంగా పెరిగిపోతుంది. ఫలితంగా చాలావరకు కుటుంబాలు తెలియని ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి..

వైవాహిక బంధం బలంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య సుఖ సంసారం చక్కగా ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడా కొట్టినా సరే.. మొత్తం తేడా అవుతుంది. గతంలో మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్లీప్ డైవర్స్ అనే ధోరణి భార్యాభర్తల మధ్య ఉంది. ఫలితంగా దంపతుల మధ్య ఊహించని మానసిక సమస్యలు.. శారీరక సమస్యలు.. ఇంకా అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇటీవల మానసిక నిపుణులు నిర్వహించిన ఓ సర్వేలో స్లీప్ డైవర్స్ గురించి దారుణమైన నిజాలు బయటపడ్డాయి. ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉందని తేలింది.. ఇది క్రమేపీ మన వివాహ వ్యవస్థను నాశనం చేసే దిశగా మారుతోందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

స్లీప్ డైవర్స్ అనేది ఇంగ్లీష్ పదం. దీనిని తెలుగులో చెప్పాలంటే కలిసి ఉంటూనే.. ఎవరికివారు పడుకోవడం అని అర్థం.. చాలామంది దంపతుల్లో బయటికి చూస్తే అన్యోన్యత అద్భుతంగా కనిపిస్తుంది. పడకగదికి వెళ్లేసరికి అది మాయమవుతుంది. నీకు నువ్వే.. నాకు నేనే అన్నట్టుగా వ్యవహారం మారిపోతూ ఉంటుంది. ఎవరి బెడ్ రూమ్ వారికి ఉంటుంది. ఎవరికి వారు తలుపులు వేసుకొని నిద్రిస్తారు. నిజానికి అన్యోన్యమైన కాపురం అంటే పదిమంది ముందు బిల్డప్ ఇవ్వడం కాదు.. పదిమంది చూస్తుండగా చిలక గోరింకల్లా నటించడం కాదు.. పడకగదిలో కూడా కలిసి ఉండటం.. ఆనందంగా శృంగారంలో పాల్గొనడం.. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో కీలకమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఏకాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సమస్యల గురించి ప్రస్తావన వస్తుంది.. అక్కడే వాటి పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. అంతేతప్ప.. ఎవరికి వారు నిద్రిస్తే మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్లీప్ డైవర్స్ పెరగడానికి ప్రధానంగా కారణాలు ఉన్నాయి. నగరాలలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేసి సాయంత్రం పూట ఇంటికి వచ్చే సమయానికి అలసిపోతున్నారు. దీంతో సుఖవంతమైన నిద్రను కోరుకుంటున్నారు. కొందరిలో గురక సమస్య కూడా అధికంగా ఉంటుంది. దీనివల్ల నిద్రకు భంగం ఏర్పడుతుంది. అందువల్ల చాలామంది దంపతులు స్లీప్ డైవర్స్ వైపు వెళ్తున్నారు. సంసారం విషయంలో అన్యోన్యతను కనిపిస్తున్నప్పటికీ.. సుఖాన్ని మాత్రం దూరంగా ఉంచుతున్నారు. అనేక రకాల రోగాలకు దగ్గరవుతున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago