Home తాజా వార్తలుDurandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ ఇదీ – RMK NEWS

Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ ఇదీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా కనెక్ట్ అయ్యారంటే.. కొంతమంది కావాలని పనిగట్టుకుని ఈ సినిమాను విమర్శిస్తున్నారంటే.. దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. ఈక్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ప్రధానమైన కథనం ఇదీ.

కొంచెం బలాన్ని చూపిస్తే చాలు..హిందువులు భయపడిపోతారు. మనం ఎంత నష్టమైనా చేయొచ్చు.. దురంధర్ సినిమాలో ఓ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ను 2020 నుంచే భారత్ అమలు చేయడం మొదలు పెట్టింది. సర్జికల్ దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి పేర్లతో భారత్ దాడులు చేస్తూనే ఉంది. ఇవన్నీ కూడా అధికారిక మిషన్లు. కానీ, అనధికారికంగా జరిగేవి చాలా ఉన్నాయి. ఆ ఆపరేషన్లలో ఊరూపేరూ లేని యోధులు పాల్గొంటున్నారు. వారంతా ఉగ్రవాదులను సినిమాల మాదిరిగా లేపేసినట్టు లేపేస్తున్నారు.

ఆ యోధుల చేతుల్లో చనిపోయిన ఉగ్రవాదులు వీళ్లే

షాహిద్ లతీఫ్.. ఇతడు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ దాడిలో కింగ్ పిన్. 2023 అక్టోబర్ సియాల్ కోట్ ప్రాంతంలో జరిగిన దాడిలో కన్నమూశాడు.

రియాజ్..ముంబైనగరంలో జరిగిన దాడులలో ఇతడు కీలకసూత్రధారి. 2023లో పాకిస్థాన్ లో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు.

మౌలానా రహీమ్ తారీక్.. ఇతడు మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది అజర్ మసూద్ కు అత్యంత సన్నిహితుడు. 2023 నవంబర్‌లో కరాచీప్రాంతంలోజరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు.

జహూర్ ఇబ్రహీం.. ఐసీ 814 విమానం అపహరణలో కీలకపాత్రధారి. 2022లో కరాచీలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

సలీమ్ రహ్మనీ.. కాశ్మీర్, భారత్ లో జరిగిన అల్లర్లలో కీలకపాత్రధారి. జనవరి,2022లో జరిగిన దాడుల్లో చనిపోయాడు.

ఖ్వాజా షాహిద్.. భారత ఆర్మీ క్యాంప్ పై జరిగిన దాడిలో ఇతడు ముఖ్యపాత్రధారి. జనవరి,2023లో జరిగిన దాడిలో కన్నమూశాడు.

అక్రమ్ ఖాన్..యువకులను ఉగ్రవాదం వైపు లాగిన వేర్పాటువాది. జనవరి,2023లో జరిగిన దాడిలో దుర్మరణం చెందాడు.

రజనిజామనీ.. తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం దిట్ట. 2024లో జరిగిన కాల్పుల్లో కన్నమూశాడు.

సైఫుల్లా ఖాలిద్.. నగ్రోటా ప్రాంతంలో జరిగిన దాడిలో ఇతడు పాల్గొన్నాడు. 2023లో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయాడు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

21 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

21 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

21 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

21 hours ago