Home క్రీడలుSudigali Sudheer: ఓటీలో ఇంత రేంజా.. సుడిగాలి సుధీర్ అంటే – RMK NEWS

Sudigali Sudheer: ఓటీలో ఇంత రేంజా.. సుడిగాలి సుధీర్ అంటే – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Sudigali Sudheer: బేసికల్గా మనకు వినోదం కావాలి అంటే.. ఫస్ట్ ఆప్షన్ ఏంటి టీవీ.. అందులోనూ కొన్ని ఛానల్స్ మాత్రమే మనం చూస్తాం.. ఇక మన తెలుగులో అయితే స్టార్ మా.. జీ టీవీ.. ఈటీవీ.. జెమినీ టీవీ.. ఇందులో కూడా నచ్చిన కార్యక్రమాలు మాత్రమే చూస్తాం. అంటే మన మనసును ఆకట్టుకునే కార్యక్రమాలకు మాత్రమే మనం బౌండాయి ఉంటాం. అలా మనం బౌండ్ కావాలి అంటే కచ్చితంగా మెస్మరేజ్ కావాలి. ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యే విధంగా […]

సుడిగాలి సుధీర్: బేసికల్గా మనకు వినోదం కావాలి అంటే.. ఫస్ట్ ఆప్షన్ ఏంటి టీవీ.. అందులోనూ కొన్ని ఛానల్స్ మాత్రమే మనం చూస్తాం.. ఇక మన తెలుగులో అయితే స్టార్ మా.. జీ టీవీ.. ఈటీవీ.. జెమినీ టీవీ.. ఇందులో కూడా నచ్చిన కార్యక్రమాలు మాత్రమే చూస్తాం. అంటే మన మనసును ఆకట్టుకునే కార్యక్రమాలకు మాత్రమే మనం బౌండాయి ఉంటాం. అలా మనం బౌండ్ కావాలి అంటే కచ్చితంగా మెస్మరేజ్ కావాలి. ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యే విధంగా చేసే వాళ్ళల్లో తెలుగులో కొద్దిమంది యాంకర్లు మాత్రమే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్ కి నెంబర్ వన్ కాదు, అంతకు మించిన స్థానం ఇవ్వచ్చు.

మీరు ఆహా ఓటిటి చూస్తుంటారా.. అందులో తోపు అనే స్థాయిలో సినిమాలు పెద్దగా విడుదల కావు. అయినప్పటికీ ఆ ఓటికి యూట్యూబ్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నాయి. ఇక యూజర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. గతంలో సమంత ఆహాకు ఒక టాక్ షో చేసింది.. నందమూరి బాలకృష్ణ కూడా ఒక టాక్ షో చేశారు. సుమ కనకాల.. ఇంకా కొంతమంది యాంకర్లు కూడా ఆహా ఓటికి పనిచేశారు.. వీరంతా కూడా తమ స్థాయికి నుంచి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు.

వీళ్లు వేసిన పునాదుల మీద.. ఆహా సంస్థకు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాడు సుడిగాలి సుధీర్. సాధారణంగా పేరు పొందిన టాక్ షోలు మాత్రమే ఆడియన్స్ చూస్తారు. ఎందుకంటే యాంకర్లు చూపించే స్పాంటేనిటీ.. ఆకట్టుకునే మాట తీరు.. ఇంకా అందులో ఉండే జోకులు.. పోటీలను ప్రేక్షకులు ఆస్వాదిస్తూ ఉంటారు. అందువల్లే కళ్లింతలు చేసుకొని ఆ షోలను చూస్తూ ఉంటారు. సమంత అంటే పేరుపొందిన హీరోయిన్.. నందమూరి బాలకృష్ణ తిరుగులేని హీరో.. సుమ అద్భుతమైన యాంకర్.. నిజానికి వీళ్ళ అనుభవంతో పోల్చితే సుడిగాలి సుధీర్ తక్కువ అని చెప్పాలి. అయినప్పటికీ సుడిగాలి సుధీర్ తన మ్యాజికల్ యాంకరింగ్ తో ఆహా ఓటీటీ లో అదరగొడుతున్నాడు.

ఆహా లో సర్కార్ షోను ఒక రేంజ్ లోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికీ మీరు యూట్యూబ్‌లో కనుక చూసుకుంటే సుడిగాలి సుధీర్ ఎపిసోడ్‌లు మిలియన్లు దాటిపోయాయి. సమంత.. నందమూరి బాలకృష్ణ. సుమ చేసిన వీడియోల కంటే కూడా సుడిగాలి సుధీర్ చేసిన వీడియోలకు వ్యూస్ అధికంగా ఉంటాయి.

బేసికల్గా ఒక షోను ఆడియన్స్ రిపీటెడ్ గా చూసేలా నడిపించడం అంత ఈజీ కాదు.. కానీ ఆ మ్యాజిక్ సుడిగాలి సుధీర్ దగ్గర మెండుగా ఉంది. అందుకే అతడు బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయాడు. మామూలుగా అయితే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ లో కార్యక్రమాలకు వీక్షకుల సంఖ్య అధికంగా ఉంటుంది. చివరికి ఓటీటీలో కూడా కార్యక్రమాలు చేస్తే వీక్షకులు చూస్తారని.. బ్రహ్మరథం పడతారని సుడిగాలి సుధీర్ నిరూపించాడు. అందుకే అతడిని బుల్లితెర సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

అతడు ఓ స్థాయిలో యాంకరింగ్ చేశాడు.. కంటెస్టెంట్లు కుళ్ళు జోకులు వేసినాడు.. చివరికి తనను తాను తగ్గించుకుంటాడు. ఒక గొప్ప మాట ఉంది.. తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పటికీ గొప్పగా ఉంటాడని.. సుడిగాలి సుధీర్ కూడా అదే చేస్తున్నాడు. అందువల్లే ఈ స్థాయిలో ఉన్నాడు. ఒక ఒటిటి.. అది కూడా రీజినల్ లాంగ్వేజ్.. అందులోనూ బడ్జెట్ పరిమితుల్లో ఒక షో.. ఒక స్థాయి గెస్టులు మాత్రమే.. అయినా ఆ షోను రికార్డు లెవెల్ లో వ్యూస్ వచ్చే విధంగా రూపొందించడం మాటలు కాదు. అన్నింటికీ మించి ఆ షో కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాచే విధంగా చూడటం అంత ఈజీ కాదు. అన్నీ చేసి చూపించాడు సుడిగాలి సుధీర్. అందుకే అతడు బుల్లితెరకు మకుటం లేని మహారాజు..



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

2 days ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

2 days ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

2 days ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

3 days ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

3 days ago