Home Uncategorizedఐదుగురు దొంగల్ని.. ఒంటి చేత్తో మట్టి కరిపించింది.. వైరల్ వీడియో – Jananethram News

ఐదుగురు దొంగల్ని.. ఒంటి చేత్తో మట్టి కరిపించింది.. వైరల్ వీడియో – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


వుమన్ ఫైట్స్ ఫైవ్ థీవ్స్: వాళ్లు కరడు కట్టిన దొంగలు. చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. కనిపిస్తే చాలు చంపేసే కోపం వారిలో ఉంది. అటువంటి వారితో కాకలు తీరిన మగవాళ్ళు పోటీ పడటమే కష్టం. అటువంటిది ఒక మహిళ వారికి ఎదురు నిలబడింది. ఇప్పుడు ఆమె చేసిన సాహసం యావత్ దేశాన్ని సెల్యూట్ చేసేలా చేస్తోంది. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఐదుగురు దొంగలు గోపాల్ జ్యువెలర్స్ అనే బంగారం దుకాణంలో గోల్డ్ దొంగతనం చేయడానికి వచ్చారు. వారంతా […]

వుమన్ ఫైట్స్ ఫైవ్ థీవ్స్: వాళ్లు కరడు కట్టిన దొంగలు. చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. కనిపిస్తే చాలు చంపేసే కోపం వారిలో ఉంది. అటువంటి వారితో కాకలు తీరిన మగవాళ్ళు పోటీ పడటమే కష్టం. అటువంటిది ఒక మహిళ వారికి ఎదురు నిలబడింది. ఇప్పుడు ఆమె చేసిన సాహసం యావత్ దేశాన్ని సెల్యూట్ చేసేలా చేస్తోంది.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఐదుగురు దొంగలు గోపాల్ జ్యువెలర్స్ అనే బంగారం దుకాణంలో గోల్డ్ దొంగతనం చేయడానికి వచ్చారు. వారంతా కూడా స్కార్పియో వాహనంలో వచ్చారు. వచ్చిన దొంగలు ముఖాలకు ముసుగులు ధరించారు. చేతికి గ్లాస్ లు ధరించి.. మారణాయుధాలతో.. గ్యాస్ కట్టర్లతో వచ్చారు. షట్టర్లను పగలగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. అంతలోనే ఒక మహిళ వారి ప్రయత్నానికి అడ్డుపడింది. ఐదుగురు దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించారు.. ఆమె ధైర్యంగా ఎదుర్కొంది.

దొంగలు పరారైన దృశ్యాలు సీసీటీవీలలో రికార్డయ్యాయి. దీంతో ఆ దొంగలు వచ్చిన వాహనాన్ని పోలీసులు పట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు ఆధారంగా ఎక్కడికి వెళ్లింది అనే విషయం మీద ఆరా తీస్తున్నారు. ఆ యువతి గనక అడ్డుపడకపోయి ఉంటే ఆ దొంగలు జ్యువెలర్స్ షాప్ లో దోపిడీ చేసేవారు. ఎందుకంటే వారి చేతిలో ఆత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి. వాటి ద్వారా వారు ఏమైనా చేయగలరు. అయితే వారి ప్రయత్నాలను ఆ యువతి అడ్డుకుంది. గట్టిగా కేకలు వేసింది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.

బంగారం ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జువెలరీ షాపులను టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్న జువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే గోపాల్ జ్యువెలర్స్ షాప్ లో దొంగతనానికి ప్రయత్నించేందుకు వచ్చిన దొంగలను ఆ యువతి అడ్డుకుంది. బంగారాన్ని దొంగిలించే వారి ప్రయత్నాన్ని ఆ యువతి అడ్డుకోవడం నిజంగా గొప్ప విషయం.



You may also like

Leave a Comment