Home ఆంధ్రప్రదేశ్వరదలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ – RMK NEWS

వరదలో కొట్టుకుపోయిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Andhra Pradesh Floods : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు ఒక్కసారిగా తారుమారు చేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఆకస్మిక వరద ప్రవాహంలో చిక్కుకోవడం ఉత్కంఠకు దారితీసింది. అయితే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

పరిశీలనకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులతో కలిసి వెళ్లారు. పరిస్థితులను గుర్తించేటప్పుడు ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కూడా వరద ప్రవాహంలో చిక్కుకున్నారు.

అనూహ్యంగా పెరిగిన నీటి ప్రవాహంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఆందోళన. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. మరో బోటులో అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర అధికారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

మరోవైపు.. 9 నెలల గర్భిణీకి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ

వరదల కారణంగా పార్వతీపురంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. 9 గర్భిణీ భూమిక వరద నీటిలో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

గర్భిణీకి లైఫ్ జాకెట్ అందించి జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి. సకాలంలో రెస్క్యూ సిబ్బంది స్పందించడంతో గర్భిణీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సాలూరులో ఎక్కడ చూసినా నీరే..

భారీ వర్షాలతో సాలూరు పట్టణం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్వయంగా పరిశీలించారు.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను నియమించారు. సాలూరు పరిధిలోని రోడ్లు, చెరువులు, పంటలు, ఇళ్ల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వరదల్లో అప్రమత్తంగా

ఉత్తరాంధ్రలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదలు ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాలను చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

ఒకవైపు వరద పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమాదంలో చిక్కుకోగా.. మరో 9 నెలల గర్భిణీని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ వరదల తీవ్రతను తెలియజేస్తోంది.

You may also like

Leave a Comment