Home సినిమాSampoornesh Babu: సంపూర్ణేష్ కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు.. – RMK NEWS

Sampoornesh Babu: సంపూర్ణేష్ కాబట్టి సైలెంట్ గా ఉన్నాడు.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Sampoornesh Babu: తల కాస్త ఇబ్బందిగా ఉండటం తప్పడం లేదు. నిజానికి సినిమా అనేది ఒక వర్గానికి.. ఒక వర్ణానికి సంబంధించింది కాదు. సినిమాలో ఉండే 24 విభాగాల్లో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. వీరికి నేపథ్యాలతో సంబంధం లేదు. కులాలతో సంబంధం లేదు. ప్రాంతాలతో సంబంధం లేదు. జస్ట్ ఆ సినిమాకి పనికి వచ్చే విభాగాల్లో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. సినీ పెద్దలలో చిరంజీవి లాంటి వాళ్లు పరిశ్రమకు యువ రక్తం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే చిరంజీవి […]

సంపూర్ణేష్ బాబు: తల కాస్త ఇబ్బందిగా ఉండటం తప్పడం లేదు. నిజానికి సినిమా అనేది ఒక వర్గానికి.. ఒక వర్ణానికి సంబంధించింది కాదు. సినిమాలో ఉండే 24 విభాగాల్లో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. వీరికి నేపథ్యాలతో సంబంధం లేదు. కులాలతో సంబంధం లేదు. ప్రాంతాలతో సంబంధం లేదు. జస్ట్ ఆ సినిమాకి పనికి వచ్చే విభాగాల్లో నైపుణ్యం ఉంటే సరిపోతుంది.

సినీ పెద్దలలో చిరంజీవి లాంటి వాళ్లు పరిశ్రమకు యువ రక్తం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే చిరంజీవి కూడా ఒకప్పుడు యువకుడే. ఆయన కూడా యంగ్ బ్లడ్ గా ఉన్నప్పుడే సినిమా పరిశ్రమలోకి వచ్చారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. సినిమా పరిశ్రమను చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అన్నట్టుగా మార్చేశారు. ఇంత స్థాయి ఉండదు చిరంజీవి ఏమాత్రం హిపోక్రసీ చూపించారు. ఎవరు పిలిచినా సరే కార్యక్రమాలకు వెళ్తారు. సినిమా ప్రమోషన్ చేస్తారు. అంతటి చిరంజీవి ఆ స్థాయిలో అణకువగా ఉన్నారు. చిరంజీవిని చూసి చాలా మంది పరిశ్రమలోకి వచ్చారు. చిరంజీవి లాగానే డౌన్ టు ఎర్త్ కోసం అవలంబిస్తున్నారు.

కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులకు ఇది నచ్చడం లేదు. ముఖ్యంగా తగ్గితే నటువంటి వీళ్లకు ఏమాత్రం ఒప్పడం లేదు.. పైగా ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఓడు కూడా జర్నలిస్ట్ అని బిల్డప్ ఇస్తున్నారు. చేతిలో మైక్ ఉండగానే తామేదో సమాజ ఉద్దారకులం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎదుటివాళ్లను ప్రశ్నించేటప్పుడు తమకు ఉన్న స్థాయి ఏంటో మర్చి పోతున్నారు. పైగా డెమిడ్స్ మాదిరిగా బిహేవ్ చేస్తున్నారు. తాజాగా ఒక కాల్డ్ జర్నలిస్ట్ వ్యవహరించిన తీరు మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది.

ది ప్యారడైజ్ సినిమాలో ఒక కీలకపాత్రను పోషించారు సంపూర్ణేష్ బాబు. ఎక్కడో సిద్దిపేట జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన సంపూర్ణేష్ బాబు తనను తాను నిరూపించుకున్నారు. పైగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పెద్దపెద్ద స్టార్లు కూడా సహాయం చేయలేదు. కానీ సంపూర్ణేష్ బాబు తన దగ్గర ఉన్నదాంట్లో కొంతమేర సమాజ హితానికి ఇచ్చారు. ఇది అతడి ఒరిజినల్ క్యారెక్టర్. పైగా తనను తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకోడు. తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తాడు. వచ్చిన ఆఫర్లను కాదనకుండా సినిమాల్లో నటిస్తుంటాడు. శ్రీకాంత్ ఓదెలకు ప్యారడైజ్ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఒక పాత్రకు సరిపోతాడు. దానికి తగ్గట్టుగానే పాత్రను డిజైన్ చేశాడు. ఆ పాత్రలో సంపూర్ణేష్ బాబు జీవించేసాడు. చాలామంది అభిమానులు సంపూర్ణేష్ బాబు తెరమీద కనిపించగానే విజిల్స్ వేస్తున్నారు. ఇది అతడి రేంజ్.

కానీ ఒక సో కాల్డ్ సినిమా జర్నలిస్ట్ కి సంపూర్ణేష్ బాబు నచ్చలేదు. అసలు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నువ్వు ఎలా వచ్చావు.. అసలు నువ్వు సినిమా రంగానికి ఎలా సూట్ వని అనుకున్నావు.. అసలు సినిమాలో అవకాశం వస్తుందని నువ్వు ఊహించవా.. అసలు సినిమాకి రావాలి అని దురద నీకు ఎలా వచ్చింది.. ఇదిగో ఇలా సాగిపోయింది ఆ కాల్డ్ జర్నలిస్ట్ ప్రశ్న. సంపూర్ణేష్ బాబును ప్రశ్నించే ముందు.. ఆ జర్నలిస్ట్ కూడా కొన్ని ప్రశ్నలు తనను తాను వేసుకొని ఉంటే బాగుండేది. ఎటువంటి జర్నలిజం నేపథం లేకుండా అతడు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు.. తన ముఖానికి ఈ జర్నలిజం సూట్ అవుతుందని అనుకున్నాడా.. తనకు ప్రశ్నలే అడగడం రాదు కదా.. ఒక పాత్రికేయుడిగా ఎలా నిలబడతాడని అనుకున్నాడు.. వాస్తవానికి సంపూర్ణేష్ బాబు కాబట్టి అండీ, గారు అని చెప్పాడు. ఒకవేళ అతడి స్థానంలో మరొకరు ఉంటే కచ్చితంగా ఎడమకాలు చెప్పుతో గట్టిగా కొట్టేవారు. ఎవడ్రా నీకు జర్నలిజం ఉద్యోగం వచ్చింది.. ఎవడ్రా నిన్ను జర్నలిస్ట్ అని పిలుస్తున్నది అని కచ్చితంగా గల్లా లాగి అడిగేవారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
ఇబ్బంది పడకండి: డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు - RMK NEWS

[ad_1] ఇబ్బంది పడకండి: మలయాళం లో ప్రముఖ నటుడు ఫహద్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు…

3 hours ago
ప్రోటీన్ పౌడర్లో విషం.. సౌజన్య భర్తను సాధిక్ ఏం చేశాడు.. - Jananethram News

[ad_1] AE Nookaraju Case : ఏపీలో పిఠాపురం ప్రాంతంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఇటీవల సామూహికంగా…

3 hours ago
Teacher Student Incident : హోంవర్క్ చేయలేదని దండించిన ఉపాధ్యాయురాలు.. ఇంతలోనే గుండె పగిలిన విద్యార్థి.. వీడియో వైరల్* - RMK NEWS

[ad_1] Teacher Student Incident : విశాఖ జిల్లాలో కలకలం రేపింది. ఒకటో తరగతి చదువుతున్న ప్రణయ్ తేజ…

3 hours ago
BRICS సమ్మిట్: ఈ పుతిన్, జిన్ పింగ్ కార్లు కదిలే సైన్యంతో సమానం.. - RMK NEWS

BRICS సమ్మిట్: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధినేత పుతిన్ మద్దతు.…

3 hours ago
ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా - RMK NEWS

ఆంధ్రప్రదేశ్: టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ నగరంలో ఐటి విస్తరణకు…

3 hours ago