Home Uncategorizedపంజాబ్ నేషనల్ బ్యాంక్ : బ్యాంకు లెక్కల్లో 4.36 లక్షల తేడా.. – Jananethram News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : బ్యాంకు లెక్కల్లో 4.36 లక్షల తేడా.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


పంజాబ్ నేషనల్ బ్యాంక్ : తీగ లాగితే డొంకంతా కదిలిన సామెతను మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా ఆ సామెత అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతేమో గాని.. అధికారులు మాత్రం వాస్తవంలో బోధపడింది. పైగా ఒక సాధారణ వ్యవహారాన్ని రంగంలోకి దిగిన వాళ్లకు.. కోట్ల మోసం జరిగిన తీరు బయటపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహారన్ పూర్ ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు కరెన్సీ చెస్ట్ ఉంది. ఇక్కడ […]

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : తీగ లాగితే డొంకంతా కదిలిన సామెతను మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా ఆ సామెత అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతేమో గాని.. అధికారులు మాత్రం వాస్తవంలో బోధపడింది. పైగా ఒక సాధారణ వ్యవహారాన్ని రంగంలోకి దిగిన వాళ్లకు.. కోట్ల మోసం జరిగిన తీరు బయటపడింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహారన్ పూర్ ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు కరెన్సీ చెస్ట్ ఉంది. ఇక్కడి నుంచే నగదును ఇతర బ్యాంకులకు సరఫరా చేస్తారు. ఈ బ్యాంకులో ఇటీవల ఆడిటింగ్ జరిగింది. దాదాపు 4.36 లక్షల తేడా వచ్చిందని తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి దారుణంగా దర్యాప్తు చేస్తుంటే మరో విషయం వెలుగు చూసింది. ఏకంగా 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్ల మోసం బయటపడింది. సహరన్ పూర్ ప్రాంతంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ నగదు నిల్వ ఈ మోసం చోటు చేసుకుంది.

గత నెల 10న ఇక్కడి బ్యాంక్ నగదు నిల్వ కేంద్రం నుంచి రిజర్వ్ ఆఫ్ ఇండియా అధికారులు కొంత డబ్బు పంపించారు. ఈ డబ్బులో 4.6 లక్షలు తక్కువ వచ్చాయి.. ఆర్బిఐ అధికారులు వెంటనే ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలు చేస్తున్నప్పుడే 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటికి వచ్చాయి. కొంతమంది వ్యక్తులు నోట్లను అక్కడ పెట్టి.. అసలు నోట్లను తీసుకెళ్లినట్లుగా. ఈ వ్యవహారంలో బ్యాంక్ సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్, కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ మేనేజర్లు సుశీల్ శర్మ.. అమిత్ కుమార్.. ఇంకా మరికొందరిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. కేసులు కూడా నమోదు చేశారు.

దాదాపు 7.4 కోట్ల నకిలీ నోట్లను అక్కడ పెడుతుంటే అధికారులు ఏం చేశారు.. అక్కడ సీసీ కెమెరాలు లేవా.. నగదు నిల్వ భద్రత ఎండమావేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియాలో కూడా వార్తలు ప్రసారమయ్యాయి. ఇప్పటివరకు ఈ కేసులో అనుమానితులను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే గాని అసలు విషయం బయటపడుతుందని పోలీసులు అంటున్నారు.

సాధారణంగా మన నగదుకు భద్రత ఉంటుందని.. మన బంగారానికి భరోసా ఉంటుందని బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటాం. బ్యాంకుల దగ్గర ఉంటే నగదు నూటికి నూరు శాతం నాణ్యమైనదని భావిస్తూ ఉంటాం. కానీ చెస్ట్ బ్రాంచ్ లోనే నకిలీ నోట్లు ఉన్నాయంటే దాన్ని ఏమనుకోవాలి.. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ వ్యవహారంలో అధికారులు ఎటువంటి దిద్దుబాటు చర్యలకు దిగుతారనేది చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

2 hours ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

2 hours ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

2 hours ago
#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

#113 YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

2 hours ago
YS Jagan Mohan Reddy: కమ్యూనిస్టు పార్టీల నాయకులతో జగన్.. - RMK NEWS

YS Jagan Mohan Reddy: ఇటీవల కాలంలో జగన్ మీడియా ముందుకు తరచుగా వస్తున్నారు. గంటల తరబడి మాట్లాడుతున్నారు.…

2 hours ago