జూనియర్ ఎన్టీఆర్: ఇబ్బంది పడకండి సినిమా ప్రమోషన్ నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ గట్టిగానే ఉన్నారు. అసలే ఆయన బిజినెస్ మాన్. సినిమా వ్యాపార మెలకువలు తండ్రి ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఒంట పట్టుకున్నాడు. తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాడు. కార్తికేయ ప్రస్తుతం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా నిర్మాతలలో ఒకరిగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో భారీగా విడుదలవుతోంది. మైత్రి మూవీ […]
జూనియర్ ఎన్టీఆర్: ఇబ్బంది పడకండి సినిమా ప్రమోషన్ ను నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ గట్టిగానే చేస్తున్నారు. అసలే ఆయన బిజినెస్ మాన్. సినిమా వ్యాపార మెలకువలు తండ్రి ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఒంట పట్టుకున్నాడు. తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నాడు.
కార్తికేయ ప్రస్తుతం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా నిర్మాతలలో ఒకరిగా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో భారీగా విడుదలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ సినిమా ఎంతకు అమ్మారు.. ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది అనే విషయాలు ఇంతవరకు తెలియలేదు. కాకపోతే తెలుగు చిత్రాల ప్రశ్నలు పెద్దపెద్ద ప్లేయర్ల ద్వారా ఈ సినిమా కార్తికేయ విడుదల చేస్తున్న దృశ్యాలు.
ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు దిల్ రాజు.. మైత్రి మూవీ మేకర్స్.. సాయి కొర్రపాటి.. కాలభైరవ.. ఇంకా చాలామంది అతిరథ మహారధులు. ఈ నేపథ్యంలో తన మాట మీద నమ్మకం ఉంచి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్కు కార్తికేయ ధన్యవాదాలు తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పాడు. వేదిక మీద కార్తికేయ మాట్లాడుతుండగానే.. ఎన్టీఆర్.. రాజమౌళి.. పహాడ్ మీద పూల వర్షం కురిపించాడు కార్తికేయ. ఇటువంటి ఆలోచనలు చేయడంలో కార్తికేయ దిట్ట.
వారణాసికి సంబంధించి ఆమధ్య రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక వేడుకలో మహేష్ బాబు ఎద్దు మీద నుంచి వచ్చారు. దీని వెనక ప్లాన్ కార్తికేయదే. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ లో ఎన్టీఆర్ బోన్ నుంచి కిందికి దూకే ఆలోచన కూడా కార్తికేయదే అని చెబుతారు. అలాంటి థాట్ నే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అమలు చేశారు. ఆకాశం నుంచి పూలజల్లును రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్.. ఫహద్ మీద కురిపించారు. కార్తికేయ చేసిన ఈ పని చూసి జూనియర్ ఎన్టీఆర్ కు నోటి వెంట మాట రాలేదు. పైగా తన మీద పూలు కురుస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మీద తనకున్న ప్రేమను కార్తికేయ మరోసారి ప్రదర్శించారు. వేదిక మీద మాట్లాడుతుండగానే ఈ పూల జల్లు కురవడం కార్తికేయ ప్రేమకు నిదర్శనమని అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా ట్రెండింగ్లో ఉంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు నటులు రావడం.. వారు నాలుగు మాటలు చెప్పడం కొత్త విషయం కాదు. కానీ వచ్చిన అతిధులకు బ్రహ్మాండమైన స్వాగతం పలకడం.. వారు ఆనందపడేలా చేయడం అంత ఈజీ కాదు. ఈ పని చేసి కార్తికేయ తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాడు. ఇదీ రాజమౌళి కొడుకు అంటే ఇండస్ట్రీ పెద్దలకు తన స్టామినా చూపించాడు.