SS రాజమౌళి: దర్శక ధీరుడుగా రాజమౌళికి పేరుంది. ఇంతవరకు ఈయనకు అపజయం అంటే తెలియదు. మహేష్ హీరోగా… ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. నిజానికి నటనలో మహేష్ కు తిరుగులేదు. అయితే అతని నటన గురించి ఇంతవరకు రాజమౌళి తన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు. కాకపోతే తనకు ఏడుపు వచ్చిందని రాజమౌళి. అది కూడా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా […]
ఎస్ఎస్ రాజమౌళి: దర్శక ధీరుడుగా రాజమౌళికి పేరుంది. ఇంతవరకు ఈయనకు అపజయం అంటే తెలియదు. మహేష్ హీరోగా… ప్రియాంక చోప్రా హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. నిజానికి నటనలో మహేష్ కు తిరుగులేదు. అయితే అతని నటన గురించి ఇంతవరకు రాజమౌళి తన అభిప్రాయాన్ని బయటపెట్టలేదు. కాకపోతే తనకు ఏడుపు వచ్చిందని రాజమౌళి. అది కూడా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద..
రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో.. రాజమౌళి మేనల్లుడు శశాంక్ దర్శకత్వంలో.. కాలభైరవ సంగీత దర్శకుడిగా.. రమా రాజమౌళి కాస్ట్యూమ్ డివిజన్ గా.. రాజమౌళి ప్రజెంటర్ గా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన సంగతులను ఆ వేదిక మీద నుంచి పంచుకున్నారు.. జూనియర్ ఎన్టీఆర్.. ఫహద్.. దర్శకుడు శశాంక్.. చిన్నారి సారా.. తన కుమారుడు కార్తికేయ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి పంచుకున్నారు.
“ఒక 50 ఏళ్ల మహిళ నా వద్దకు వచ్చింది. మీరు ఫహద్ సినిమాలు చూస్తారా అని అడిగారు. ఫాఫా అని కూడా చెప్పింది . దీనినిబట్టి ఫహద్ ఫజిల్ మన ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో.. అతని ట్రాన్స్ సినిమా చూసి చాలా ఆనందపడ్డాను. శశాంక్ నా వద్దకు వచ్చాడు. మనిషి కథ చెప్పడానికి ప్రయత్నించాడు. నా మూడు గంటల సమయం లేదు. కిడ్నాప్ చేయడం ఎలా సాధ్యం.. అనే ప్రశ్న అడిగిన కుతూహలంతో మూడు గంటల పాటు కథ విన్నానని” రాజమౌళి వివరించారు.
రాజమౌళి ఏడ్చేశారు
ఈ సినిమా ఫస్ట్ కాఫీ రాజమౌళి చూశారు. సినిమాకు సంబంధించిన చాలా సన్నివేశాలను చూసి నవ్వుకున్నారు. అలాగే చాలా సేపు ఏడ్చారు. చివరికి ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు ఉబ్బిపోయాయి. రమ కూడా రాజమౌళిని చూసి షాక్ అయ్యారు. ఈ చిత్రంలో ఫహద్ కు పోటీగా చిన్నారి సారా నటించింది. ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఇక కార్తికేయ తనదైన శైలిలో ఈ సినిమాకు సంబంధించి వ్యాపారం చేశారు. సారా ఉన్నంత మాత్రాన ఇది చిన్న పిల్లల సినిమా కాదని.. చిన్నపిల్లల మనస్తత్వాన్ని ప్రతిబింబించే సినిమా అని రాజమౌళి వివరించారు.
SS రాజమౌళి నుండి ధృవీకరణ:
ఆలస్యం లేదు…#డ్రాగన్ సమయానికి వస్తోంది pic.twitter.com/2XUKUpoFeK
— సినీ వరల్డ్ (@Cinee_Worldd) సెప్టెంబర్ 29, 2026