Home అంతర్ జాతీయPAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్థాన్ ఇంత పని చేసింది -RMK NEWS

PAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్థాన్ ఇంత పని చేసింది -RMK NEWS

by RMK NEWS
0 comments
PAK vs BAN: ఇదేందయ్యా ఇది.. పాకిస్థాన్ ఇంత పని చేసింది

PAK vs నిషేధం: క్రికెట్లో పాకిస్థాన్ ఆట తీరు గురించి అందరికీ తెలుసు. ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. ఒక్కోసారి ఆస్ట్రేలియా మీద గెలుస్తుంది.. అదే సమయంలో జింబాబ్వే మీద ఓడిపోతుంది. ప్రత్యర్థి ప్లేయర్ల మీద ఎదురుదాడి చేయాల్సిన పాకిస్థాన్ ప్లేయర్లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇలా ప్రతి సందర్భంలో పాకిస్థాన్ ప్లేయర్లు ఆశ్చర్యాన్ని కళ్ళ ముందు ఉంచుతారు.

ఏషియన్ గేమ్స్ లో భాగంగా పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. ఫైనల్లోకి ప్రవేశించే ఈ పోటీలో పాకిస్తాన్ మొదటి విజయం సాధించింది. నిజానికి ఈ మ్యాచ్ లో ఓవర్ వర్షం వల్ల కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 టికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.. బంగ్లాదేశ్ జట్టులో హృదోయ్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో మొకిం మూడు వికెట్లు పడగొట్టాడు. మిన్హాస్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. 20 పరుగుల రెండో వద్ద వికెట్ చేజార్చుకుంది. 21 పరుగుల వద్ద మూడో వికెట్.. 45 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది.హృదోయ్ దూకుడు వల్ల ఐదో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం లభించింది.. మళ్లీ పాకిస్థాన్ బౌలర్లు సత్తా చూపించడంతో బంగ్లాదేశ్ కథ 111 పరుగుల వద్ద ముగిసింది.

అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగుల వద్ద రెండో వికెట్.. 38 పరుగుల వద్ద మూడో వికెట్.. 53 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే నవాజ్ (27*), సమద్ (30*) పరుగులు చేయడంతో పాకిస్థాన్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని 11.3 ఓవర్లలో పూర్తి చేసింది. ఈ విజయం ద్వారా పాకిస్థాన్ ఫైనల్లోకి వెళ్లిపోయింది.. మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా శ్రీలంక పోటీ పడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లోకి వెళ్తుంది. గోల్డ్ మెడల్ కోసం పాకిస్థాన్ జట్టుతో పోటీ పడుతుంది. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్ లో అదరగొట్టింది. శ్రీలంక మీద గెలిచి ఫైనల్లోకి వెళితే.. అప్పుడు పాకిస్థాన్.. భారత్ మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ మీద పాకిస్తాన్ గెలిచిన దాఖలాలు ఇంతవరకు లేవు. పాకిస్తాన్ జట్టు మీద భారత్ సంపూర్ణ ఆధిపత్యాన్ని చూపుతుంది. అందుకే భారత్ ఫైనల్ వెళ్ళిపోవడం.. గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారత ఆటగాళ్లు జోరు మీద ఉన్నారని.. వారిని నిలబెట్టడం శ్రీలంక వల్ల.. పాకిస్థాన్ వల్ల కాదని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

Just now
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

Just now
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

3 hours ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

3 hours ago
BRICS summit: కారులో పుతిన్ తో.. మోడీతో దౌత్యం అలా ఉంటుంది - RMK NEWS

BRICS summit: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సినిమాలో డైలాగ్…

3 hours ago