Home సినిమాAK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు “ఇంటి” ఫ్యాంటసీ – RMK NEWS

AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు “ఇంటి” ఫ్యాంటసీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు అర్జున్. ఓ దశలో అల్లు అర్జున్ కు హిట్ బోధ చేయడానికి పూజ హెగ్డే తన శాడిజం మొత్తం చూపిస్తుంది.. ఆ తర్వాత ఈ కాళ్ల ఫాంటసీ ఏంటి అని అల్లు అర్జున్ కు క్లాస్ పీకుతుంది. సేమ్ ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇల్లు ఫ్యాంటసీ అంటుకుంది. ఇది ఇప్పటిది కాదు.. అఆ సినిమా […]

AK-47 సినిమా టీజర్ రివ్యూ: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు అర్జున్. ఓ దశలో అల్లు అర్జున్ కు హిట్ బోధ చేయడానికి పూజ హెగ్డే తన శాడిజం మొత్తం చూపిస్తుంది.. ఆ తర్వాత ఈ కాళ్ల ఫాంటసీ ఏంటి అని అల్లు అర్జున్ కు క్లాస్ పీకుతుంది.

సేమ్ ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇల్లు ఫ్యాంటసీ అంటుకుంది. ఇది ఇప్పటిది కాదు.. ఆ సినిమా నాటి నుంచి ఆయనకు ఇది అంటుకుంది. ఆ సినిమాలో సమంత ఇంటిని అత్యంత విశాలంగా చూపించిన ఆయన.. ఆ తర్వాత వరుసగా అదే ఫార్ములాను పట్టుకున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి.. అజ్ఞాతవాసి.. అల వైకుంఠపురంలో.. సరిగ్గా రెండేళ్ల క్రితం వచ్చిన గుంటూరు కారం.. ఇలా ప్రతి సినిమాలో ఇంటిని గట్టిగా చూపించడం.. ఇంట్లో సినిమా కథను అల్లుకోవడం మొదలుపెట్టాడు.

తాజాగా వచ్చిన ఆదర్శ కుటుంబం 47 సినిమా టీజర్ లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటినే నమ్ముకున్నాడు. టీజర్ ప్రారంభంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా వెంకటేష్ ను చూపించిన త్రివిక్రమ్.. ఆ తర్వాత ధనవంతుడిగా మార్చేశాడు. ఎప్పట్లాగానే ధనవంతుడైన తర్వాత వెంకటేష్ ఇంటిని గొప్పగా మార్చేశాడు. ఇలాంటి అద్భుతాలు ఒకటి లేదా రెండు సినిమాల్లో జరిగితే బాగుంటుంది. కానీ ప్రతి సినిమాలో ఇలాంటి వాటినే చూపిస్తే జనాలకు బోర్ కొడుతుంది. ఆల్రెడీ ఓటీటీలలో ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయే కంటెంట్ లభిస్తోంది. పైగా ప్రేక్షకులు కొత్త సినిమాలను కోరుకుంటున్నారు. అలాంటప్పుడు రొటీన్ కొట్టుడు సినిమాలను తీసి జనాల మీదికి వదిలేస్తే.. గుంటూరు కారం ఫలితాలు మాత్రమే ఇస్తారు.

ఆల్రెడీ అజ్ఞాతవాసి సినిమాతో 90ఎమ్ఎమ్ రాడ్ ఫలితం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అర్థమైంది. అల వైకుంఠపురం కొత్త కథ కాకపోయినప్పటికీ ఇచ్చిన ట్రీట్మెంట్ బెటర్ గా ఉండటంతో జనం విరగబడి చూశారు. కానీ గుంటూరు కారంతో జనాలు ఏం చేయాలో అది చేశారు. ఇలాంటప్పుడు త్రివిక్రమ్ కథలు మార్చాలి. ముఖ్యంగా ఇంటిని మార్చాలి. అలా కాకుండా ప్రేక్షకులను ఏమార్చుకుంటూ పోతే.. ఫలితం బ్లాక్ బస్టర్ కాదు.. డిజాస్టర్ అవుతుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ ఖాతాలో ఖలేజా.. అజ్ఞాతవాసి.. గుంటూరు కారం ఉంది. ఈ జాబితాలోకి ఆదర్శ కుటుంబం రావద్దు అనుకుంటే చాలా మార్పులే చేయాలి. అంత సమయం ఉందా.. ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా పడింది.. ఈసారి వెంకటేష్ కాపాడతాడా.. ఇంకేదైనా అద్భుతం జరుగుతుందా చూడాలి..



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

56 minutes ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

56 minutes ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

4 hours ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

4 hours ago
BRICS summit: కారులో పుతిన్ తో.. మోడీతో దౌత్యం అలా ఉంటుంది - RMK NEWS

BRICS summit: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సినిమాలో డైలాగ్…

4 hours ago