Home సినిమాAllu Aravind:అల్లు అరవింద్ ఆహా ఓటీటీని అమ్మేస్తున్నారా.. – RMK NEWS

Allu Aravind:అల్లు అరవింద్ ఆహా ఓటీటీని అమ్మేస్తున్నారా.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


అల్లు అరవింద్: గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఇంకా కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల కాలంలో అల్లు అరవింద్ భిన్నమైన వ్యాపారాల వైపు దృష్టిసారించారు. అల్లు స్టూడియోస్ నిర్మించారు. హైదరాబాద్ నగరంలో అల్లు థియేటర్ కూడా నిర్మించారు. ఆయన చేతిలో గీత ఆర్ట్స్.. ఇంకా ఆహా ఓటీటీ కూడా ఉంది. విలక్షణమైన నిర్మాతగా.. మార్కెట్ పరిస్థితులను […]

అల్లు అరవింద్: గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయన బ్యానర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఇంకా కొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల కాలంలో అల్లు అరవింద్ భిన్నమైన వ్యాపారాల వైపు దృష్టిసారించారు. అల్లు స్టూడియోస్ నిర్మించారు. హైదరాబాద్ నగరంలో అల్లు థియేటర్ కూడా నిర్మించారు. ఆయన చేతిలో గీత ఆర్ట్స్.. ఇంకా ఆహా ఓటీటీ కూడా ఉంది.

విలక్షణమైన నిర్మాతగా.. మార్కెట్ పరిస్థితులను ముందుగా అంచనా వేసే వ్యక్తిగా.. సినిమా నిర్మాణంలో ఖర్చును నియంత్రించుకుంటూ సాగే అద్భుతమైన ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు పేరు వచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి అల్లుడు రామలింగయ్య కుమారుడిగా వచ్చిన అరవింద్.. ఆ తర్వాత తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు. దీనిని బట్టి ఆయన ముందుచూపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఏ వ్యాపారమైనా సరే నష్టాలు ఉంటాయి.. లాభాలు కూడా ఉంటాయి. అల్లు అరవింద్ నిర్వహించే వ్యాపారాలలో నష్టాలు ఉండవు. ఇది ఇండస్ట్రీలో చెప్పే మాట. అయితే ఆయన సారథ్యంలో నడుస్తున్న ఆహా ఓటీటీ నష్టం లో ఉందా.. దాన్ని అమ్మేస్తున్నారా.. అసలు ఎందుకు ఈ నెగటివ్ స్పెక్యులేషన్.. ఏం జరుగుతుంది.

2024లో ఆహాలోకి వ్యూహాత్మక భాగస్వామిని అల్లు అరవింద్ ఆహ్వానించారు. సరిగ్గా 2020 ఫిబ్రవరి 8న ఆహా మొదలైంది. అధికారిక స్ట్రీమింగ్ 2020 మార్చి 25 నుంచి మొదలైంది. ఆహాలు ప్రధాన ప్రమోటర్లుగా గీత ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూపు నుంచి జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. 2021 సంవత్సరం నుంచి తమిళ మార్కెట్లోకి ఆహా విస్తరించడం మొదలుపెట్టింది. ఈ ఉంది దిల్ రాజు.. విజయ్ దేవరకొండ ఈ ప్లాట్ఫారం లోకి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వారి వాటా ఎంత అనేది సక్రమంగా తెలియదు. 2024లో సోనీ.. సన్ టీవీ వంటి సంస్థలు ఆహాలు స్ట్రాటజిక్ తీసుకోవడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నివేదిక ప్రకారం సోనీ కనీసం 26% వాటా తీసుకోవడానికి ఆసక్తి చూపించింది.. దీని విలువ 1500 కోట్ల వరకు ఉంటుందని అప్పట్లో పరిశ్రమ అంచనా వేసింది. ఈ చర్చల వార్తలను సోనీ అధికారికంగా ఖండించింది.. ఆహాతో ఎటువంటి ఒప్పందాలు లేవని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఆహా విస్తరణకు అల్లు అరవింద్ విపరీతంగా కృషి చేస్తున్న నేపథ్యంలో దానిని అమ్మడం అనేది అబద్ధమని.. అల్లు అరవింద్ రీజినల్ ఓటిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కన్నడ.. మలయాళం మార్కెట్లోకి ఆహా ద్వారా ప్రవేశించడానికి అల్లు అరవింద్ బలమైన అడుగులు వేస్తున్నారు. మలయాళం లో అల్లు అర్జున్ విపరీతమైన మార్కెట్ ఉంది. కన్నడ చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్‌కు బలమైన పరిచయాలు ఉన్నాయి. అల్లు అరవింద్ ఇప్పటికే అల్లు స్టూడియోస్.. హయ్యండ్ క్వాలిటీస్ తో ఉన్న సినిమా థియేటర్ నిర్మించారు. ఆహా ఓటీని ఆయన ఎలా వదులుకుంటారు.. నష్టం వస్తుందని తెలిస్తే.. అందులో పెట్టుబడిని నియంత్రిస్తారు. ఇప్పటికే ఆహాలో ప్రాజెక్టు కే.. సర్కార్ వంటి షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆన్ స్టాపబుల్ వంటి షో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆహా ఓటిటి చేతులు మారడం అనేది అబద్ధం.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

22 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

1 day ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

1 day ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

1 day ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

1 day ago