డ్రైవింగ్ లైసెన్స్ : ప్రపంచంలో ఏడు వింతలు అని చదువుతున్నాం కదా.. కానీ ఇది ఎనిమిదవ వింత. ఇంతవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. గుర్తించే సాహసం చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఇలా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారని ప్రపంచానికి తెలిసింది. మనం ఏదైనా వాహనం కొనుగోలు.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేటప్పుడు అనేక రకాల పరీక్షలు చేసి చూస్తాం. ముందుగా వాహనాన్ని అధికారులు నడుపుతాం. వారు పెట్టిన పరీక్షలను […]
డ్రైవింగ్ లైసెన్స్ : ప్రపంచంలో ఏడు వింతలు అని చదువుతున్నాం కదా.. కానీ ఇది ఎనిమిదవ వింత. ఇంతవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. గుర్తించే సాహసం చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఇలా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారని ప్రపంచానికి తెలిసింది.
మనం ఏదైనా వాహనం కొనుగోలు.. డ్రైవింగ్ లైసెన్స్ పొందేటప్పుడు అనేక రకాల పరీక్షలు చేసి చూస్తాం. ముందుగా వాహనాన్ని అధికారులు నడుపుతాం. వారు పెట్టిన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తాం. అప్పుడు వారు మనకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో చాలా వరకు దేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడానికి అధికారులు ఇటువంటి నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తారు.
ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఒకదారిలో వెళ్తుంటే.. ఆఫ్ఘనిస్తాన్ మరోదారిలో వెళ్తోంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నిబంధనలను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా డ్రైవి లైసెన్స్ లను జారీ చేసే విచిత్రంగా రూపొందించారు. రవాణా శాఖ అధికారి ముందుకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అనుకునేవారు వస్తుంటారు. ఆ తర్వాత అతడు వారి దరఖాస్తులను పరిశీలించాడు. ఎటువంటి వాహనం తోలుతారో ముందుగానే అడుగుతాడు. వారు టు వీల్… త్రీ వీల్.. ఫోర్ వీల్.. హెవీ ఇలా వెహికల్స్ పేరు చెప్తే.. అతడు ఆమోదిస్తాడు. గేర్లు వేయడం.. క్లచ్ ఉపయోగించడం.. బ్రేకులు వాడటం.. ఎక్సలేటర్ రేస్ చేయడం.. ఇలా ప్రతి ఒక్కరు అతను అడుగుతాడు. కాకపోతే ఇదంతా కూడా ప్రాక్టికల్ గా ఉండదు. రవాణా శాఖ అధికారి చెప్పినప్పుడల్లా వారు గాలిలో సంకేతాలు ఇస్తుంటారు. ఆ సంకేతాలు అతడికి నచ్చితే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎవరైనా చేస్తారా.. ఇలాంటి గాలి పరీక్షలు చేస్తారా.. ఇదెక్కడి విడ్డూరం.. ఒకవేళ వాహనాలు నడపకపోతే వారి పరిస్థితి ఏంటి.. రోడ్డు ప్రమాదాలకు కారణమైతే.. ఎవరు బాధ్యత తీసుకుంటారు.. అనే ప్రశ్నలను నెటిజన్లు ఇలా చేస్తే.. రవాణా శాఖ అధికారులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.