Home ఆంధ్రప్రదేశ్వైఎస్ జగన్ రాయలసీమ బాగుపడడం జగన్ కు ఇష్టం లేదా.. – RMK NEWS

వైఎస్ జగన్ రాయలసీమ బాగుపడడం జగన్ కు ఇష్టం లేదా.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

వైఎస్ జగన్: అదే కోపం.. అదే ప్రయాస.. అదే విషం.. లక్షల కోట్లు వచ్చినప్పటికీ.. రూపురేఖలు మారుతున్నప్పటికీ.. జనాలు హర్షిస్తున్నప్పటికీ జగన్ కు సంతృప్తి కూడా లేదు. పైగా అడ్డగోలు రాతలతో.. తనలో అక్కసు బయట పెట్టుకున్నారు. సొంత మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు. రాయలసీమ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్లతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేసింది. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని తీసుకొచ్చింది. మదనపల్లి […]

వైఎస్ జగన్: అదే కోపం.. అదే ప్రయాస.. అదే విషం.. లక్షల కోట్లు వచ్చినప్పటికీ.. రూపరేఖలు మారుతున్నప్పటికీ.. జనాలు హర్షిస్తున్నప్పటికీ జగన్ కు వీసమెత్తు సంతృప్తి కూడా లేదు. పైగా అడ్డగోలు రాతలతో.. తనలో అక్కసు బయట పెట్టుకున్నారు. సొంత మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేసి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు.

రాయలసీమ ప్రాంతంలో దాదాపు లక్ష కోట్లతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేసింది. ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని తీసుకొచ్చింది. మదనపల్లి ప్రాంతంలో రిలయన్స్ భాగస్వామ్యంతో అతిపెద్ద సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. దీని ద్వారా హార్టికల్చర్ అద్భుతమైన సేవలు రైతులకు అందబోతున్నాయి. అత్యంత విలువైన పంటలు రాయలసీమ ప్రాంతంలో పండబోతున్నాయి. వాస్తవానికి ఈ పరిణామాన్ని ఏ రాజకీయ నాయకుడైనా సరే స్వాగతిస్తారు. పైగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ దీనికి పూర్తి భిన్నం.

పైగా సొంత మీడియాలో ఈ వికృత అర్థం తీసుకొచ్చారు. ఎప్పటి మాదిరిగానే వితండ వాదాన్ని చేశారు.. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ కాదట, లక్ష అబద్దాలతో చంద్రబాబు పరిపాలన అంట. చంద్రబాబు వ్యవసాయాన్ని గబ్బు పట్టించారట.. ఒకవేళ ఆయనకు అలాంటి ఉద్దేశం ఉంటే.. హంద్రీనీవా, గాలేరు, నగరి, సిబిఆర్ వంటి ప్రాజెక్టులను చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేస్తారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఎందుకు నిర్మిస్తారు. కేసీ కాలువ లిఫ్ట్ ఎందుకు ఏర్పాటు చేస్తారు. ఈ విషయం జగన్ చెప్పినంత మాత్రాన ప్రజలకు తెలియదా.. పైగా అంతటి అంబానీ కుమారుడు చంద్రబాబు కాళ్ళ మీద పడ్డాడు. ఆయన దర్శనికతను కొనియాడాడు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం గొప్పగా ఉందని చెప్పాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏనాడు కూడా రిలయన్స్ ప్రతినిధులు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. పైగా రాజకీయ అవసరాల కోసం మాత్రమే జగన్ ను వాడుకున్నారు. పైగా తన తండ్రి మరణానికి నాడు రిలయన్స్ కారణమంటూ హంగామా చేసిన వైసీపీ నేతలు.. ఆ తర్వాత రిలయన్స్ అధినేత సూచించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఆయన రాయలసీమ బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని టిడిపి నాయకులు అంటున్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సమావేశానికి కూడా సరైన కవరేజ్ ఇవ్వకపోతే దాన్ని ఏమనుకోవాలని టిడిపి నేతలు అంటున్నారు. లోపల పేజీలో మామ అనిపించిన వార్తలో కనీసం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. లోకేష్ ప్రస్తావన లేకుండా చూసుకున్నారని.. ఇటువంటి వ్యక్తులు రాయలసీమ బాగుపడుతుంటే ఎలా ఓర్చుకుంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే.. రాయలసీమ అభివృద్ధి జోరుగా సాగిపోతూ ఉంటుందని.. లక్షల కోట్ల వరద వస్తూనే ఉంటుందని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

22 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago