Home తాజా వార్తలుఓల్డ్ సిటీ హైదరాబాద్ : అతడికి 60.. ఆమెకు 25.. ఇద్దరికీ పెళ్లి.. – RMK NEWS

ఓల్డ్ సిటీ హైదరాబాద్ : అతడికి 60.. ఆమెకు 25.. ఇద్దరికీ పెళ్లి.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


ఓల్డ్ సిటీ హైదరాబాద్ : సరైన ఈడు ఉండాలి. దానికి తగ్గట్టుగానే జోడు ఉండాలి. అప్పుడే ఆ జంట బాగుంటుంది. వారిద్దరి మధ్య వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది. ఇలా కాకుండా ఈడు జోడు విషయంలో ఏదైనా తేడా జరిగితే సంసారం సంక నాకి పోతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వయసు అంతరం రెండు నుంచి నాలుగు సంవత్సరాలకు మించి ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఈ అంతరం దాటిపోతే భవిష్యత్తు కాలంలో అనేక రకాల సమస్యలు […]

ఓల్డ్ సిటీ హైదరాబాద్ : సరైన ఈడు ఉండాలి. దానికి తగ్గట్టుగానే జోడు ఉండాలి. అప్పుడే ఆ జంట బాగుంటుంది. వారిద్దరి మధ్య వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది. ఇలా కాకుండా ఈడు జోడు విషయంలో ఏదైనా తేడా జరిగితే సంసారం సంక నాకి పోతుంది.

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వయసు అంతరం రెండు నుంచి నాలుగు సంవత్సరాలకు మించి ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఈ అంతరం పోతే భవిష్యత్తు కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు ఏనాడు తెలుసు. కానీ నేటి కాలంలో అలా జరగడం లేదు. వయసు అంతరాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు.. స్టేటస్.. ఇతర విషయాలు మాత్రమే చూస్తున్నారు.

వయసు అంతరాన్ని లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంటే వచ్చే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయి. అయితే వీటిని అంచనా వేయకుండా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు.. అది కూడా తనకంటే 35 సంవత్సరాలు చిన్నదైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చివరికి అతడికి ఎలాంటి అనుభవం ఎదురైంది.. ఆ యువతి ఏం చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం..

పాత బస్తికి చెందిన ఓ 60 సంవత్సరాల వ్యక్తికి. గతంలోనే వివాహం జరిగింది. కాకపోతే అతని భార్య చనిపోయింది. పిల్లలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ అతడికి ఒక తోడు కావాల్సి వచ్చింది. మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. అతడికి ఒక పేరయ్య ద్వారా సంబంధం తెలిసింది. దీంతో అతడు వారిని సంప్రదించాడు. వారు మొత్తానికి ఒక సంబంధాన్ని కుదిరించారు. ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందింది. ఇతడిని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టమని చెప్పింది. పెళ్లి చేసే స్థాయి మీకు లేదని చెప్పడంతో ఆ ఖర్చు మొత్తం అతనే భరించాడు. పెళ్లికి దాదాపు 6 లక్షల వరకు ఖర్చయింది. దీనికి తోడు ఆ అమ్మాయికి డబ్బు కూడా ఇచ్చాడు.. బంగారం కూడా చేయించాడు. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే ఆ అమ్మాయి పారిపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.. మీడియా ద్వారా ఈ విషయం బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

24 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

2 days ago