Home ఆంధ్రప్రదేశ్అమరావతి: సాహో చంద్రబాబు.. అమరావతి గగనశీలే.. అస్మాకం అజేయం..దురాజే నిరంతరం – RMK NEWS

అమరావతి: సాహో చంద్రబాబు.. అమరావతి గగనశీలే.. అస్మాకం అజేయం..దురాజే నిరంతరం – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

అమరావతి: శీర్షిక చదివారు కదా.. బాహుబలి సినిమాలోని పాట ఇది. ఆ పాట అర్థం చాలా లోతైనది. అంతకుమించి గొప్పది. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా చంద్రబాబు అలానే చేస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే అంతకుమించి చేస్తున్నారు. వైసిపి రకరకాల రూపాలలో విష ప్రచారం చేస్తున్నప్పటికీ.. తెలంగాణలో గులాబీ పార్టీ తెర కుట్రలు చేస్తున్నప్పటికీ.. చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. పైగా తన మానస పుత్రిక లాంటి రాజధాని విషయంలో అంతకుమించి చేస్తున్నారు.

అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయం. అయితే నగరం భవిష్యత్తును ముందుగానే గురించి ఏకంగా 17 చోట్ల ఇంటర్ ఛాంజిలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 189.93 మేర ఆరు వరసలతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. మొత్తంగా యాక్సిస్ కంట్రోల్ ఓ ఆర్ ఆర్ లోకి వాహనాలు ప్రవేశించాలి అంటే. . అందులో నుంచి బయటికి రావాలంటే సరే ఇంటర్ చేంజ్ ల వద్ద మాత్రమే అవకాశం ఉంటుంది. ఔ రింగ్ రోడ్డు 6 జాతీయ స్టార్‌ను క్రాస్ చేస్తుంది. వీటిలో 8 చోట్ల డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ లు ఉన్నాయి. రాష్ట్ర.. జిల్లాల రోడ్లను క్రాస్ చేసే ప్రాంతాల్లో సింగిల్ ఇంటర్ చేంజ్.. 8 రోటరీ ఇంటర్ చేంజ్ లు నిర్మించబోతున్నారు.

గతంలో 19 ప్రాంతాలలో ఇంటర్ చేంజ్ లు నిర్మించాలని అనుకున్నారు. ప్రాజెక్టు ఖర్చు మొత్తం 38,450 కోట్లు ఉండటంతో.. దీనిని తగ్గించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో.. మళ్లీ మార్పులు.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మాత్రమే సర్వీస్ రోడ్లు నిర్మించారు. బయటి వైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను పూర్తిగా తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు అలాగే ఔటర్ రోడ్ లో తెనాలి సమీపంలోని చెన్నై, కోల్‌కతా హైవేలో కాజా వరకు దాదాపు 17.5 మేర ఆరు వరుసల అనుసంధాన రహదారి నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టారు. ఫలితంగా రెండు ఇంటర్ చేంజ్ లు తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ఇంటర్ చేంజ్ ల సంఖ్య 17 కు తగ్గింది. మొత్తానికి ప్రాజెక్టు ఖర్చు కూడా 30, 491 కోట్లకు పరిమితమైంది.

ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలంటే

మొదటి ఇంటర్ చేంజ్

కంచికచర్ల నుంచి విజయవాడ హైదరాబాద్ హైవే మీద దీన్ని నిర్మిస్తారు. ఇక్కడ డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు…

రెండవ ఇంటర్ చేంజ్.

కంచికచర్ల మధిర స్టేట్ హైవే క్రాస్ అయ్యే చోట పొన్నవరానికి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డులోని 3.90 కిలోమీటర్ వద్ద దీనిని నిర్మిస్తారు.

మూడవ ఇంటర్ చేంజ్

విజయవాడ ఖమ్మం నాగపూర్ జాతీయ రహదారి క్రాస్ అయ్యే చోట దుగ్గిరాలపాడు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డులోని 18.30 కిలో మీటర్ల వద్ద డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మించబోతున్నారు.

నాలుగవ ఇంటర్ చేంజ్

ఇబ్రహీంపట్నం నుంచి భద్రాచలం మీదుగా ఉత్తరాఖండ్ వెళ్లే హైవే దగ్గర్లోని డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తారు. ఇది ఔటర్ రింగ్ రోడ్డులోని 31.29 కిటకిటల వద్ద ఉంటుంది. మైలవరం సమీపంలో ఉంటుంది.

ఐదవ ఇంటర్ చేంజ్

ఔటర్ రింగ్ రోడ్ లోని 42.50 కిలోమీటర్ వద్ద దీనిని నిర్మించారు. ఇది అడవి నెక్కలం. వెల్వడం రోడ్డు వరకు ఉంటుంది.

ఆరవ ఇంటర్ చేంజ్

అగిరిపల్లి సమీపంలో దీనిని నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్ లోని 47.80 కిలోమీటర్ వద్ద దీనిని నిర్మించారు. ఇది విజయవాడ.. నూజివీడు క్రాస్ దగ్గర నిర్మాణం అవుతుంది.

ఏడవ ఇంటర్ చేంజ్

చెన్నై కోల్కతా హైవేలో పొట్టిపాడు దగ్గర దీని నిర్మిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ లోని 66.1 0 కిలోమీటర్ వద్ద ఇది నిర్మాణం అవుతుంది ..

ఎనిమిదవ ఇంటర్ చేంజ్

గన్నవరం పుట్టగుంట రోడ్డు క్రాస్ ప్రాంతంలో దీన్ని నిర్మిస్తారు

9వ ఇంటర్ చేంజ్

విజయవాడ గుడివాడ సమీపంలో ఉన్న మానికొండ వద్ద దీని నిర్మిస్తారు.

పదవ ఇంటర్ చేంజ్

విజయవాడలోని మచిలీపట్నం హైవే దగ్గరలో చలివేంద్రపాలెం ప్రాంతంలో ఇక్కడ డబుల్ ట్రాంపెట్ నిర్మించారు.

11వ ఇంటర్ చేంజ్..

గుంటూరులోని హనుమాన్ పాలెం రోడ్డు దగ్గర నందివెలుగు ప్రాంతంలో ఇక్కడ ఇంటర్ చేంజ్ నిర్మిస్తారు…

12వ ఇంటర్ చేంజ్

నారాకోడూరు ప్రాంతంలోని బుడంపాడు సమీపంలో డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తారు…

13వ ఇంటర్ చేంజ్

అనంతవరప్పాడు మట్లూరు రోడ్డు ప్రాంతంలో దీనిని నిర్మిస్తారు. దీనిని పూర్తిగా రోటరీ ఇంటర్‌ఛేంజ్ విధానంలో నిర్మిస్తారు…

14వ ఇంటర్ చేంజ్

గుంటూరు ప్రతిపాడు పర్చూరు రోడ్డులో పుల్లడిగుడ్డ ప్రాంతం వద్ద ఇక్కడ రోటరీ ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేశారు

15వ ఇంటర్ చేంజ్

గుంటూరు కి సమీపంలో ఉన్న పొత్తూరు లింగాయపాలెం రోడ్డులో డబుల్ ట్రాంపెట్ ఇంటర్ చేంజ్ నిర్మిస్తారు.

16వ ఇంటర్ చేంజ్

మేడికొండూరు సమీపంలో ఉన్న వినుకొండ గుంటూరు హైవే సమీపంలో దీనిని నిర్మిస్తున్నారు

17వ ఇంటర్ చేంజ్

సత్తెనపల్లి అమరావతి స్టేట్ హైవే సమీపంలో ఉన్న బలుసు పాడు సమీపంలో రోటరీ విధానంలో ఇంటర్ చేంజ్ నిర్మించారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

16 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

16 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

16 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

16 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

16 hours ago