Home క్రీడలుజైలర్ 2 ట్రైలర్: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది.. – RMK NEWS

జైలర్ 2 ట్రైలర్: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


జైలర్ 2 ట్రైలర్: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే కథ కంటే ముందు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ తెరమీద కనిపిస్తే చాలు థియేటర్లో విజిల్స్ పడతాయి. ఇక జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు పెరగడం సహజం. ఆ అంచనాల మధ్య జైలర్ 2 ట్రైలర్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి ముత్తువేల్ పాండియన్ […]

జైలర్ 2 ట్రైలర్: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే కథ కంటే ముందు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ తెరమీద కనిపిస్తే చాలు థియేటర్లో విజిల్స్ పడతాయి. ఇక జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు పెరగడం సహజం. ఆ అంచనాల మధ్య జైలర్ 2 ట్రైలర్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి ముత్తువేల్ పాండియన్ ను రంగంలోకి దించాడు. ట్రైలర్ చూస్తే ఒక్క విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతోంది. ఈసారి సినిమా స్కెల్ మరింత పెంచారు. కానీ కథ కూడా అదే స్థాయిలో పెరిగిందా.. అనేది మాత్రం ట్రైలర్‌లో కనిపించలేదు.

రిటైర్మెంట్ లో ఉన్న వ్యక్తిగా

ట్రైలర్ ప్రారంభంలో ముత్తు వేల్ పాండియన్ రిటైర్మెంట్ లో ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. సాధారణమైన జీవితాన్ని గడుపుతున్న అతనిని మళ్లీ గతం వెంటాడుతూ ఉంటుంది. తనకు సంబంధించిన పాత నెట్‌వర్క్.. కొత్తగా ఏర్పడిన శత్రువులు.. కుటుంబానికి ఎదురవుతున్న ప్రమాదం

సర్ప్రైజ్ ఇవ్వడం చాలా కష్టం

జైలర్ పార్ట్ 1 లో రజనీకాంత్ ను ఒక సాధారణ కుటుంబానికి సంబంధించిన పెద్దగా చూపించారు. అతడిని అసలు క్రమక్రమంగా బయటకి తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చిన విధానం అద్భుతంగా పనిచేస్తుంది. కానీ జైలర్ 2 సినిమాలో ముత్తు వేల్ పాండియన్ ఎవరో ప్రేక్షకులకు తెలుసు. అతడు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో తెలుసు. అతడికి మాస్ ఎలివేషన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు.. అతనికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో అనిరుద్ ఏ స్థాయిలో వాయిస్తాడు కూడా అందరికీ తెలుసు. అలాంటప్పుడు ఈసారి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వడం చాలా కష్టం.

కమియోల ఫెస్టివలా

జైలర్ 2 లో రజనీకాంత్ మాత్రమే కాదు మోహన్ లాల్.. శివ రాజ్ కుమార్.. జాకీ ష్రాఫ్ వంటి పాత పరిచయ ముఖాలు కనిపిస్తున్నాయి.. కొత్తగా ఎస్ జె సూర్య.. విద్యాబాలన్.. మిధున్ చక్రవర్తి వంటి వారు కనిపిస్తున్నారు.. వాస్తవానికి ఇదంతా చూస్తుంటే ఇది సూపర్ స్టార్ సినిమానా లేక కామియోల ఫెస్టివలా అనేది అర్థం కావడం లేదు. మొదటి భాగంలో కమియోలు కథలో భాగంగా వచ్చాయి. ప్రేక్షకులకు ఉత్కంఠను కలగజేసాయి. ఈసారి మాత్రం స్టార్ పవర్ ముందుగానే ప్రమోషన్ లో భాగమైంది.. మోహన్ లాల్.. శివ రాజ్ కుమార్ పాత్రలు మళ్ళీ రావడం అభిమానులకు ఒక రకమైన ఆనందం. కానీ కథలో వాళ్ల ఉనికి ఎంత అవసరం అనేది సినిమా విడుదలైన తర్వాత తేలుతుంది.

ఎస్ జె సూర్య పాత్ర ఆసక్తికరం

ట్రైలర్‌లో ఎస్ జె సూర్య పాత్ర ఆసక్తికరంగా ఉంది.. అతడు విలన్ గా ఉంటాడా.. కథలో భాగంగా వస్తాడా అనేది తేలాల్సి ఉంది. నెల్సన్ అతని పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా ఉంచారు. ఎందుకంటే ఈ సినిమాలో రజనీ తర్వాత ప్రేక్షకుల దృష్టిని నిలబెట్టగలిగే స్థాయి సూర్య మాత్రమే కావచ్చు. విద్యాబాలన్ పాత్రను కూడా రహస్యంగా ఉంచారు. ఈ కథలో ఆమెకు ఎంతవరకు ప్రాధాన్యత ఉందనేది ట్రైలర్ చెప్పలేదు. యాక్షన్ ఉంది.. రజనీకాంత్ తన శత్రువులను మొత్తం ఒకే చోట రప్పించి భారీ దాడికి ప్లాన్ చేసినట్టు కూడా చూపుతున్నారు. చూస్తుంటే సినిమా యాక్షన్ పరంగా ఏమాత్రం తగ్గినట్టే.

ప్రేక్షకులు అవుతారా

యాక్షన్ చూపిస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా.. మొదటి భాగంలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. అంతకుమించి కుటుంబ సంబంధ.. భావోద్వేగాలు.. నెల్సన్ కామెడీ.. రజిని స్క్రీన్ ప్రెజెన్స్ ఇలా అన్ని పని చేశాయి. ఒకవేళ ఈ సినిమా కేవలం యాక్షన్ మీద మాత్రమే ఆధారపడితే అది మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ టాక్సిక్ ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసు.. ఇక ట్రైలర్ లో నెల్సన్ మార్క్ హ్యూమర్ కనిపించారు. సీరియస్‌లో కూడా డెడ్ పాన్ కామెడీ.. విచిత్రమైన పాత్రలు.. ఒక్కసారిగా పేలే యాక్షన్.. ఇవన్నీ కూడా అతని స్టైల్ గుర్తు చేస్తున్నాయి.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

19 hours ago
Good Morning

Good Morning

22 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago