Home జాతీయజీ ఛానల్ అధినేత సుభాష్ చంద్ర ఏం చేయబోతున్నారో తెలుసా – RMK NEWS

జీ ఛానల్ అధినేత సుభాష్ చంద్ర ఏం చేయబోతున్నారో తెలుసా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

సుభాష్ చంద్ర : కొద్దిరోజులుగా జాతీయ మీడియాలో.. అటు గ్లోబల్ మీడియాలో జీ ఛానల్ అధినేత సుభాష్ చంద్ర గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. మనదేశంలో మీడియా మొగల్ లాగా పేరు తెచ్చుకున్నారు సుభాష్ చంద్ర. ఈయన జి ఛానల్ అధినేతగా మనదేశంలో సుపరిచితులు. ఈయన ఆధ్వర్యంలోనే ఎస్ఎల్ గ్రూప్ కొనసాగుతోంది. సుభాష్ చంద్ర ఎల్ గ్రూపును మీడియాకు మాత్రమే పరిమితం చేయలేదు.. మౌలిక సదుపాయాలు.. అమ్యూజ్మెంట్ పార్కుల వరకు విస్తరించారు. సుభాష్ చంద్ర […]

సుభాష్ చంద్ర : కొద్దిరోజులుగా జాతీయ మీడియాలో.. అటు గ్లోబల్ మీడియాలో జీ ఛానల్ అధినేత సుభాష్ చంద్ర గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. మనదేశంలో మీడియా మొగల్ లాగా పేరు తెచ్చుకున్నారు సుభాష్ చంద్ర. ఈయన జి ఛానల్ అధినేతగా మనదేశంలో సుపరిచితులు. ఈయన ఆధ్వర్యంలోనే ఎస్ఎల్ గ్రూప్ కొనసాగుతోంది.

సుభాష్ చంద్ర ఎల్ గ్రూపును మీడియాకు మాత్రమే పరిమితం చేయలేదు.. మౌలిక సదుపాయాలు.. అమ్యూజ్మెంట్ పార్కుల వరకు విస్తరించారు. సుభాష్ చంద్రకు ప్రస్తుతం 75 ఏళ్ల వయసు. ఇటీవల ఆయన 22, 006 రుణానికి సంబంధించి విముక్తి పొందిన తర్వాత.. సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన వీడియో రూపంలో బయటపెట్టారు. తదుపరి తాను ఏం చేయబోతున్నాను క్లారిటీ ఇచ్చారు.

సుభాష్ విడుదల చేసిన వీడియో ప్రకారం ఆయన తదుపరిగా స్విజర్లాండ్ లో పెట్టుబడిదారులతో కలిసి పని చేయబోతున్నట్లు చూపుతున్నారు. అంకుర సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి ఆయన కుటుంబం నుంచి డబ్బును అప్పుగా తీసుకుని అనుకున్నట్టు సమాచారం. 22, 006.57 రుణంలో కొంత మొత్తం మాత్రమే తిరిగి పొందే విధంగా జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ ఇటీవల ఒక రుణ చెల్లింపు ప్రణాళికను ఆమోదించింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

2026 ఆగస్టు చివరి వారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆయన సమర్పించిన రుణ విముక్తి ప్రణాళికను ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే సుభాష్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. స్విజర్లాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలలో పనిచేస్తున్న తన స్నేహితులు.. అసోసియేట్స్‌తో కలిసి ప్రొఫెషనల్ రోల్‌లో పని చేయబోతున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఆయన త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇక అంకుర సంస్థలలో తన కుటుంబ సభ్యుల నుంచి రెండు నుంచి నాలుగు కోట్ల వరకు అప్పుగా తీసుకుంటే.. ఆ డబ్బు వృద్ధి చెందేంత వరకు పెట్టుబడి పెడుతూనే ఉంటానని సుభాష్ చంద్ర ప్రకటించారు. చెల్లించాల్సిన అప్పుల కోసం సుభాష్ చంద్ర తనకు ఉన్న ఆస్తులను అమ్మేశారు. మిగిలిన చివరి 6.5 కోట్లను ఎన్సీఎల్టీ ప్రణాళిక ప్రకారం రుణదాతలకు ఇస్తున్నట్టు ఇటీవల సుభాష్ చంద్ర ప్రకటించారు. ప్రస్తుతం ఆయనకు ఒక ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బులతో తన ఖర్చులు వెల్లడిస్తున్నట్టు సుభాష్ చంద్ర ప్రకటించారు.

తాను వ్యాపార రంగంలో ఎన్నో రకాలుగా సంచలనాలను సృష్టించానని.. శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించిన అనుభవం తనకు ఉందని.. మళ్లీ డబ్బు సంపాదించాలనే నమ్మకం తనకు ఉందని సుభాష్ చంద్ర తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎల్ గ్రూపులో కంపెనీల కోసం సుభాష్ చంద్ర వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చారు. ఆయనపై 22,006 కోట్ల క్లెయిమ్ లు వచ్చాయి. వ్యక్తిగతంగా ఆయన నెట్ వర్త్ తగ్గిపోయిన నేపథ్యంలో కేవలం 6.5 కోట్లు చెల్లించిన సెటిల్‌మెంట్‌కు ఎన్‌సిఎల్‌టి ఆమోదం లభించింది. అయితే కొన్ని బ్యాంకులు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

3 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

3 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

4 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

4 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

5 hours ago