Home జాతీయమంత్రులకు అసెంబ్లీలో షాక్ ఇచ్చిన విజయ్.. – RMK NEWS

మంత్రులకు అసెంబ్లీలో షాక్ ఇచ్చిన విజయ్.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

సీఎం విజయ్: టీవీ కే విజయ్ దూకుడు మీద ఉన్నారు. వందరోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉచిత బంగారం నుంచి మొదలు పెడితే.. విద్యుత్ వరకు దశలవారీగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. తనదైన స్టైల్ లో గ్రీవెన్స్ చేస్తూ వెళ్తున్నారు. విజయ్ అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆకస్మికంగా తన నిర్ణయాలను వెల్లడించడం లేదు. మంత్రివర్గంతో మాట్లాడుతున్నారు. అధికారులతో […]

సీఎం విజయ్: టీవీ కే విజయ్ దూకుడు మీద ఉన్నారు. వందరోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉచిత బంగారం నుంచి మొదలు పెడితే.. విద్యుత్ వరకు దశలవారీగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. తనదైన స్టైల్ లో గ్రీవెన్స్ చేస్తూ వెళ్తున్నారు.

విజయ్ అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆకస్మికంగా తన నిర్ణయాలను వెల్లడించడం లేదు. మంత్రివర్గంతో మాట్లాడుతున్నారు. అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర బడ్జెట్ పరిగణలోకి తీసుకుంటున్నారు. నేల విడిచి సాము చేయడం లేదు. అలాగని తమిళ ప్రజల నిండా నుంచే పథకాలకు శ్రీకారం చుట్టడం లేదు. ప్రజలకు అవసరమైన పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారు. అది కూడా పేదలకు మాత్రమే అవి అందేలా ఆయన రూపొందించారు. అందువల్లే తమిళ ప్రజలు విజయ్ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. విజయ్ పరిపాలన కొనియాడుతున్నారు.

విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా ఉన్నప్పటికీ.. అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విజయ్ నిర్ణయాలు మాత్రమే కాదు.. అప్పటికప్పుడు వేస్తున్నవి కూడా ఏకంగా నేషనల్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. తాజాగా అసెంబ్లీలో విజయ్ చేసిన ఒక పని సంచలనంగా మారింది. అది కాస్త దేశ వ్యాప్తంగా ఆసక్తికర పరిణామంగా రూపాంతరం చెందింది. తమిళనాడు అసెంబ్లీలో మంత్రులకు కేటాయించిన సీట్లలో విజయ్ కూర్చున్నారు. ప్రోడక్ట్ ప్రకారం ముఖ్యమంత్రి కి ముందు వరుసలో స్పీకర్ పోవడానికి దగ్గరగా స్పెషల్ సీటు ఉంటుంది. విజయ్ ఆ ప్రోటోకాల్ బ్రేక్ చేశాడు. తన పక్క సీట్లో ఉన్న మంత్రులు అర్జున.. సెం గొట్టియన్ మధ్యలో కూర్చున్నారు. వారితో అనేక విషయాలు చర్చించారు. తమిళనాడు అసెంబ్లీలో మంత్రుల పక్కన కూర్చొని చర్చలు జరిపిన ముఖ్యమంత్రిగా విజయ్ రికార్డ్ సృష్టించారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కనీసం మంత్రుల సీట్ల వైపు కూడా చూసేవారు కాదు. ప్రోటోకాల్ విషయంలో ఏమాత్రం తగ్గేవారు కాదు. కానీ విజయ్ వాటన్నింటిని బద్దలు కొట్టారు. తనను తాను కామన్ మెన్ సీఎంగా నిరూపించుకున్నారు.

విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా ఉందని.. ఇదేది పీఆర్ స్టంట్ కాదని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ తనకు తానుగా ప్రతి నిర్ణయం తీసుకోవడం లేదని.. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నానని.. ఇది గొప్ప విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయ్ ని చూసి చాలామంది నేర్చుకోవాలని.. ముఖ్యంగా డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మరింత నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

3 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago