Home జాతీయBJPకి ఇది గట్టి హెచ్చరిక! – RMK NEWS

BJPకి ఇది గట్టి హెచ్చరిక! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బీజేపీ

BJP: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ పరంగా బిజెపి బలంగా ఉంది కానీ.. ఆ పార్టీ ఒంటరి బలం మాత్రం తగ్గుతోంది. ఇది హెచ్చరిక లాంటిది. ఆరుట ఇండియా టుడే – సి ఓటర్ నిర్వహించిన నేషన్ మూడ్ లో భారతీయ జనతా పార్టీ కింద ఎన్డీఏ నెలల బలమైన శక్తిగా ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో బిజెపి బలం తగ్గింది. ఎన్డీఏ పరంగా ఇంకా స్థిరంగా కొనసాగుతోంది బలమైన నాయకత్వం. అయితే కాంగ్రెస్ లో స్వల్ప మార్పు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకున్నట్లు ఈ సర్వే తేల్చింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఈ సర్వే తేల్చింది. ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి ఇది హెచ్చరిక లాంటిది. గత ఆరుగా జరిగిన పరిణామాలతోనే జాతీయ స్థాయిలో బిజెపి ప్రభావం తగ్గుతోంది అని స్పష్టం అవుతుంది.

* తగ్గిన బిజెపి బలం..

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియా టుడే- సి ఓటర్. అయితే జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడానికి అవసరమైన 272 ఎంపీ సీట్లు బిజెపి ఒంటరిగా చేరుకునే అవకాశం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 106 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ పరంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సొంతం అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ ఆరు నెలల కాలంలో బిజెపితో పాటు ఎన్డీఏ 26 ఎంపీ స్థానాలు తగ్గిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయం. భారతీయ జనతా పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. అయితే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపితో పాటు ఎన్డీఏ బలం స్థిరంగా ఉండటం ఉపసమనం కలిగించే విషయం.

* ఉత్తరాది రాష్ట్రాల్లో..

ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలుగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లలో బలం తగ్గిన సూచనలు బిజెపికి కనిపిస్తున్నాయి. ఇటీవల జెన్ జి ఉద్యమాలు, ప్రశ్న పత్రాల లీకేజీల వంటి అంశాలు ఆ పార్టీకి మైనస్ గా మారినట్లు అర్థమవుతోంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడంతో ప్రజా వ్యతిరేకత ప్రారంభమైనట్లు స్పష్టమవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో చిన్న సానుభూతి ప్రారంభమైనట్లు ఈ సర్వే ద్వారా. అదే జరిగితే బిజెపి జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఉన్నది మూడు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వానికి. కచ్చితంగా సుస్థిర పాలనతో పాటు ఎటువంటి వ్యతిరేకత తరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే భారతీయ జనతా పార్టీకి చాలా కష్టం అని ఈ సర్వే ద్వారా తేలింది. చూడాలి ఈ సర్వే ఫలితాలు ఎంత ప్రభావం చూపబోతున్నాయో.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

3 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

3 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

3 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

4 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

4 hours ago