Home జాతీయటీవీకే విజయ్ మరో సంచలనం.. తమిళనాడు సీఎం గా త్రిష – RMK NEWS

టీవీకే విజయ్ మరో సంచలనం.. తమిళనాడు సీఎం గా త్రిష – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

TVK విజయ్: నేను ఏదో విధంగా ముంబైకి రాలేదు. ముంబై నగరాన్ని మొత్తం ఏలేయ్యడానికి వచ్చా.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అచ్చం ఈ డైలాగ్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్థానం సాగుతోంది. సరిగ్గా ఇంతకు ముందు పార్టీని ఏర్పాటుచేసిన విజయ్.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తన టీవీ కేను నిలబెట్టారు. భాగస్వామి […]

TVK విజయ్: నేను ఏదో విధంగా ముంబైకి రాలేదు. ముంబై నగరాన్ని మొత్తం ఏలేయ్యడానికి వచ్చా.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అచ్చం ఈ డైలాగ్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్థానం సాగుతోంది.

సరిగ్గా ఇంతకు ముందు పార్టీని ఏర్పాటుచేసిన విజయ్.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తన టీవీ కేను నిలబెట్టారు. భాగస్వామి పక్షాలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏకధాటిగా పరిపాలన సాగిస్తున్నారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు పూర్తిగా ముగింపు పలుకుతూ.. తనదైన శైలిలో పాలిటిక్స్ చేస్తున్నారు. నిజానికి తమిళనాడులో ఇలాంటి పాలిటిక్స్ ఉంటాయని ఎవరు అంచనా వేయలేదు.

ఇటీవలనే వందరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న విజయ్ సరికొత్త శకానికి తమిళనాడు రాష్ట్రంలో నాంది పలికారు. ఇక్కడితోనే విజయ్ ఆగిపోవడం లేదు. తన పరిపాలనకు సంబంధించిన గీటు రాళ్లను.. ఇతర వస్తువులను జాతీయ స్థాయిలో కూడా ఎక్స్‌పోజ్ అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే నేషనల్ మీడియా విజయ్ అడుగుల మీద.. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాల మీద ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడు తమిళనాడు పాలిటిక్స్ మీద.. తమిళనాడు రాజకీయ నాయకుల మీద జాతీయ స్థాయిలో మీడియా ఈ స్థాయిలో ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు.

విజయ్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. తన పరిపాలన.. దాని వెనుక ఉన్న కష్టాలను అన్నింటిని బయటపెడుతున్నాడు. తమిళనాడు ప్రభుత్వం జాతీయ మీడియాలో భారీగానే ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే ఇటీవల ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దేశంలో నరేంద్ర మోడీ.. రాహుల్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాధరణ కలిగిన నాయకుడు.. ఓటర్లను ప్రభావితం చేయగల లీడర్ ఎవరు అని సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో విజయ్ కి అద్భుతమైన మార్కులు పడ్డాయి. ఏకంగా జాతీయ స్థాయిలో విజయ్ మూడో స్థానంలో ఉండటం విశేషం.

ఈ సర్వేలో నరేంద్ర మోడీకి 48.7 శాతం.. రాహుల్ గాంధీకి 27.1%.. విజయ్ కి 9.2 శాతం మంది సపోర్ట్ చేయడం విశేషం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల కాలంలోనే విజయ్ పాపులరిటీ విపరీతంగా పెరిగింది. విజయ్ తర్వాతి స్థానాల్లో మమతా బెనర్జీ 2%.. అఖిలేష్ అభిజిత్ దీప్కె 1.3.. అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతం విజయ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.. విజయ్ ఒకవేళ దేశ రాజకీయాల్లోకి వెళితే.. త్రిష ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

2 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago