Home జాతీయIndia Defense Sector: ఇండియన్ డిఫెన్స్ లోకి ప్రైవేట్ కంపెనీలు.. మోడీ టార్గెట్ ఏంటి.. – RMK NEWS

India Defense Sector: ఇండియన్ డిఫెన్స్ లోకి ప్రైవేట్ కంపెనీలు.. మోడీ టార్గెట్ ఏంటి.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

భారతదేశ రక్షణ రంగం

భారతదేశ రక్షణ రంగం: మనదేశంలో ప్రైవేట్ వ్యవస్థ అన్ని రంగాలకు విస్తరించింది. ఇంతవరకు ప్రైవేట్ రంగం తొంగి చూడని కొన్ని రంగాలు ఉన్నాయి. అందులో డిఫెన్స్ రంగం ముందువరుసలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో కూడా ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చేసారు.

ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీని పూర్తిగా మార్చేయడానికి భారత ప్రభుత్వం ప్రవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. దీని మీద కొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారు.. దేశాన్ని విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకు డిఫెన్స్ రంగంలో అవకాశం కల్పించడం అనేక కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థ ఉంది. వాటిని ఇండియన్ డిఫెన్స్ రంగంలో వాడబోతున్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలతో పోల్చి చూస్తే ప్రైవేట్ కంపెనీలు అత్యంత వేగంగా ఉత్పత్తులను తయారుచేస్తూ ఉంటాయి. అందువల్లే ఆ కంపెనీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచయం చేసింది. ఇక దేశీయంగా చూసుకుంటే రక్షణ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డిఫెన్స్ పరికరాలు తయారు చేయడం వల్ల రవాణా ఖర్చులు పూర్తిగా తగ్గుతాయి. విదేశీ కరెన్సీ భారం తగ్గుముఖం పడుతుంది. ప్రైవేట్ కంపెనీల వల్ల భారతదేశం గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుంది. ఇతర దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే ఆస్కారం లభిస్తుంది.. ఇక తాజా ఒప్పందాల ద్వారా టాటా, రిలయన్స్, ఎల్ అండ్ టి, కళ్యాణి వంటి భారత ప్రైవేట్ కంపెనీలకు ఆర్డర్లు లభించబోతున్నాయి.

రిలయన్స్.. టాటా.. ఎల్ అండ్ టి.. కళ్యాణి గ్రూప్ సంస్థలు ఇప్పటికే మిస్సైల్స్.. యుద్ధ విమానాలు.. సబ్ మెరైన్లు తయారు చేస్తున్నాయి.. భారతదేశ రక్షణ సాంకేతికతను ప్రైవేట్ కంపెనీలతో పంచుకోవడం వెనుక ప్రధాన కారణం కూడా ఒకటుంది. సైనిక ఆధునికీకరణ వేగవంతం చేయడం.. దేశీయ రక్షణ ఉత్పత్తిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం.. ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ డెవలప్ చేసిన టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేస్తోంది. దీనివల్ల వేగవంతమైన భారీ ఉత్పత్తి చోటు చేసుకుంటుంది. ప్రైవేట్ కంపెనీల వద్ద ఉన్న అత్యాధునిక ప్లాంట్లు.. మౌలిక సదుపాయాల ద్వారా ఆయుధాలను వేగంగా తయారు చేయవచ్చు. భారీగా ఉత్పత్తి చేయవచ్చు.. ప్రయోగశాలకే పరిమితమైన సాంకేతికతను ప్రైవేట్ రంగానికి ఇస్తే అవి త్వరగా ఇద్దరంగానికి అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల మీద భారం తగ్గుతుంది.. హెచ్ ఏ ఎల్, బి ఈ ఎల్ వంటి ప్రభుత్వ రక్షణ సంస్థలపై ఉన్న అదనపు పని భారం తగ్గుతుంది. ప్రైవేట్ కంపెనీలను కొనుగోలు చేస్తే ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ప్రైవేట్ రంగంలో పోటీవల్ల రక్షణ పరికరాల తయారీ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. రాడా.. కమ్యూనికేషన్ సిస్టం వంటి వాటి తయారీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పటికే డిఫెన్స్ పరికరాల తయారీ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకు వెళ్తోంది. చైనా కూడా అదే స్థాయిలో ఉంది. ఇజ్రాయిల్.. ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. వీటన్నిటికి చెక్ పెట్టి అగ్రస్థానంలో ఉండాలి అంటే భారత్ కచ్చితంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

3 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

3 hours ago