Home ఆంధ్రప్రదేశ్ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి – RMK NEWS

ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

YSRCP: బాబోయ్ ఇంత ఖర్చా.. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలేదు. నేను చెప్పిన వ్యక్తికి ఏదో కీలకమైన పోస్ట్ ఇచ్చారు. రెండు మూడు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు అంతకుమించి ఖర్చు పెడుతున్నారు. అసలు నాకు ఎందుకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారు.. దీనివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి. ఇప్పటికే లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ప్రతి జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా అయితే కష్టం.. […]

YSRCP: బాబోయ్ ఇంత ఖర్చా.. అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాలేదు. నేను చెప్పిన వ్యక్తికి ఏదో కీలకమైన పోస్ట్ ఇచ్చారు. రెండు మూడు కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు అంతకుమించి ఖర్చు పెడుతున్నారు. అసలు నాకు ఎందుకు ఈ అధ్యక్ష పదవి ఇచ్చారు.. దీనివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి. ఇప్పటికే లెక్కకు మిక్కిలి కేసులు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ప్రతి జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలా అయితే కష్టం.. ఈ పదవి వద్దు.. నాకు ఈ ఖర్చు వద్దు. హాయిగా భార్య పిల్లలతో సంసారం సాగిస్తాను.. ఇది ఆ వైసీపీ నాయకుడు తన సన్నిహితుల వద్ద వెలిబుచ్చుతున్న ఆందోళన.

నిజానికి ఆయన బలమైన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తండ్రి గతంలో మంత్రిగా పని చేశారు. తండ్రి చనిపోవడంతో వారసత్వంగా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో చేద్దామని.. తండ్రి లాగా ఎమ్మెల్యే అయ్యి.. మంత్రి అయ్యి.. తండ్రికి మించిన స్థాయిలో నాలుగు రాళ్లు వెనకేసుకుందామని అనుకున్నారు. కానీ అది అంత ఈజీ కాలేదు. ఎందుకంటే ఆయన తండ్రి వారసత్వం జస్ట్ వైల్డ్ కార్డు లాగానే ఉపయోగపడింది. ఆయనను అది ఎమ్మెల్యే చేయలేకపోయింది. నాటి రోజుల్లో ఆయన భారీగానే ఖర్చుపెట్టేందుకు ఉపయోగం లేకుండా పోయింది.

తొలిసారిగా ఓడిపోవడంతో ఆ పార్టీతో లాభం లేదు అనుకొని బయటికి వచ్చేసారు. మరో పార్టీలో చేరారు. టికెట్ కోసం భారీగానే ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. పైగా ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు కావడంతో ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే మారుమోగింది. చివరికి ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు ఓటమి ఎదురైంది. ఇక తట్టుకోలేక అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అయ్యారు. అక్కడ రాజధానికి దగ్గర్లో ఉన్న ఓ ప్రాంతంలో చక్రం తిప్పారు. నగరపాలక సంస్థలో ఎన్నికల్లో తనకు నచ్చిన. వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఆ తర్వాత నగరపాలక సంస్థ మీద తన అభ్యర్థిని కూర్చోబెట్టారు. కొన్ని రకాల కాంట్రాక్టులు చేశారు. తక్కువలో ఒక 100 వరకు వెనకేసుకున్నారు. ఆ తర్వాత అధికారం పోవడంతో ఆయనకు సినిమా వచ్చింది. పార్టీ అధినేత ఆయనకు ఒక జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ పదవిలో ఉన్న పాపానికి ఆ జిల్లా ఖర్చు మొత్తం తనే భరించాల్సి వస్తోంది. పైగా అధినేత ఏపీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం.. వెళ్తున్నప్పుడు కూడా అదే స్థాయిలో స్వాగతం పలకడం.. జనాలను సమీకరించడం.. మీడియాను మేనేజ్ చేయడం.. ఇవన్నీ కూడా ఆయనకు తలకు మించిన భారం లాగా మారిపోయాయి. ఇక ఈ ఖర్చు తన వల్ల కాదని ఆయన తన అంతరంగికుల వద్ద చెబుతున్నారు. అంతేకాదు తనకు పార్టీ వద్దు.. పదవి కూడా వద్దని తెగేసి చెబుతున్నారు. మరి దీనిపై ఆ పార్టీ అధినేత ఏమంటా చూడాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

1 minute ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

9 minutes ago
Andhra Pradesh Crime : డబ్బులు తీసుకుంటేనే నీ కొడుకు.. -

ఆంధ్రప్రదేశ్ నేరం : సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం కొన్ని రకాల సన్నివేశాలను. కిడ్నాప్ లతోపాటు బెదిరింపుల పర్వం ఓ…

9 minutes ago
భార్యల వివాహేతర సంబంధాలు.. 90 శాతం మగాళ్లు - RMK NEWS

భార్యల వివాహేతర సంబంధాలు: ఆ మధ్య మియాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి ట్యాంక్ బండ్ మీద నుంచి దూకేసి…

9 minutes ago
TDP Jana Sena : చంద్రబాబు–పవన్ భేటీ వెనుక వ్యూహమేంటి? - RMK NEWS

TDP Jana Sena Allianc : ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ఇప్పుడు మరో కీలక రాజకీయ పరీక్షను ఎదుర్కొంటోంది.…

9 minutes ago