Home Uncategorizedసిదిరి అప్పలరాజు తో అంట కాగిన ఫలితం.. కాశిబుగ్గ ఎస్సై –

సిదిరి అప్పలరాజు తో అంట కాగిన ఫలితం.. కాశిబుగ్గ ఎస్సై –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Sidiri Appalaraju: స్నేహం మంచి వాళ్ళతో చేయాలి. ప్రేమ అనురాగం నిండిన వారితో సాగించాలి. బంధం గొప్పవాళ్ళతో పెన వేసుకోవాలి.. ఇలా కాకుండా స్థాయి.. అర్హత లేని వారితో స్నేహం.. ప్రేమ.. బంధాన్ని కొనసాగిస్తే ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఇవి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఎస్సైకి అనుభవంలోకి వచ్చాయి. కాకపోతే ఆయనకు అర్థం అయ్యేలోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ప్రాంతంలో ఓ ఘటన జరిగింది. ఈ […]

Sidiri Appalaraju: స్నేహం మంచి వాళ్ళతో చేయాలి. ప్రేమ అనురాగం నిండిన వారితో సాగించాలి. బంధం గొప్పవాళ్ళతో పెన వేసుకోవాలి.. ఇలా కాకుండా స్థాయి.. అర్హత లేని వారితో స్నేహం.. ప్రేమ.. బంధాన్ని కొనసాగిస్తే ఆ తదుపరి పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.. ఇప్పుడు ఇవి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ఎస్సైకి అనుభవంలోకి వచ్చాయి. కాకపోతే ఆయనకు అర్థం అయ్యేలోపే.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇటీవల శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ప్రాంతంలో ఓ ఘటన జరిగింది. ఈ ఘటనలో గొర్రెల కాపరి కన్నుమూశాడు. అయితే అతడిది సహజమరణం కాదు. దీని వెనక మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు సిదిరి అరవ్ వర్మ ఉన్నాడు. ఈ తీవ్రత తెలిసినప్పటికీ కాశిబుగ్గ ఎస్సై సునీల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనకు కారకలైన వారి మాటలను ఆయన ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో దానయ్య అనే గొర్రెల కాపరి కన్నుమూసిన నేపథ్యంలో.. అతని భార్య ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి బైక్ యజమాని సిద్ధార్థ ను నిందితుడిగా ఎస్ఐ తెలియజేసారు. సాంకేతిక ఆధారాలను విస్మరించారు.

సునీల్ విహరించిన తీరు పట్ల అభియోగాలు వచ్చాయి. పైగా ఆయన అప్పలరాజుకు అనుకూలంగా వ్యవహరించాలని టిడిపి నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. విధులలో చూపిన అలసత్వాన్ని కారణంగా చూపుతూ.. ఆయనను వీఆర్ కు పంపిస్తూ ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కస్టమర్ కి 10న రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు నైట్ రౌండ్స్ లో ఉన్న సునీల్ ఘటన స్థలంలో సిబ్బందితో కలిసి పరిశీలించారు.. అయితే ఇక్కడ సాంకేతిక ఆధారాలను ఆయన విస్మరించారు.

మరోవైపు అరవ్ వర్మ సాధారణ, తాత్కాలిక బెయిల్ విచారణ 20కి వాయిదా పడింది. సాధారణ బెయిల్ కావాలని.. తాత్కాలిక బెయిల్ కావాలని. ఇలా రెండు పిటిషన్ వేశారు. అయితే ఇప్పట్లోనే నిర్ణయం తీసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీనికి తోడు అప్పలరాజు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపై కూడా న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా,ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించడానికి అప్పలరాజు అనేక రకాలుగా ప్రయత్నించారు. చివరికి అడ్డంగా దొరికిపోయారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

2 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

3 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

3 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

3 hours ago