ప్రశ్న రావణ్ కేసు: ప్రశ్న పేరుతో రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఏర్పాటుచేసిన యూట్యూబ్ ఛానల్ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛానల్ కు సీఈవోగా వ్యవహరించిన గమన.. ఆమె సహచరుడు ఇంద్రసేన చౌదరిని పోలీసులు రెండో విడత కూడా విచారించారు. విచారణలో భాగంగా వారి మధ్య జరిగిన ఆర్థిక.. వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు వారు నేరుగా సమాధానం చెప్పకుండా.. పక్కదారి పట్టించే విధంగా మాట్లాడారు. ప్రశ్న […]
ప్రశ్న రావణ్ కేసు: ప్రశ్న పేరుతో రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఏర్పాటుచేసిన యూట్యూబ్ ఛానల్ వ్యవహారంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఛానల్ కు సీఈవోగా వ్యవహరించిన గమన.. ఆమె సహచరుడు ఇంద్రసేన చౌదరిని పోలీసులు రెండో విడత కూడా విచారించారు.
విచారణలో భాగంగా వారి మధ్య జరిగిన ఆర్థిక.. వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంధించిన ప్రశ్నలకు వారు నేరుగా సమాధానం చెప్పకుండా.. పక్కదారి పట్టించే విధంగా మాట్లాడారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్‌కు సాగిన నిధుల ప్రవాహం గురించి పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఛానల్ కు మొత్తం నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. వీటికి ఆదాయ వనరులు ఎక్కడివి.. అనే కోణాలలో ఇంద్రసేన చౌదరిని.. గమనాన్ని పోలీసులు ప్రశ్నించారు.
నగదు బదిలీ విషయంలో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్లు తెలుస్తోంది. నగదు బదిలీ విషయంలో గమన.. ఇంద్రసేన చౌదరి నోరు విపరీతంగా. చానల్లో కంటెంట్ సెలక్షన్.. స్క్రిప్ట్ మేకింగ్ ఇవన్నీ కూడా గమనం చూసుకునే దని సమాచారం. ఇప్పటివరకు గమన ఆధ్వర్యంలో చాలావరకు వీడియోలను అప్‌లోడ్ చేశారు. అందులో మొత్తం విద్వేషపూరితంగా ఉన్నాయి. ఇంద్రసేన చౌదరి సోదరుడు వైసిపి నాయకుడిగా ఉన్నారు. ఇంద్రసేన చౌదరి కి గమనకు బెంగళూరులో పరిచయం అయింది. గమన ఒక బోటిక్ నిర్వహించేది. ఈమెకు రాము అనే భర్త ఉన్నాడు. ఇంద్రసేన చౌదరితో పరిచయం గమనాన్ని తప్పుదారి పట్టించింది. రామును వదిలిపెట్టి గమన ఇంద్రసేన చౌదరికి దగ్గర అయింది.
ఇంద్రసేన చౌదరి, గమన కలిసి అనేక వ్యాపారాలు చేశారు. చివరికి రావణ్ ప్రశ్న ఛానల్ అప్పులలో ఉందని తెలుసుకుని టేక్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఛానల్ కు సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత రావణ్ తో కలిసి గమన వీడియోలు రూపొందించారు. ఇటీవల వైసిపి అధినేత జగన్ ను గన్నవరం విమానాశ్రయంలో గమన కలిశారు. గమన.. ఇంద్రసేన చౌదరి ఉపయోగించిన ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాటా తిరిగి సేకరించి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలలో వీరిద్దరూ అక్రమ మార్గాలను అనుసరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ వీరిద్దరూ అక్రమ దారుల్లో నగదు ప్రవాహాన్ని కొనసాగిస్తే.. ఈ కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.