Home Uncategorizedహైదరాబాద్ క్రైం : ఇంత నిబద్ధత ఉన్న దొంగను మేమెప్పుడూ – Jananethram News

హైదరాబాద్ క్రైం : ఇంత నిబద్ధత ఉన్న దొంగను మేమెప్పుడూ – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Hyderabad Crime : పురుషులందు పుణ్యపురుషులు వేరు అన్నట్టు.. దొంగలందు మంచి దొంగలు వేరు. ఇతడిది మంచి దొంగ కేటగిరి. పాపం దొంగతనం చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి అనేక రకాలుగా రెక్కీ నిర్వహించాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో ప్రవేశించాడు. దొంగతనం చేశాడు. కానీ దొరికిపోయాడు. హైదరాబాద్ నగరంలో పాతబస్తీ ఏరియాలో వాడి ఏ ముస్తఫా ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పీకలదాకా మద్యం తాగిన ఓ దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. […]

Hyderabad Crime : పురుషులందు పుణ్యపురుషులు వేరు అన్నట్టు.. దొంగలందు మంచి దొంగలు వేరు. ఇతడిది మంచి దొంగ కేటగిరి. పాపం దొంగతనం చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి అనేక రకాలుగా రెక్కీ నిర్వహించాడు. ఆ తర్వాత ఓ ఇంట్లో ప్రవేశించాడు. దొంగతనం చేశాడు. కానీ దొరికిపోయాడు.

హైదరాబాద్ నగరంలో పాతబస్తీ ఏరియాలో వాడి ఏ ముస్తఫా ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పీకలదాకా మద్యం తాగిన ఓ దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో నేరుగా ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి బంగారం కనిపించింది. దానిని తన సంచిలో వేసుకున్నాడు.. ఖరీదైన ఫోన్లు.. ఇతర వస్తువులను తస్కరించాడు. వాటిని కూడా తన సంచిలో వేసుకున్నాడు. ఇక వాటిని తనతో పాటు తీసుకెళ్లేందుకే.. అతనిలో మత్తు స్థాయి పెరిగిపోయింది. బయటికి వెళ్లే ఓపిక లేకుండా పోయింది. ఆ గదిలోనే పడుకున్నాడు. మద్యం మత్తు విపరీతంగా ఉండటంతో అక్కడే ఆద మరిచి నిద్రపోయాడు.

ఆ ఇంటి యజమాని తెల్లవారుజామున ఆ గది తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళాడు. గదిలో ఉన్న దృశ్యాన్ని చూసి ఒకసారి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ దొంగ ఆదమరిచి నిద్రపోయాడు. అదే సమయంలో గట్టిగా గురక శబ్దం చేశాడు. ఆ శబ్దమే అతడిని పట్టించింది. ఏదైనా జంతువు ఉందా లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అనుమానంతో తలుపు తీశాడు. తలపు తీయడంతోనే ఆ దొంగ అందులో పడుకొని ఉన్నాడు.

దొంగ గురక శబ్దం పెట్టి పడుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ దొంగ ఖరీదైన వస్తువులను దొంగలించినప్పటికీ.. వాటిని తనతో తీసుకెళ్లే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉండటంతో అతని నోటి నుంచి విపరీతమైన గురక శబ్దం వచ్చింది. దీంతో అతడిని పట్టుకోవడం ఇంటి యజమానికి ఈజీ అయిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. “పురుషులందు పుణ్య పురుషులు వేరు. దొంగలందు మంచి దొంగలు వేరు. ఇతడు మంచి దొంగ. మద్యం మత్తులో దొరికిపోయిన దొంగ. గురక శబ్దంతో పోలీసులకు చిక్కిన దొంగ అంటూ” నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

16 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

16 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

16 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

16 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

16 hours ago