Home అంతర్ జాతీయతానా ఇమ్మిగ్రేషన్ సెమినార్ : ‘ఇమ్మిగ్రేషన్ 360°’ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌పై ‘తానా’ అవగాహన సదస్సు -RMK NEWS

తానా ఇమ్మిగ్రేషన్ సెమినార్ : ‘ఇమ్మిగ్రేషన్ 360°’ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌పై ‘తానా’ అవగాహన సదస్సు -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

తానా ఇమ్మిగ్రేషన్ సెమినార్ : అమెరికాలోని తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శ్రీకారం చుట్టింది. ‘ఇమ్మిగ్రేషన్ 360°’ (ఇమ్మిగ్రేషన్ 360°) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన సదస్సును తానా నిర్వహించనుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తరచూ మారే నిబంధనలు.. వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సాన్ని అధిగమించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కావున అందరూ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదో చక్కటి వేదికగా డా. ఉమాగారు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ న్యాయవాది ముఖ్య వక్తగా ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి హాజరుకానున్నారు. వైఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు (H-1B, గ్రీన్ కార్డ్), కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవలి కాలంలో వచ్చిన కీలక మార్పులు.. తాజా పరిణామాలపై ఆయన సవివరంగా చర్చించనున్నారు.

ముందుగానే ప్రశ్నలు పంపే అవకాశం

ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి సందేహాలు, ఆందోళనలు ఉన్న కమ్యూనిటీ సభ్యులు తమ ప్రశ్నలను సదస్సుకు ముందుగానే సమర్పించే వెసులుబాటును తానా కల్పించింది. ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతినిధులు తమ సమస్యలు లేదా సందేహాలను ఈ ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ముందుగా అందిన ప్రశ్నల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించి సదస్సులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇంకా, హాజరైన వారికి న్యాయవాదితో నేరుగా తమ అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

కమ్యూనిటీకి గొప్ప అవకాశం

అమెరికాలో ఉద్యోగం, విద్య, వ్యాపార నిమిత్తం ఉంటున్న వేలాది మంది తెలుగువారికి ఇమ్మిగ్రేషన్ నియమావళిపై స్పష్టత ఉండటం ఎంతో అవసరం. వివిధ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లు, స్టేటస్ సంబంధిత చిక్కులు, చట్టపరమైన మార్గదర్శకాలపై సరైన సమాచారం లేక ఇబ్బంది పడేవారికి ఈ వేదిక ఒక చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది.

కమ్యూనిటీ సభ్యులందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలి, తమ ప్రశ్నలను పంపడమే కాకుండా, ఈ ‘ఇమ్మిగ్రేషన్ 360°’ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా తానా ప్రతినిధులు. సదస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఆన్‌లైన్ ఫారమ్ లింక్‌ను తానా అధికారిక మాధ్యమాల ద్వారా పొందవచ్చని సూచించారు.

మీ ప్రశ్నలను సమర్పించండి:

https://tinyurl.com/kew2hwr7

సెమినార్‌లో చేరండి
https://us06web.zoom.us/j/81571740663?pwd=dDn5eFF5pfbV24bqDbvRzZK1AodfvX.1

సమావేశం ID: 815 7174 0663
పాస్‌కోడ్: 106437

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago