Home ఆంధ్రప్రదేశ్APSRTC డ్రైవర్ శివ:యముడినే ఎదురించి అమరుడైన ఆర్టీసీ – RMK NEWS

APSRTC డ్రైవర్ శివ:యముడినే ఎదురించి అమరుడైన ఆర్టీసీ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

APSRTC డ్రైవర్ శివ: తనకు మృత్యువు ఎదురుగా నిలిచింది. అయినా అతడు భయపడలేదు. తన ప్రాణం పోయినా సరే తోటి ప్రయాణికులకు ఆపద రాకూడదని అనుకున్నాడు. గుండెల్లో భరించలేని బాధ.. తట్టుకోలేని నొప్పి.. శరీరం సహకరించడం లేదు.. అయినా స్టీరింగ్ మీద పట్టు వదలలేదు. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశాడు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. చివరికి అదే సీటులో కన్నుమూశాడు.. అతని పేరు శివ.. ఇది కేవలం ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణ వార్త […]

APSRTC డ్రైవర్ శివ: తనకు మృత్యువు ఎదురుగా నిలిచింది. అయినా అతడు భయపడలేదు. తన ప్రాణం పోయినా సరే తోటి ప్రయాణికులకు ఆపద రాకూడదని అనుకున్నాడు. గుండెల్లో భరించలేని బాధ.. తట్టుకోలేని నొప్పి.. శరీరం సహకరించడం లేదు.. అయినా స్టీరింగ్ మీద పట్టు వదలలేదు. బస్సును సురక్షితంగా పక్కకు నిలిపివేశాడు. 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. చివరికి అదే సీటులో కన్నుమూశాడు.. పేరు శివ.. ఇది కేవలం ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణ వార్త కాదు.. విధిపట్ల అంకితభావానికి.. నిలువెత్తు మానవత్వానికి బలమైన నిదర్శనం.

ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాన్ని చేర్చడం వారి బాధ్యత. కొన్నిసార్లు వారి బాధ్యత ప్రాణాల కంటే గొప్పగా మారిపోతుంది. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ విషయంలో కూడా ఇదే.

బస్సు ప్రయాణం సాగిపోతుంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా తమ పనుల్లో.. ఆలోచనలలో.. మాటలలో మునిగిపోయారు. కొందరు గమ్యస్థానానికి చేరుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరికొందరు వృత్తి గత.. వ్యక్తిగత పనుల్లో ఉన్నారు. స్టీరింగ్ పట్టుకున్న శివకుమాత్రం ఒక్కసారిగా తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. ఆ క్షణంలో ఆయన ఎంతటి అనుభవించాడో మాటల్లో చెప్పలేం. శరీరం సహకరించలేదు. పరిస్థితి విషమిస్తోంది. అయినా ఆయన తన ప్రాణం గురించి ఆలోచించలేదు. తన చేతుల్లో ఉన్న 40 మంది ప్రయాణికుల భద్రత గురించి మాత్రమే ఆలోచించాడు.

తనకు ఏమవుతుందో తెలియని పరిస్థితిలోనూ శివ బస్సు నియంత్రణ కోల్పోలేదు. ప్రయాణికులకు ఎటువంటి ఘోరం జరగకూడదని ఆలోచనతో బస్సును జాగ్రత్తగా నిలుపుదల చేశాడు. ఒక్కసారి ఆలోచిస్తే వేగంగా ప్రయాణిస్తున్న బస్సులో డ్రైవర్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం ఎదురైతే.. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది.. బస్సు అదుపుతప్పితే ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.. ఒక్క క్షణం కూడా ఎంతటి విషాదానికి దారి తీయవచ్చు.. అలాంటి సమయంలో ప్రయాణికుల భద్రతకు ఎంతో విలువైంది. శివ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. ఒక ఇంటికి ఆధారమైన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అది మాటల్లో చెప్పలేని విషాదం. ఆయన కోసం ఎదురుచూస్తే కుటుంబ సభ్యులకు ఈ నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. అదే సమయంలో ఆయన నడిపిన బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది సురక్షితంగా బయట పడగలిగారనే విషయం మామూలుది కాదు.

శివా.. మీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ మీ చేతిలో ఉన్న స్టీరింగ్ చివరి క్షణం వరకు బాధ్యతగా పట్టుకున్నారు. ఈ తీరు మానవత్వానికి ఒక గుర్తుగా నిలిచిపోతుంది. నీ ప్రాణం నిలవలేదు. కానీ మీ చివరి ప్రయత్నం నల్లమందు ప్రాణాలను కాపాడింది. సెల్యూట్ శివ.. విధిపట్ల మీ అంకిత భావానికి.. ప్రయాణికుల భద్రతకు మీరు ఇచ్చిన ప్రాధాన్యానికి శతకోటి వందనాలు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

2 days ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

2 days ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

2 days ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

3 days ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

3 days ago