గుర్గావ్ వాతావరణం: అప్పటిదాకా ఎండ దంచి కొట్టింది. ఉన్నట్టుండి గాలి మొదలైంది. మేఘాలు ఏర్పడ్డాయి. దట్టంగా చీకటి మాదిరిగా అలముకున్నాయి. అంతే వర్షం మొదలైంది. నింగి నేలమయ్యే విధంగా వర్షం కురిసింది. ఈ వర్షం ఢిల్లీ.. నోయిడా.. గురుగ్రామ్.. ఘజియాబాద్ ప్రాంతాలను ముంచెత్తింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజలు ఉపశమనం పొందారు. వర్షానికి గల కారణాలేంటి అక్టోబర్ నెలలో సాధారణంగా ఈ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. […]
గుర్గావ్ వాతావరణం: అప్పటిదాకా ఎండదాకా దంచి కొట్టింది. ఉన్నట్టుండి గాలి మొదలైంది. మేఘాలు ఏర్పడ్డాయి. దట్టంగా చీకటి మాదిరిగా అలముకున్నాయి. అంతే వర్షం మొదలైంది. నింగి నేలమయ్యే విధంగా వర్షం కురిసింది. ఈ వర్షం ఢిల్లీ.. నోయిడా.. గురుగ్రామ్.. ఘజియాబాద్ ప్రాంతాలను ముంచెత్తింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజలు ఉపశమనం పొందారు.
వర్షానికి గల కారణాలేంటి
అక్టోబర్ నెలలో సాధారణంగా ఈ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఢిల్లీలో ఈ స్థాయిలో భారీ వర్షాలు ఎందుకు కురిశాయి.. దీని వెనుక ఉన్న కారణాలను వాతావరణ శాఖ అధికారులు బయటపెట్టారు. భారత వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం.. వాయవ్య భారత దేశంలో ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఫసిపిక్ లో ఏర్పడిన ఎల్ నీనో.. ఇంకా అనేక రకాల అంశాలు కారణమని వెదర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పశ్చిమ అలజడి
హర్యానా పరిసర ప్రాంతాలలో ఆవర్తనం చోటుచేసుకుందని.. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పశ్చిమ అలజడి కొనసాగుతోందని.. హిమాలయాల్లో ఏర్పడిన పరిస్థితులు ఇందుకు కారణమని తెలుస్తోంది. వాయువ్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వైపు ద్రోణి విస్తరించిందని.. అందువల్ల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల వాతావరణంలో తేమ పెరిగిందని.. గాలి కదలికలు విస్తృతంగా మారిపోయాయని.. అందుకే మేఘాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అధికారులు చెబుతున్నారు.
వాతావరణ శాఖ ముందుగానే..
ఈ మార్పును వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అక్టోబర్ 12న ఉరుములు మెరుపులు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో గంటకు 50 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాకపోతే ఢిల్లీలో గంటకు 60 వేగంతో గాలులు వీచాయి. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జండే వాల ఆలయానికి సమీపంలో భారీగా వర్షం నీరు చేరింది. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ పరిధిలోని ఇతర నగరాల్లో కూడా వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుత ఐఎండీ అధికారుల అంచనా ప్రకారం వచ్చే రోజుల్లో కూడా అనుకూలమైన వెదర్ కండిషన్స్ ఏర్పడితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు కురిసిన భారీ వర్షానికి అప్పటిదాకా ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాకపోతే హిమాలయాలలో ఏర్పడే పరిస్థితులు వాయవ్య భారత దేశంలో వర్షాలకు కారణమవుతున్నాయి.
#WATCH | ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
జంతర్ మంతర్ నుండి దృశ్యాలు https://t.co/cexwSEGwKu
— ANI (@ANI) అక్టోబర్ 11, 2026