YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు మరోసారి వైయస్ కుటుంబంలో చర్చకు దారి తీస్తున్నాయి. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి తన తల్లి వైయస్ విజయమను బరిలోకి దింపారు జగన్. ఇప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా తన బాబాయ్ వైయస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీలమ్మకు అవకాశం కల్పించారు. ఒకప్పుడు తల్లి విజయమ్మ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పులివెందులలో ప్రమిదమ్మ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే […]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు మరోసారి వైయస్ కుటుంబంలో చర్చకు దారి తీస్తున్నాయి. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి తన తల్లి వైయస్ విజయమను బరిలోకి దింపారు జగన్. ఇప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా తన బాబాయ్ వైయస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీలమ్మకు అవకాశం కల్పించారు. ఒకప్పుడు తల్లి విజయమ్మ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పులివెందులలో ప్రమిదమ్మ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి ఆ సమయంలో విశాఖపట్నం పార్లమెంటు స్థానం మీద పట్టు సాధించాలనే లక్ష్యంతో వైసిపి వైఎస్ విజయమ్మను రంగంలోకి దించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయం విజయమ్మకు విజయాన్ని అందించలేకపోయింది.
ఇప్పుడు మరొకసారి వైయస్ కుటుంబానికి చెందిన మహిళకు కీలకమైన ఎన్నికల బాధ్యత అప్పగించారు జగన్. పులివెందుల మున్సిపాలిటీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రమీలమ్మ పేరు ఖరారు చేయడంతో స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. గతంలోనూ ఈ పదవిలో పనిచేసిన ప్రమీలమ్మకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా పులివెందుల మున్సిపాలిటీపై తమ పట్టును కొనసాగించాలని వైసీపీ కోరింది..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పులివెందుల రాజకీయంగా ఎంతో కీలకమైన ప్రాంతం. వైఎస్ఆర్ నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి బలమైన పట్టు ఉంది. వైయస్ వివేకానంద రెడ్డి నియోజకవర్గాలలో కీలకపాత్ర పోషించారు. పులివెందుల మున్సిపాలిటీ రాజకీయాల్లో వైయస్ మనోహర్ రెడ్డి దంపతులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వైయస్ కుటుంబంలో విభేదాలను మరింత లోతుగా చర్చలకు తీసుకొచ్చాయి ఈ పరిణామాలు వైసిపి రాజకీయాలపై కూడా ప్రభావం చూపించాయని విశ్లేషకులు అంటున్నారు.
పులివెందులలో వైసిపికి గతంలో ఉన్న రాజకీయ ఆధిపత్యం ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉందా అంటే.. లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఎన్నికల పరిణామాల నేపథ్యంలో పులివెందుల వైయస్ కుటుంబం పట్టు కోల్పోయిందని తెలుస్తోంది.. స్థానిక ఎన్నికల్లో పార్టీకి అయినా సవాళ్లు.. ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు వైసిపికి సరికొత్తగా మారుతున్నాయి. ఈ పరిస్థితిలో మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మన ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానికంగా కుటుంబ పరిచయాలు.. గతంలో నిర్వహించిన పదవి ద్వారా వచ్చిన అనుభవం.. ఆమెకు ఉపయోగపడుతుందా.. లేదా మారిన రాజకీయ పరిస్థితులు కొత్త సవాళ్లను సృష్టిస్తాయా.. అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రమీలమ్మను ఎంపిక చేయడం ద్వారా జగన్ మరోసారి తన కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు వినిపించే అవకాశం ఉంది. మరోవైపు స్థానికంగా అనుభవం ఉన్న నాయకులకే అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అయితే పులివెందుల రాజకీయాల్లో కుటుంబ ప్రభావం.. స్థానిక నాయకుల బలం.. ప్రజల అభిప్రాయం కీలకంగా మారబోతున్నాయి. ప్రత్యర్థి పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో విజయమ్మకు ఎదురైన పరాజయం అప్పట్లో వైసీపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఇప్పుడు పులివెందులలో ప్రమీలమ్మ అభ్యర్థిత్వం వైయస్ కుటుంబ రాజకీయాలపై ప్రభావం చూపడం. తల్లిని ఎన్నికల బరిలో నిలిపినా విజయం దక్కలేదు. ఇప్పుడు పిన్నికి అవకాశం కల్పించిన జగన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారు. పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ప్రమీలమ్మకు ప్రజల మద్దతు ఎంతవరకు లభిస్తుంది.. రాజకీయాలపై విమర్శకులను వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది.. ఈ ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెబుతాయని విశ్లేషకులు అంటున్నారు.