Home జాతీయNepal Floods : ఆకాశంలో మబ్బు లేదు.. వాన చినుకు కురవలేదు.. నేపాల్ లో వరదలు ఎలా.. – RMK NEWS

Nepal Floods : ఆకాశంలో మబ్బు లేదు.. వాన చినుకు కురవలేదు.. నేపాల్ లో వరదలు ఎలా.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఆకాశంలో మబ్బు లేదు. కనీసం ఒక్క చినుకు కూడా కురవలేదు. అటువంటిచోట ఈ స్థాయిలో వరదలు ఎలా.. ఆకస్మికంగా ఈ జలప్రళయం ఎలా సంభవించింది.. ఈ స్థాయిలో నష్టపోవడానికి కారణం ఏమై ఉంటుంది.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.

నేపాల్ దేశంలో సంభవించిన జలవిలయం సృష్టించిన నష్టం మామూలుగా లేదు. ఆస్తి నష్టం.. ప్రాణ నష్టం వెరసి నేపాల్ దేశం సర్వనాశనమైంది. నిజానికి నేపాల్ దేశంలో వరదలు రావడం.. వర్షాలు విస్తారంగా కురవడం కొత్తేమీ కాదు. గతంలో ఆ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు మాత్రమే వరదలు వచ్చేవి. కానీ ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. అయినప్పటికీ అక్కడ వరదలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్థాయిలో వరదలు రావడం వెనక అసలు కారణం వేరే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

అగ్ర ప్రాంతంలో భారీ మొత్తంలో మంచు ఒక్కసారిగా నదిలో కలవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేపాల్, డిబేట్ దేశాలతో సరిహద్దుల్లో ఉన్న బోటే కోసి నదికి త్రిశూల్, లెండే కోలా వంటి ఉపనదులు ఉన్నాయి. బుధవారం ఈ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో గెలిచి అనే అడుగుల ఎత్తులో ఉన్న నాలుగు అడుగుల దూరంలో సముద్ర మట్టానికి 17వేల ఎత్తులో ఉన్న ఒక హిమ నదిలోకి దాదాపు 2 వేల విస్తీర్ణంలో మంచు ఫలకం వేరుపడింది. దీంతో కోలా నదిలో ప్రవాహం పెరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న మట్టి.. రాళ్లు భారీగా తోసుకొని వచ్చాయి. ఆ ప్రవాహం అత్యంత వేగంగా బోటే కోసి నదిలోకి వచ్చేసింది. ఫలితంగా జల విస్ఫోటనం జరిగింది. ఆ ప్రవాహం దూసుకు వచ్చి.. తనకు అడ్డుగా ఉన్న ప్రతి నిర్మాణాన్ని పడగొట్టుకుంటూ వచ్చింది.

ఈ ప్రమాదానికి కేవలం మంచు గడ్డ విరిగి పడటమే కాకుండా.. కొండ చరియలు విరిగిపడడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల బోటే కోసి నది కేంద్రంగా ఏర్పాటు చేసిన 12 జల విద్యుత్ కేంద్రాలు.. వంతెనలు మొత్తం కూలిపోయాయి. ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే కేవలం 30 నిమిషాల్లోనే నది ప్రవాహం 30 అడుగులకు పెరిగింది అంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

7 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

29 minutes ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

33 minutes ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

33 minutes ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

33 minutes ago