TANA immigration 360 seminar : అమెరికాలో ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర తెలుగు సంఘం (తానా) ముందడుగు వేసింది.. ‘ఇమ్మిగ్రేషన్ 360°’ (ఇమ్మిగ్రేషన్ 360°) పేరుతో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో ‘జూమ్’ మాధ్యమం ద్వారా ఒక ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తరచూ మారే నిబంధనలు.. వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు అమెరికాలోని తెలుగువారికి ఎంతగానో ఉపయోగపడింది. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) పర్యవేక్షణలో తెలుగువారు తమతమ సమస్యలను చెప్పుకొని వాటికి పరిష్కారాలను తెలుసుకున్నారు.

కీలక అవగాహన కల్పించిన ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారు
ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ న్యాయవాది ముఖ్య వక్తగా ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి హాజరైన తెలుగు వారికి అవగాహన కల్పించారు.. వైఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు (H-1B, గ్రీన్ కార్డ్), కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవలి కాలంలో వచ్చిన కీలక మార్పులు.. తాజా పరిణామాలపై ఆయన సవివరంగా వివరించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనలు, ఉద్యోగ అనుమతులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అనుబంధమైన నిబంధనలు, వీసా ప్రక్రియలు, సాధారణంగా ఎదురయ్యే న్యాయపరమైన సంబంధిత కమ్యూనిటీ సభ్యులకు ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి స్పష్టత ఇచ్చారు.. పలు కీలక అంశాలను వివరించారు.

సదస్సులో H-1B, F-1 వంటి వీసా విభాగాలు, తాజా వీసా మార్పులు, అనుమతులు (ఉపాధి ఆథరైజేషన్), రిమోట్ వర్క్‌కు సంబంధించిన మార్గదర్శకాలు వంటి వాటిని ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి అవగాహన కల్పించారు. వాటికి పరిష్కారాలు కల్పించారు.. అలాగే యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలు, ప్రయాణ పరిమితులపై కూడా వివరాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి తమ వ్యక్తిగత ఇమ్మిగ్రేషన్ సందేహాలను నేరుగా అడిగిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. దీంతో వీసా, విద్య, ప్రయాణం వంటి ఉద్యోగ కమ్యూనిటీ సభ్యుల ప్రశ్నలకు ఆటార్నీ.ఆర్. సోమిరెడ్డి నుంచి సమాధానాలు పొందారు.
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తరచూ మారుతున్న నేపథ్యంలో.. పరిణామాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి : డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల)
డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారు మాట్లాడుతూ.. ”ఇమ్మిగ్రేషన్ అనేది ఇప్పుడు ఎంతో మంది భారతీయుల కలలు, ఆశయాలు, వారి భవిష్యత్తును నిర్దేశించే ప్రక్రియగా మారింది. ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో ఎంతో మంది ప్రొఫెషనల్ ఉద్యోగులు, విద్యార్థులు కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. అందుకోసమే తానా తరుఫున ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అవగాహన కల్పించి.. అనుభవజ్ఞులైన అటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారితో ఉద్యోగుల సమస్యలపై పరిష్కారానికి చొరవ చూపాలంటే ఈ సెమినార్ ను ఏర్పాటు చేశాం. లీగల్ గా ఎదురైన వారికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని అన్నారు.

ఈ సందర్భంగా తానా తరుఫున ఈ జోడించిన తానా పెద్దలందరికీ ఉమా గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యాంకర్ లావణ్య గూడూరు సంధానకర్తగా వ్యవహరించిన ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అటార్నీ గారికి సమాధానాలు రాబట్టారు.
ఈ కార్యక్రమంలోనే తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారు ఫోన్ కాల్ ద్వారా ఇంతటి అద్భుతమైన ఇమ్మిగ్రేషన్ సెమినార్ కండెక్ట్ చేసిన డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారికి.. అలాగే ఈ సెమినార్ లో పాల్గొంటున్న తన ఫ్రెండ్ అయిన ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదొక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారని ప్రశంసించారు.
*ముందుగానే ప్రశ్నలు పంపించేలా ‘డా.ఉమా’ గారు చొరవ
ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి సందేహాలు, ఆందోళనలు ఉన్న కమ్యూనిటీ సభ్యులు తమ ప్రశ్నలను సదస్సుకు ముందుగానే సమర్పించే వెసులుబాటును తానా ఆధ్వర్యంలో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతినిధులు తమ సమస్యలు లేదా సందేహాలను ఈ ఫారమ్ ద్వారా నమోదు చేయడం నిపుణులతో వారి సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలను సూచించారు. ముందుగా అందిన ప్రశ్నల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించి సదస్సులో ప్రత్యేకంగా చర్చించారు.. ఇంకా, హాజరైన వారికి న్యాయవాదితో నేరుగా మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. దీనితో డా. ఉమాగారి ముందు చూపు వల్ల ఎంతో మంది అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్యతో బాధపడుతున్న తెలుగు వారు తమ సమస్యలకు పరిష్కారాలను వెతుకుతున్నారు. దీనితో ఈ అవగాహన సదస్సు డా. ఉమాగారి చొరవతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
అమెరికాలో ఉద్యోగం, విద్య, వ్యాపారం కోసం వేలాది మంది తెలుగువారికి ఇమ్మిగ్రేషన్ నియమావళి చేరువై పెద్ద సంఖ్యలో ఈ అవగాహన సదస్సులో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లు, స్టేటస్ సంబంధిత చిక్కులు, చట్టపరమైన మార్గదర్శకాలపై సరైన సమాచారం లేక ఇబ్బంది పడిన వారికి ఈ వేదిక ఒక చక్కటి పరిష్కారంగా నిలిచింది.
కమ్యూనిటీ సభ్యులందరూ ఈ సద్వినియోగం చేసుకున్నారు. డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో ఈ ‘ఇమ్మిగ్రేషన్ 360°’ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
‘ఇమ్మిగ్రేషన్ 360°’ అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ కావడానికి సహకారం అందించిన తానా ఫౌండేషన్ ట్రస్ట్రీ సతీష్ మేక, యూత్ కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ కొంపల్లి, ఓహియో వ్యాలీ రీజినల్ రిప్రెంజేటివ్ ప్రదీప్ చందనం, శ్రీదేవి దొంతి, యాంకర్ లావణ్య డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
* తానా ‘ఇమ్మిగ్రేషన్ 360°’ అవగాహన సదస్సు పూర్తి వీడియో కింద లింక్‌లో చూడొచ్చు.