YS Jagan: 2019 ఎన్నికల్లో భారీగా స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది వైసిపి. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు పాటు ఏపీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందని.. తను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ చెప్పుకొచ్చారు. తన గురించి తరతరాలు చెప్పుకునే విధంగా పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన.. హామీగానే మిగిలిపోయింది. మాట కార్యరూపం దాల్చలేదు. పైగా జనం నెత్తి మీద పెట్టుకుంటే.. వారి నెత్తిని అడుగు దాకా తొక్కారు. […]
వైఎస్ జగన్: 2019 ఎన్నికల్లో భారీగా స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది వైసిపి. ఆ తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు పాటు ఏపీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందని.. తను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ చెప్పుకొచ్చారు. తన గురించి తరతరాలు చెప్పుకునే విధంగా పరిపాలన సాగిస్తానని హామీ ఇచ్చారు.
ఆయన హామీ ఇచ్చిన.. హామీగానే మిగిలిపోయింది. మాట కార్యరూపం దాల్చలేదు. పైగా జనం నెత్తి మీద పెట్టుకుంటే.. వారి నెత్తిని అడుగు దాకా తొక్కారు. పైగా ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులతో రాజకీయాలు చేశారు. ఒక రకంగా ఏకపక్ష విధానాలు.. పార్టీ కోసం కష్టపడితే వారిని బయటికి గంటి వేయడాలు.. టిడిపి.. జనసేన నాయకులు మీద బూతులు తిట్టించడాలు జరిగాయి. చివరికి టిడిపి కేంద్ర కార్యాలయం మీద కూడా దాడులు చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పరిపాలన కాలంలో జరిగిన దారుణాలు మామూలువి కావు. వాటి గురించి రాస్తే పుస్తకం అవుతుంది. ముచ్చట లాగా చెబితే సినిమా అవుతుంది.
2024 లో వైసీపీకి టిడిపి కూటమి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇంకోసారి వై నాట్ 175 అనే నినాదాన్ని వల్లించకుండా చేసింది. ఏకంగా 11 స్థానాలకు వైసీపీని పరిమితం చేసింది. చివరికి ప్రతిపక్ష హోదాను కూడా దూరం చేసింది. ఏ సభలో అయితే వికృత వ్యాఖ్యలు చేసి.. రాక్షసానందం పొందారో.. అదే సభలో వైసిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు చంద్రబాబు. అయితే ఇప్పుడు వైసీపీ పతనం అక్కడితోనే ఆగిపోవడం లేదు. కూటమిలో కుంపట్లు వస్తాయని.. నేతలు ఎవరి దారి వారు చూసుకుంటారని వైసిపి నేతలు అనుకుంటుంటే.. క్షేత్రస్థాయిలో అంతకుమించిన విషయాలు తెలుస్తున్నాయి. వైసిపి వేస్తున్న అంచనాలు దింపుతున్నప్పుడు కళ్ళం ఆశలని అర్థమవుతున్నాయి.
తాజాగా వెలువడుతున్న రాజకీయ విశ్లేషణల ప్రకారం 20వ తేదీ నాటికి వైసిపి ఏపీలో ఉండదని.. బంగాళాఖాతంలో కలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఆ పార్టీ తుడిచిపెట్టుకొని పోయిందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వన్ సైడ్ ఫలితాలు వైసిపికి వచ్చాయి. కానీ వై వి సుబ్బారెడ్డి.. విజయ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర రాజకీయాలలో పదేపదే వేలు పెట్టారు. చివరికి ఎమ్మెల్యేలకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి అవకాశం లేకుండా చేశారు. వారి లేఖలను బుట్ట దాఖలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మజ్జి శ్రీను.. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే.. ఇంకా చాలామంది టిడిపిలో చేరారు. ఈ జాబితాలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స సత్యనారాయణ.. ధర్మాన ప్రసాదరావు మాత్రమే మిగిలే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా కోస్తా ఆంధ్ర.. రాయలసీమ.. ఇతర ప్రాంతాల్లో కూడా వైసిపికి ఏమాత్రం సానుకూల అంశాలు లేవు. నాయకులలో ఐకమత్యం లేకపోవడం.. కుంభకోణాలు.. అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం.. పార్టీ కోసం చేసే పని వారిని బయటకి గెంటివేయడం వంటి పరిణామాల వల్ల వైసీపీ దారుణమైన పరిస్థితి నెలకొంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి పెద్దగా అభ్యర్థులు కూడా లేరని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే వైసీపీకి ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయం.. సంక్షేమం విషయంలో దూకుడు కొనసాగుతోంది. రాజధాని విషయంలో.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో.. ఇంకా అనేక విభాగాల్లో కూటమి ప్రభుత్వం దూకుడు చూపుతోంది. ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం మరింత బలపడింది. పవన్ కళ్యాణ్ కూడా ఐకమత్యంగా ఉండి పని చేసుకుంటూ పోతున్నారు.
ఇది కాస్త ఇబ్బందికర పరిణామంగా వైసీపీకి మారుతోంది. అంతేకాదు పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఆ 11 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఇక అదే గనుక కంటిన్యూ అయితే 2034 నాటికి వైసిపి బంగాళాఖాతంలో కలవడం ఖాయమని అంటున్నారు. అప్పటికి నాయకత్వం మీద నమ్మకం ఎలాగూ ఉండదు కాబట్టి రాయలసీమ రెడ్లు.. జగన్ కట్టకట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో జగన్ టచ్ లో ఉంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో గనక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసులు మెడమీద వేలాడుతుంటాయి. బెయిల్ కూడా లభించదు. అప్పుడు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది కాబట్టి.. తన ప్రయోజనాల కోసం జగన్ ఏమైనా చేస్తారు. తన తండ్రి చావుకు రిలయన్స్ కారణమని అప్పట్లో జగన్.. సాక్షి పత్రిక ఘోషించారు. సీన్ కట్ చేస్తే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పిన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు జగన్. దీనిని బట్టి జగన్ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఒక రాజకీయ నాయకుడి విషయంలో ఇలాంటి వ్యక్తిత్వాలు ఉండటం.. చివరికి తండ్రి చావు విషయంలో కూడా రాజకీయాలు చూడడం వంటి పరిణామాలు వైసీపీని బొంద పెడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.