Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో భార్య, ఇద్దరు పిల్లల్ని.. మరో కుటుంబంలో ముగ్గురిని.. మొత్తంగా ఆరుగురిని హతమార్చి రాజ్ కుమార్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు.. ఆరుగురిని చంపిన తర్వాత అతడు తన సొంత కారులో కొంత దూరం తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును వదిలిపెట్టి పారిపోయాడు. ఈ దారుణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతడికి అప్పగించాలని మృతుల కుటుంబాల వారు డిమాండ్ చేశారు. రోడ్డుమీదికి ఆందోళనలు కూడా చేశారు. […]
Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో భార్య, ఇద్దరు పిల్లల్ని.. మరో కుటుంబంలో ముగ్గురిని.. మొత్తంగా ఆరుగురిని హతమార్చి రాజ్ కుమార్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు.. ఆరుగురిని చంపిన తర్వాత అతడు తన సొంత కారులో కొంత దూరం తీసుకెళ్లాడు. ఆ తర్వాత కారును వదిలిపెట్టి పారిపోయాడు.
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన తర్వాత అతడికి అప్పగించాలని మృతుల కుటుంబాల వారు డిమాండ్ చేశారు. రోడ్డుమీదికి ఆందోళనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఏకంగా ఏడు బృందాలను రాజ్ కుమార్ ఆచూకీ నియమించింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ ఈ కేసును స్వయంగా డీల్ చేస్తున్న నేపథ్యంలో.. పోలీసులు రాజ్ కుమార్ ను పట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 14 మంది గాలింపు చేస్తున్నారు. ఈ దారుణానికి గురైన తర్వాత రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ మీద నిలుచున్నాడు. రైలు వచ్చేవరకు నిలబడి ఉన్నాడు. చివరి నిమిషంలో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. రాజ్ కుమార్ ఏకంగా నాలుగు ఫోన్లు. అయితే హత్యల తర్వాత వాటిని వాడకుండా వదిలేశాడు. అతని కోసం బెంగళూరు.. శ్రీశైలం హైవేల పక్కన ఉన్న హోటల్స్.. లాడ్జిలలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో కూడా రాజ్ కుమార్ శ్రీశైలం వెళ్ళాడు . చాలా రోజులపాటు అక్కడే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి గాలించారు. రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఆచూకీ అతని కుటుంబ సభ్యులను.. స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాజ్ కుమార్ దొరికాడని.. పోలీసులు ఎన్కౌంటర్ చేశారని.. వార్తలు వచ్చాయి. పోలీసులు అధికారికంగా దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మరొకవైపు రాజ్ కుమార్ అత్యంత పకడ్బందీగా తప్పించుకుని తిరుగుతున్నాడని.. గతంలో కూడా అతడు ఇదే విధంగా పరారీలో ఉన్నాడు. బెయిల్ అవుతుందని తెలుసుకున్న తర్వాత బయటికి వచ్చాడు. ఇప్పుడు కూడా అతడు అదే ధోరణిలో కొనసాగుతున్నాడని.. తన జాడ తెలియకుండా పడుతున్నాడని స్థానికులు అంటున్నారు. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న రాజ్ కుమార్ ఎప్పుడు దొరుకుతాడో చూడాల్సి ఉంది.